pet parrots Missing : తప్పిపోయిన చిలుకను తెచ్చిస్తే రూ. 10 వేల బహుమతి

పెంపుడు జంతువు, పక్షులపై వ్యక్తులకు ఉండే ప్రేమ..వాటిపై పెంచుకున్న మమకారం ఎంతో బలంగా ఉంటుంది.అవి కనిపించకపోయినా..వాటికి అనారోగ్యం చేసినా వాటి యజమానులు బాధపడిపోతారు. వాటి కోసం ఏమైనా చేస్తారు. అలా ఓ వ్యక్తి తన పెంపుడు చిలుక కనిపించటంలేదని దాన్ని తెచ్చిస్తే బహుమానం ఇస్తానని ప్రకటించాడు.

pet parrots missing

pet parrots missing : నా చిట్టి చిలుక తప్పిపోయింది. దాని ఆచూకీ చెప్పినా, పట్టి తెచ్చి ఇచ్చినా రూ.10,000లు బహుమతిగా ఇస్తాను అంటూ ప్రకటించాడు ఓ వ్యక్తి. తన చిలుక కనిపించకుండాపోయిందని దానిని తనకు తెచ్చిస్తే రూ.10వేలు బహుమతిగా ఇస్తానంటు పోస్టర్లు వేయించాడు. ఆటోల్లో మైకులు పెట్టి మరీ ప్రచారం చేయిస్తున్నాడు. కానీ ఆయన పెంపుడు చిలుకు ఆచూకీ లభించలేదు. దీంతో పాపం అతనితో పాటు అతని కుటుంబం అంతా తెగ దిగులుపడిపోతోంది.

మధ్యప్రదేశ్‌(Madhya Pradesh)లోని దమోహ్ జిల్లా(Damoh District)కు చెందిన దీపక్ సోనీ (Deepak Soni)అనే వ్యక్తి తన కుటుంబంతో నివసిస్తున్నారు. వారు ఓ రామచిలుకను పెంచుకుంటున్నారు. వారి కుటుంబంలో మనిషిలా కలిసిపోయింది. అటువంటి చిలుకు కనిపించకపోవటంతో కుటుంబం అంతా దిగులుపడ్డారు. ఒకసారి బయటకు ఎగిరి వెళ్లి తిరిగి వచ్చేసేసింది. అలాగే మరోసారి కూడా చిలుక బయటకు ఎగిరి వెళ్లటంతో తిరిగి వచ్చేస్తుందనుకున్నారు. కానీ రాలేదు. రోజులు గడుస్తున్నా చిలుక ఇంటికి తిరిగిరాకపోవటంతో దీపక్ కుటుంబం ఆందోళన చెందారు. ఎక్కడెక్కడో వెదికారు. కానీ కనిపించలేదు.దీంతో తమ చిలుక ఆచూకీ చెప్పినా..పట్టిచ్చినా రూ.10వేలు బహుమతిగా ఇస్తామని ప్రకటించారు.

ఆ చిలుకంటే తమ కుటుంబానికి ఎంతో ఇష్టమని..అదిలేక అందరు బెంగతో దిగులుపడుతున్నారంటూ మైకుల్లో ప్రకటిస్తు వాపోయాడు. కానీ తమ చిలుక జీవించే ఉందా? లేదా ఏ కుక్కలకైనా ఆహారంగా మారిపోయిందా? అని ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. చిలుకపై బెంగతో ఆహారం తినకుండా కుటుంబం అంతా దిగులుపడుతున్నారంటూ వాపోయాడు.

గతంలో కూడా తమ పెంపుడు జంతువులు, పక్షులు తప్పిపోయినవారు ఇలాంటి ప్రకటనలు ఇచ్చిన సందర్భాలున్నాయి. పెంపుడు జంతువు, పక్షులపై వ్యక్తులకు ఉండే ప్రేమ..వాటిపై పెంచుకున్న మమకారం ఎంతో బలంగా ఉంటుంది.అవి కనిపించకపోయినా..వాటికి అనారోగ్యం చేసినా వాటి యజమానులు బాధపడిపోతారు. వాటి కోసం ఏమైనా చేస్తారు. అలా మనుషులకు, జంతువులు,పక్షులకు అవ్యాజమైన బంధం ఉంటుంది.

 

ట్రెండింగ్ వార్తలు