80 Students Sick : మ‌ధ్యాహ్న భోజ‌నంలో బ‌ల్లి.. 80 మంది విద్యార్థులు అస్వ‌స్థ‌త

విద్యార్ధులకు పెట్టే మ‌ధ్యాహ్న భోజ‌నంలో మరోసారి నిర్లక్ష్యం జరిగింది. విద్యార్ధులకు పెట్టిన భోజనంలో బ‌ల్లి కనిపించింది. బల్లి ఉన్న భోజనం తిన్న 80 మంది విద్యార్థులు అస్వ‌స్థ‌త.

dead lizard in mid-day meals..80 school students sick : మ‌ధ్యాహ్న భోజ‌నం వండి విద్యార్ధులకు పెట్టే ప్రక్రియలో పరిశుభ్రత పాటించాలని..అత్యంత జాగ్రత్తగా ఉండాలని ప్రభుత్వాలు చెబుతునే ఉన్నాయి. కానీ మరోసారి విద్యార్ధులకు పెట్టే మ‌ధ్యాహ్న భోజ‌నంలో నిర్లక్ష్యం జరిగింది. క‌ర్నాట‌క‌లోని హ‌వేరి జిల్లాలో విద్యార్దులకు వడ్డించిన మ‌ధ్యాహ్న భోజ‌నంలో బల్లి వచ్చింది. బల్లి ఉన్న భోజనాన్ని తిన్న 80మంది విద్యార్ధులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు.

Read more : Mandela cell key auction : నెల్సన్‌ మండేలా జైలుగది తాళంచెవి వేలం..జాతి సంపదల వేలం ఆపాలని సౌతాఫ్రికా డిమాండ్

వెంక‌టాపుర తండాలో ఉన్న గవర్నమెంట్ స్కూల్‌లో బల్లి ఉన్న భోజనం తిన్న 80మంది విద్యార్ధులు తీవ్ర అస్వస్థతకు గురికావటంతో వారిని హుటాహుటిన రాణిబెన్నూరు ప‌ట్ట‌ణంలో ఉన్న ప్ర‌భుత్వం ఆస్ప‌త్రికి తరలించి చికిత్సనందిస్తున్నారు. చికిత్స తరువాత పిల్లలు కోలుకోవటంతో అంతా కాస్తంత ఊపిరి పీల్చుకున్నారు. పిల్లలంతా బాగానే ఉన్నామని వారిని హాస్పిట‌ల్ నుంచి డిశ్చార్జ్ చేసామని స్కూల్ అధికారులు తెలిపారు.

కానీ పిల్లల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని విద్యార్ధుల తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు. అదృష్టవశాత్తు ఎవ్వరికి ఏమీ జరగలేదు..కానీ ఏమన్నా జరగరానిది జరిగితే బాథ్యత ఎవరిది? ఇటువంటిది మరోసారి జరుగకుండా ఉండేలా నిర్ల‌క్ష్యంగా వ్య‌వ‌హ‌రించిన స్కూల్ యాజ‌మాన్యంపై చ‌ర్య‌లు తీసుకోవాల‌ని డిమాండ్ చేయటంతో జిల్లా యంత్రాంగం అధికారుల్ని ఆదేశించింది.

Read more : Ganges Water : చనిపోయాడని నిర్దారించిన వైద్యులు.. నోట్లో గంగాజలం పోయగానే లేచి కూర్చున్నాడు

కాగా మ‌ధ్యాహ్న భోజ‌నంలో నిర్లక్ష్యం పలుమార్లు పలు ప్రాంతాల్లో బయటపడుతునే ఉంది. ఇటీవ‌ల త‌మిళ‌నాడులో కూడా పురుగుల‌తో ఉన్న కుళ్లిన గుడ్లను మిడ్‌డే మీల్‌లో పిల్ల‌ల‌కు పెట్టారు. ఆ ఘ‌ట‌న‌లోనూ విద్యార్థులు అనారోగ్యానికి గరైన విషయం తెలిసిందే.

ట్రెండింగ్ వార్తలు