Vegetable Farming : కాక్ నూర్ కేరాఫ్ కూరగాయలు.. ఊరంతా కూరగాయల సాగు

ఇక్కడి రైతులంతా ఎకరం, రెండు, మూడు ఎకరాల సన్న చిన్నకారు రైతులే. ఇంటిల్లిపాది వ్యవసాయంపై ఆధారపడి జీవించే కుటుంబాలే.. తక్కువ నీరు.. తక్కువ పెట్టుబడి.. రోజు ఆదాయం.. దగ్గరలో మార్కెటింగ్‌ సదుపాయం ఉండటంతో ఒకరి తర్వాత.. ఒకరు, ఇలా కూరగాయలను సాగు చేస్తూ.. కళకళలాడుతున్నాయి.

Vegetable Farming : అది ఒక చిన్న గ్రామం. ఆ గ్రామంలో సుమారు 300 కుటుంబాలు నివాసం ఉంటున్నాయి. అందరూ వ్యవసాయంపైనే ఆదారపడి జీవిస్తున్నారు. అయితే ఆ గ్రామంలో ఎక్కడా చూసినా కూరగాయ తోటలే దర్శనమిస్తాయి. ఖరీఫ్ లో వరి పండించినా.. రబీలో మాత్రం కూరగాయు, ఆకుకూరలు సాగుచేస్తారు. కొంతమంది పొలం వద్దే వ్యపారులకు అమ్ముతుండగా.. మరికొంత మంది రైతులు ఊరూరు తిరుగుతూ.. కూరగాయలు అమ్మి అధిక లాభాలను పొందుతున్నారు.

READ ALSO : Income From Floriculture : కూరగాయలతో పాటు కనకాంబరాల సాగు… పూలసాగుతో నిత్యం ఆదాయం

ఈ ఊరే కాన్ కూరు గ్రామం. మంచిర్యాల జిల్లా, జైపూర్ మండలంలో ఉన్న ఈ గ్రామంలో మొత్తం 300 కుటుంబాలు ఉన్నాయి. అందరికీ వ్యవసాయ భూములు ఉన్నాయి. ఖరీఫ్ లో చాలా వరకు కూరగాయ పంటలతో పాటు కొద్ది విస్తీర్ణంలో వరిని సాగుచేస్తూ ఉంటారు. ఇక రబీకి వచ్చే సరికి పూర్తిగా కూరగాయలు , ఆకుకూరలే పండిస్తారు.

ఆ గ్రామంలో ప్రతి  రైతు పది గుంటల నుండి రెండు మూడు ఎకరాల వరకు కూరగాయలు పండిస్తారు. ఒకే పంట కాకుండా పలు రకాల కూరగాయలు, ఆకుకూరలు పండిస్తున్నారు. ఎక్కువగా తోట, పాల, చుక్క కూరలను పండిస్తున్నారు. వాటితో పాటు ఉల్లి, కొత్తిమీర, క్యాబేజీ, మిర్చి, టమాటా, కంది, బెండకాయ, సొరకాయ, బీరకాయ, వంకాయ, చిక్కుడుకాయ, మొక్కజొన్న, గోరుచిక్కుడు వంటి కూరగాయలను సాగు చేస్తున్నారు.  వచ్చిన దిగుబడులను పొలం వద్దే వ్యాపారులకు అమ్ముతూ.. మంచి లాభాలను ఆర్జిస్తున్నారు.

READ ALSO : vegetables Cultivation : అర ఎకరంలో 16 రకాల కూరగాయల సాగు.. ఏడాదికి రూ.1 లక్షా 50 వేల ఆదాయం

ఇక్కడి రైతులంతా ఎకరం, రెండు, మూడు ఎకరాల సన్న చిన్నకారు రైతులే. ఇంటిల్లిపాది వ్యవసాయంపై ఆధారపడి జీవించే కుటుంబాలే.. తక్కువ నీరు.. తక్కువ పెట్టుబడి.. రోజు ఆదాయం.. దగ్గరలో మార్కెటింగ్‌ సదుపాయం ఉండటంతో ఒకరి తర్వాత.. ఒకరు, ఇలా కూరగాయలను సాగు చేస్తూ.. కళకళలాడుతున్నాయి.

సంప్రదాయ పంటలను సాగుచేస్తే పంట కాలం పూర్తయితే తప్పా డబ్బులు రావు. అదికూడా 5 నుండి 6 నెలల సమయం పడుతుంది. అయితే ప్రకృతి సహకరించి, మార్కెట్ లో మంచి ధర పలికితేనే లాభాలను పొందవచ్చు. అదే తక్కువ పెట్టుబడి.. తక్కువ సమయంలో చేతికొచ్చే కూరగాయల పంటలను సాగుచేస్తే రైతుకు ప్రతి రోజు ఆదాయం లభిస్తూ ఉంటుంది..  మార్కెట్ లో కూడా మంచి డిమాండ్ ఉండటంతో అందరూ వీటి సాగుకే మొగ్గుచేపుతున్నారు.

READ ALSO : Cultivation of vegetables : ప్రకృతి వ్యవసాయంలో కూరగాయల సాగు.. ఏడాది పొడవునా దిగుబడులు

ట్రెండింగ్ వార్తలు