Cultivation of vegetables : ప్రకృతి వ్యవసాయంలో కూరగాయల సాగు.. ఏడాది పొడవునా దిగుబడులు

ఒక పంట తరువాత మరో రకం కూరగాయ పంటలను సాగుచేస్తూ .. ఏడాదంతా దిగుబడి వచ్చే విధంగా ప్రణాళికలను రూపొందిస్తున్నారు. వచ్చిన దిగుబడిని స్థానిక మార్కెట్ లో అమ్ముతూ.. మంచి ఆదాయం గడిస్తున్నారు రైతు తాళం వినాయక్.

Cultivation of vegetables : ఆహారం విషతుల్యం అవుతుంది. ఆరోగ్యం నాశనం అవుతుంది. ఏం తినాలన్న దిగులే. అధిక దిగుబడుల కోసమని పంటల సాగులో పెరిగిపోతున్న రసాయనాల వినియోగం వలన, పంటల నాణ్యత తగ్గడంతో పాటు మనుషులకు చేటు జరుగుతుంది. రసాయనాలు లేకుండా ప్రకృతి సహజసిద్ధంగా పంటలు పండించుకుంటే రైతుకు మంచి ఆదాయం, ప్రజలకు మంచి ఆరోగ్యం చేకూరుతుంది.

అదే లక్ష్యంతో తూర్పుగోదావరి జిల్లాకు చెందిన తాళం వినాయక్ అనే రైతు ప్రకృతి విధానంలో కూరగాయలు పండిస్తూ.. మంచి లాభాలను ఆర్జిస్తున్నారు.  సొర, దొండ,  కాకర , మరోవైపు మిరప తోట,వంటివాటిని ఐదున్నర ఎకరాల్లో పూర్తిగా ప్రకృతి విధానంలో సాగవుతున్నాయి.

READ ALSO : Mixed Farming : రైతుకు భరోసానిస్తున్న మిశ్రమ వ్యవసాయం.. పలు పంటల సాగు విధానంతో స్థిరమైన ఆర్థిక వృద్ధి

ఈ కూరగాయల క్షేత్రం తూర్పుగోదావరి జిల్లా, ఉండ్రాజవరం మండలం, శివటం గ్రామంలో ఉంది. వీటిని సాగుచేస్తున్న ఈ రైతే తాళం వినాయక్. గత  20 ఏళ్లుగా కూరగాయలను పండిస్తున్నారు. స్థానికంగా దొరికే కర్రలను ఉపయోగించి పందిళ్లు వేసి వాటిపైకి తీగజాతి పంటలను పాకిస్తున్నారు.

ఒక పంట తరువాత మరో రకం కూరగాయ పంటలను సాగుచేస్తూ .. ఏడాదంతా దిగుబడి వచ్చే విధంగా ప్రణాళికలను రూపొందిస్తున్నారు. వచ్చిన దిగుబడిని స్థానిక మార్కెట్ లో అమ్ముతూ.. మంచి ఆదాయం గడిస్తున్నారు రైతు తాళం వినాయక్.

READ ALSO : Herbal Supplement : పశువుల్లో రోగనిరోధక శక్తిని పెంచే హెర్బల్ మిక్చర్

ప్రకృతి విధానంలో పంటల సాగు కొంత కష్టం అనిపించినా.. పెట్టుబడి తక్కువగా ఉండి.. రాబడి ఎక్కువ ఉంటుందని రైతు వినాయక్ చెబుతున్నాడు. ప్రకృతి సహజసిద్ధంగా పంట సాగు చేయడం వల్ల భవిష్యత్తు తరాలకు ఆరోగ్య వంతమైన జీవనాన్ని ఇవ్వచ్చంటున్నారు.

ట్రెండింగ్ వార్తలు