KTR : హైదరాబాద్‌లో దేశంలోనే అతిపెద్ద భూకుంభకోణం.. రేవంత్ సర్కార్‌పై కేటీఆర్ సంచలన కామెంట్స్

KTR : కాంగ్రెస్ ప్రభుత్వం హైదరాబాద్ లో అతిపెద్ద భూ కుంభకోణానికి తెరలేపిందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

KTR : హైదరాబాద్‌లో దేశంలోనే అతిపెద్ద భూకుంభకోణం.. రేవంత్ సర్కార్‌పై కేటీఆర్ సంచలన కామెంట్స్

KTR

Updated On : November 21, 2025 / 1:40 PM IST

KTR : కాంగ్రెస్ ప్రభుత్వం హైదరాబాద్‌లో అతిపెద్ద భూ కుంభకోణానికి తెరలేపిందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు.. ఎక్కడ ప్రభుత్వ భూములున్నా రేవంత్ ముఠా వాలిపోతుందని కేటీఆర్ తీవ్రస్థాయిలో ఆరోపణలు చేశారు. భారతదేశంలోనే అతిపెద్ద భూ కుంభకోణం హైదరాబాద్ లో జరుగుతుందని అన్నారు. సుమారు 9,300 ఎకరాల ప్రభుత్వ భూమిని తన వర్గీయులకు సీఎం రేవంత్ రెడ్డి కట్టబెట్టాలని చూస్తున్నారని కేటీఆర్ ఆరోపించారు.

బాలానగర్ పరిసరాల్లో సుమారు 9,300 ఎకరాల భూ కుంభకోణం జరుగుతోంది. బాలానగర్, కాటేదాన్, జీడిమెట్ల, నాచారంలోని పారిశ్రామిక వాడల్లో భారీ మొత్తంలో ప్రభుత్వ భూములను కొట్టేసే ప్రయత్నం చేస్తున్నారు. ఎకరానికి రూ.40లకోట్లు వేసుకున్నా రూ.4లక్షల కోట్ల కుంభకోణం. మూసీ ప్రాజెక్టు పేరుతో మరో కుంభకోణంకు తెరలేపారు. జపాన్ లో ఉన్నప్పుడు కూడా ఆ భూమికి సంబంధించిన ఫైల్ పై రేవంత్ ఆదేశాలు ఇచ్చారని కేటీఆర్ అన్నారు. భూములు ఎక్కడ చేతులు మారినా రేవంత్ రెడ్డికి కప్పం కట్టాల్సిందే. బీజేపీకి చిత్తశుద్ది ఉంటే భూ కుంభకోణాలను అడ్డుకోవాలి. మేం అధికారంలోకి రాగానే భూ కుంభకోణాలపై విచారణ చేయిస్తామని కేటీఆర్ అన్నారు.

ప్రభుత్వ భూములను ప్రైవేట్ వ్యక్తులకు దారాదత్తం చేస్తున్నారని కేటీఆర్ ఆరోపించారు. ప్రతీ ప్రభుత్వం పారిశ్రామికవేత్తలకు రాయితీలు ఇస్తోంది. బీఆర్ఎస్ హయాంలో 2022లో భూముల రెగ్యులేషన్ కు చట్టం తెచ్చాం. భూములకు వందశాతం ఫీజు కట్టేలా నిబంధన చేర్చాం. వేరే వాళ్లకు అమ్ముకుంటే రెండు వందల శాతం చెల్లించాలి. కానీ, కాంగ్రెస్ ప్రభుత్వం నిబంధనలు పట్టించుకోకుండానే భూ కేటాయింపులు చేసింది. 30శాతం కడితే రెగ్యులర్ చేస్తామని ఉత్తర్వులు ఇచ్చారని కేటీఆర్ ఆరోపించారు.