Population In Metro Cities : మెట్రో నగరాలపై విపరీతంగా పెరుగుతున్న జనభారం

Metro City Population : లక్షల మందికి వసతులు.. కోట్ల మంది జీవనం.. నరకప్రాయం అవుతున్న నగర జీవనం.. జనాభా పెరుగుతోంది. మెట్రో నగరాలు ఇబ్బడి ముప్పడిగా విస్తరిస్తున్నాయి. వసతులే పెరగడం లేదు. సెంటర్ ఆఫ్ కంట్రీ ఇష్యూగా మారుతున్నాయి.

Special Focus On Population Growth In Metro Citie

Population In Metro Cities : విలాసవంతమైన విల్లాలు అందమైన బిల్డింగులు ఆకర్షించే షాపింగ్ మాల్స్ మైమరపించే సినిమా థియేటర్లు మెట్రో నగరాల్లో ఇవన్నీ ఒకటి అయితే.. కనిపించని మరో కోణం నరకప్రాయం.. రోజు రోజుకు ఉన్న నగరాల్లో తాగునీటి కష్టాలు ట్రాఫిక్ ఇక్కట్లు వర్షాలకు మునిగిపోవడం వంటివి పెరిగిపోతున్నాయి. ఉపాధి కోసమో చదువు కోసమో వస్తున్న వారితో ప్రతి ఏటా నగరాల్లో రద్దీ పెరిగి సమస్యలకు కేరాఫ్‌గా మారుతున్నాయి. లక్షల మందికి వసతులు.. కోట్ల మంది జీవనం.. నరకప్రాయం అవుతున్న నగర జీవనం.. జనాభా పెరుగుతోంది. మెట్రో నగరాలు ఇబ్బడి ముప్పడిగా విస్తరిస్తున్నాయి. వసతులే పెరగడం లేదు. సెంటర్ ఆఫ్ కంట్రీ ఇష్యూగా మారుతున్నాయి.

Read Also : సచివాలయంలో రేవంత్ రెడ్డిని కలిసిన ఎమ్మెల్యేలు ఏలేటి మహేశ్వర్ రెడ్డి, రామారావ్ పటేల్, పైడి రాకేశ్ రెడ్డి

నరకప్రాయంగా నగర జీవనం :
ఉద్యోగం కోసమో వ్యాపారం కోసమో చదువు కోసమో నగరాలకు చేరుకునే వారి సంఖ్య ఎప్పటికప్పుడు పెరిగిపోతుంది. మెట్రో నగరాలపై ఒత్తిడి పెరిగి వసతులు సరిపోవడం లేదు. బిల్డింగులు షాపింగ్ మాల్స్ వంటి ప్రైవేట్ సెక్టార్ ఫెసిలిటీస్ ఎన్ని పెరుగుతున్నానిత్యం అందుబాటులో ఉండాల్సిన నీళ్ళు రోడ్లు డ్రైనేజీ వసతులు పెరగడం లేదు. నగరాలు అడ్డు అదుపు లేకుండా విస్తరించుకుంటూ పోతున్నాయి. కానీ, వసతులే మెరుగుపడడం లేదు. దీంతో నగర జీవనం నరకప్రాయంగా మారుతుంది. ముంబై, బెంగళూరు, పూణే, చెన్నై, హైదరాబాద్ వంటి మెట్రో నగరాలకు యువత పరుగులు పెడుతోంది. మెట్రో నగరాల్లో ఉంటేనే భవిష్యత్తు బాగుంటుందని అంచనాలతో మారుమూల గ్రామాల్లో పదో తరగతి పూర్తి చేసిన వాళ్లు కూడా నగరాలకు చేరుకుని ఉపాధి వెతుక్కుంటున్నారు.

