Jr NTR: తారక్ పుట్టినరోజున అభిమానులకు స్పెషల్ ట్రీట్?!

నందమూరి అభిమానులు చాలాకాలంగా ఆకలి మీద ఉన్నారు. రెండేళ్లుగా జూనియర్ ఎన్టీఆర్ ఒక్క సినిమా విడుదల కాకపోగా విడుదలైన బాబాయ్ బాలయ్య సినిమాలు అభిమానులను నిరాశ పరిచాయి. ఇక అన్న కళ్యాణ్ రామ్ సినిమాలూ అంతే. అయితే.. ఈసారి ఎలాగైనా అభిమానుల నిరాశ, నిరాశక్తిని పటాపంచెలూ చేయాలని గట్టిగానే ప్రయత్నాలు చేస్తున్నారు నందమూరి హీరోలు.

Jr NTR: నందమూరి అభిమానులు చాలాకాలంగా ఆకలి మీద ఉన్నారు. రెండేళ్లుగా జూనియర్ ఎన్టీఆర్ ఒక్క సినిమా విడుదల కాకపోగా విడుదలైన బాబాయ్ బాలయ్య సినిమాలు అభిమానులను నిరాశ పరిచాయి. ఇక అన్న కళ్యాణ్ రామ్ సినిమాలూ అంతే. అయితే.. ఈసారి ఎలాగైనా అభిమానుల నిరాశ, నిరాశక్తిని పటాపంచెలూ చేయాలని గట్టిగానే ప్రయత్నాలు చేస్తున్నారు నందమూరి హీరోలు. బాలయ్య ఇప్పటికే బోయపాటితో కలిసి అఖండగా గర్జన మొదలుపెట్టగా సినిమా మీద భారీ అంచనాలే నెలకొన్నాయి. ఇక జూనియర్ ఆర్ఆర్ఆర్ ప్రపంచస్థాయిలో మరోమారు మన సినిమా మరిగిమ్రోగడం ఖాయంగా కనిపిస్తుంది.

ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ పనులలో బిజీగా ఉన్న తారక్.. ఇప్పటివరకు వచ్చిన రెండేళ్ల గ్యాప్ ను భర్తీ చేస్తూ వరస సినిమాలకు సిద్దమవుతున్నాడు. ఆర్ఆర్ఆర్ తర్వాత త్రివిక్రమ్ శ్రీనివాస్ తో సినిమా ఉంటుందని అనుకుంటుండగా ఊహించనివిధంగా ఉగాది రోజున దర్శకుడు కొరటాలశివతో సినిమా ప్రకటన వచ్చేసింది. కొరటాల సినిమా చివరి దశకు చేరగానే కేజీఎఫ్ తో పాన్ ఇండియా దర్శకుడిగా పేరుతెచ్చుకున్న కన్నడ దర్శకుడు ప్రశాంత్ నీల్ సినిమాను కూడా మొదలుపెట్టనున్నాడట. ప్రశాంత్ ప్రస్తుతం ప్రభాస్ హీరోగా సలార్ తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే.

సలార్ సినిమా పూర్తికాగానే తారక్ సినిమా మొదలుకానుందట. ఇప్పటికే ఎన్టీఆర్‌–ప్రశాంత్‌ నీల్‌ మధ్య కథా చర్చలు కూడా జరగగా ఈ సినిమా అధికారిక ప్రకటన త్వరలోనే రానుందని చెప్తున్నారు. మే 20న ఎన్టీఆర్‌ పుట్టినరోజు సందర్భంగా అభిమానులకు ఈ సినిమా పోస్టర్ ద్వారా స్పెషల్ ట్రీట్ ఇవ్వనున్నారని ఒక ప్రచారం జరుగుతుంది. అదే రోజున ఆర్ఆర్ఆర్, కొరటాల సినిమాలకు సంబంధించి పోస్టర్స్ విడుదల చేయనుండగా అదే రోజున ప్రశాంత్ నీల్ సినిమాను ప్రకటించి పోస్టర్ రిలీజ్ చేసి అభిమానులలో ఫుల్ జోష్ నింపాలని సన్నాహాలు చేస్తున్నట్లుగా తెలుస్తుంది. మరి ఇది ఎంతవరకు నిజమో తెలియాలంటే మే 20 వరకు ఆగాల్సిందే!

Read: Uttarakhand: బ‌ద్రీనాథ్ ఆల‌యంపై మ‌ల్లెలు చ‌ల్లిన‌ట్లుగా మంచు వ‌ర్షం!

ట్రెండింగ్ వార్తలు