Heavy Rain in Hyderabad : మళ్లీ వానచ్చె.. హైదరాబాద్‌లో భారీ వర్షం.. లోతట్టు ప్రాంతాలు జలమయం
Heavy Rain in Hyderabad : హైదరాబాద్ నగరంలో భారీ వర్షం కారణంగా లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. నగర ప్రజలు లోతట్టు ప్రాంతాల వాళ్ళు జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచించారు.

Heavy Rain in Hyderabad
Heavy Rain in Hyderabad : హైదరాబాద్ నగరంలో భారీ వర్షం కురిసింది. పలు ప్రధాన ప్రాంతాల్లోని గచ్చిబౌలి మాదాపూర్ చందానగర్ మియాపూర్ కూకట్ పల్లి, శేర్లింగంపల్లి పటాన్‌చెరు బిహెచ్ఇఎల్‌లో వర్షం కురిసింది. అటు ఓయూ తార్నాక హబ్సిగూడ నాచారం మల్లాపూర్ లోనూ వాన పడింది. వనస్థలిపురం, హయత్ నగర్ మీర్పేట్ పరిధిలోనూ వర్షం పడింది. నగర ప్రజలు లోతట్టు ప్రాంతాల వాళ్ళు జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచించారు. భారీ వర్షం కారణంగా లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి.
హైదరాబాద్‌లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షం కురిసింది. శేర్లింగంపల్లి సర్కిల్ పరిధిలో 6 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. చందానగర్‌లో ఐదు సెంటీమీటర్లు రామచంద్రాపురంలో నాలుగు సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ప్రజలు ఇళ్లలోనే ఉండాలని, వర్షం పడుతున్నప్పుడు చెట్ల కింద హోల్డింగ్ల సమీపంలో ఉండరాదని జీహెచ్ఎంసీ అధికారులు హెచ్చరించారు.
మరోవైపు.. తమిళనాడులో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దక్షిణ తమిళనాడు జిల్లాను వర్షాలు ముంచెత్తుతున్నాయి. నిండు వేసవిలో వరుణుడి ప్రతాపం చూపిస్తున్నాడు. కన్యాకుమారి తేని టెన్కాసి, కోయంబత్తూరు తిరునల్వేలి తూత్తుకుడి జిల్లాల్లో నాలుగు రోజులుగా కుండపోత వర్షాలు పడుతున్నాయి. సేలం ధర్మపురి కృష్ణగిరి తిరుపూర్ బిరుదునగర్, నీలగిరి జిల్లాలకు వచ్చే రెండు రోజులు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది.
కొన్ని ప్రాంతాల్లో మూడు డిగ్రీల ఉష్ణోగ్రతలు పడిపోయాయి. భారీగా కురుస్తున్న వర్షాలకు కొన్ని జిల్లాల్లో జలపాతాలు పొంగి పొందుతున్నాయి. నీలగిరి పర్వత శ్రేణుల్లో ఏడతెరిపిలేని వర్షాలు కురుస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో ఊటీ ప్రయాణాన్ని వాయిదా వేసుకోవాలని పర్యటకులను తమిళనాడు అధికారులు కోరుతున్నారు. తమిళనాడులోని కొన్ని ప్రాంతాల్లో ఉరుములు మెరుపులతో కూడిన వర్షం పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ సూచించింది.