కొన్ని నగరాల్లో అయితే కోటి దాటి జనాభా జీవిస్తోంది. చాలదన్నట్లుగా రెగ్యులర్‌గా నగరాలకు వచ్చి పోయే వాళ్ళు లక్షల్లోనే ఉంటారు. వసతుల కల్పన ప్రభుత్వ సవాల్‌గా మారుతుంది. మెట్రో నగరాలు రాష్ట్రాలకు ఆదాయం మార్గాలు. రెవెన్యూ పరంగా స్టేట్ ఇన్కమ్‌లో ఎక్కువ శాతం మెట్రో నగరాల నుంచి వస్తోంది. అయితే, ప్రభుత్వాలు కూడా మెట్రో నగరాల్లో వసతులు పెంచి పెట్టుబడులను ఆకర్షించేందుకు ప్రయత్నిస్తున్నాయి. అడ్డగోలుగా నిర్మాణాలు చేస్తున్నారు. వర్షాలు పడినప్పుడు సిటీ మధ్యలో ఉన్న చెరువు నిండితే నీరు బయటకు వెళ్లే పరిస్థితి లేదు. ఆ నీళ్లతో కాలనీలకు కాలనీలో మునిగిపోతున్నాయి.

మెట్రో నగరాల్లో మరో ప్రాబ్లం.. తాగునీటి సమస్య.. :
రెస్టారెంట్లు హాస్టల్లో ఇండ్లు షాపింగ్ మాల్స్ ఇలా అన్నింటిలో నీటి వినియోగం పెరిగిపోయింది. కానీ, నగరాలకు వస్తున్నా నీటి సరఫరా మాత్రం డిమాండ్‌కు తగ్గట్టుగా ఉండడం లేదు. పెరుగుతున్న జనాభా అవసరాలకు అనుగుణంగా ప్రభుత్వాలు డ్యామ్ నుంచి నీళ్లు తెచ్చి సరఫరా చేస్తున్న డిమాండ్‌కు తగ్గ సప్లై మాత్రం చేయలేకపోతున్నాయి. దాంతో నగరాల గొంతు ఎండిపోతోంది. ట్రాఫిక్ కష్టాల గురించి అయితే చెప్పాల్సిన అవసరమే లేదు. రావడం అంటేనే నరకప్రాయంగా మారుతుంది. గంటల తరబడి ఎండ వాన అని తేడా లేకుండా ట్రాఫిక్‌లో చుక్కలు చూస్తున్నారు సిటిజనం. వర్షాలకు దెబ్బతిన్న గుంతల రోడ్లతో తీవ్ర అవస్థలు పడుతున్నారు.

ఎప్పుడైనా నగరాలు ఉపాధికి కేరాఫ్‌గా ఉంటున్నాయి ఒకే దగ్గర సాఫ్ట్‌వేర్ కంపెనీలు హాస్పిటల్స్, షాపింగ్ మాల్స్ ఉండడంతో నిరుద్యోగులకు జాబ్ వేట ఈజీ అవుతుంది. పైగా మెట్రో సిటీల్లో క్వాలిటీ ఎడ్యుకేషన్ దొరుకుతుందని పిల్లల చదువు కోసం చాలామంది నగరాల్లోనే సెటిల్ అవుతున్నారు. కారణం ఏదైనా.. నగరాలకు తరలిస్తున్న జనాభా పెరిగిపోతూ వస్తోంది. ఢిల్లీ, పూణే, బెంగళూరు లాంటి నగరాలు ఇంకా విస్తరించడానికి అవకాశం లేదు. ఇప్పటికే చుట్టుపక్కల గ్రామాలు చిన్న మున్సిపాలిటీలను మెట్రో సిటీల్లో కలిపేశారు. ఇంకా నగరం విస్తరించి అవకాశం లేదు. కానీ, ఈ నగరాలకు వస్తున్న జనాభా మాత్రం ప్రతి ఏటా పెరుగుతుంది. దీంతో నీళ్లు, ట్రాఫిక్ ముంపు సమస్యలు, మెట్రో సిటీస్‌‌ను వెంటాడుతున్నాయి. అందుకే నగరాలను ఖాళీ చేయాలని చెప్పే పరిస్థితి వచ్చేసింది.

Read Also : Heavy Rain in Hyderabad : మళ్లీ వానచ్చె.. హైదరాబాద్‌లో భారీ వర్షం.. లోతట్టు ప్రాంతాలు జలమయం

ట్రెండింగ్ వార్తలు