కిలాడీ లేడీ.. భర్త, అత్తామామలు చనిపోయారంటూ ఆస్తులు విక్రయం.. ఆలస్యంగా వెలుగులోకి ఘటన

Forged Documents  : మేడ్చల్ జిల్లాలోని యాప్రాల్‌లో వృద్ధుడిని, అధికారులను ఓ కిలాడీ లేడీ బురిడీ కొట్టించింది.

కిలాడీ లేడీ.. భర్త, అత్తామామలు చనిపోయారంటూ ఆస్తులు విక్రయం.. ఆలస్యంగా వెలుగులోకి ఘటన

fraud woman

Updated On : November 21, 2025 / 2:51 PM IST

Forged Documents  : మేడ్చల్ జిల్లా యాప్రాల్‌కు చెందిన వృద్ధుడిని, అధికారులను ఓ కిలాడీ లేడీ బురిడీ కొట్టించింది. చనిపోయిన ఒక వ్యక్తిని తన భర్తగా చూపించి ఫ్యామిలీ సర్టిఫికెట్ తీసుకుంది. అంతేకాదు.. మృతుడు తండ్రి, తల్లి కూడా చనిపోయారంటూ అధికారులను తప్పుదారి పట్టించి మృతుడి పేరుపైన ఉన్న ఆస్తులను అమ్ముకుంది. ఆలస్యంగా విషయం తెలుసుకున్న వృద్ధ దంపతులు లబోదిబోమంటున్నారు.

యాప్రాల్ కు చెందిన సుమన్ గత ఏడాది అక్టోబర్ నెలలో అనారోగ్యం కారణంగా చనిపోయాడు. అయితే, సుమన్ భార్యనంటూ దాసరి లక్ష్మీ ఫ్యామిలీ సర్టిఫికెట్ తీసుకుంది. పనిలోపనిగా సుమన్ తండ్రి రాములు కూడా చనిపోయినట్లు అధికారులను నమ్మించి సర్టిఫికెట్ పొందింది. ఆ తరువాత మృతుడు సుమన్ పేరుపై ఉన్న స్థలాలు, వాహనాలను అమ్ముకుంది. ఆలస్యంగా విసయం తెలుసుకున్న రాములు అల్వాల్ తహసీల్దార్ కార్యాలయంకు వెళ్లి ఫిర్యాదు చేశాడు. పోర్జరీ పత్రాలతో వృద్ధుడిని, అధికారులను కిలాడీ లేడీ తప్పుదారి పట్టించి ఫ్యామిలీ సర్టిఫికెట్ పొందినట్లు గుర్తించారు.

దాసరి లక్ష్మీ అనే మహిళ తన భర్త, అత్తమామలు చనిపోయినట్లు సర్టిఫికెట్ పొంది వాహనాలను విక్రయించిందని తెలుసుకున్న రాములు ఖంగుతిన్నాడు. తన వాహనాలు పోయాయని అంబర్ పేట్ లోని పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు. మరోవైపు.. దాసరి లక్ష్మీ అనే మహిళ ఫోర్జరీ డాక్యుమెంట్స్ క్రియేట్ చేసిందని తెలుసుకొని అల్వాల్ పోలీసులకు తహసీల్దార్ ఫిర్యాదు చేశాడు.

రాములు మీడియాతో మాట్లాడుతూ.. అసలు లక్ష్మీ అనే మహిళ తన కోడలు కాదని చెప్పాడు. తన కోడుకుతో అక్రమ సంబంధం పెట్టుకొని ఫోర్జరీ డాక్యుమెంట్లతో స్థలాలు, వాహనాలు అమ్ముకుందని రాములు ఆవేదన వ్యక్తం చేశాడు. తమకు న్యాయం చేయాలని అధికారులను కోరాడు.