Tomato Prices : విమానం టికెట్ కొంటే టమాటాల ఫ్రీ .. హాట్ కేకుల్లా అమ్ముడైన టికెట్లు, టమాటాలా మజాకానా..!

ఏ ట్రిక్ చేసైనా వ్యాపారాన్ని డెవలప్ చేసుకోవటంలో ఇటీవల వ్యక్తులు బాగా స్మార్ట్ అయిపోయారు. పోటీ తట్టుకుని వ్యాపారంలో నిలబడాలంటే వినూత్నంగా ఏదోకటి చేయాలి. కష్టమర్లను ఆకట్టుకోవాలి. అది షాపు పేరైనా సరే..ఉచితం అనే ప్రకటన అయినా సరే..ప్రస్తుతం టమాటాల ధరలు భారీగా పెరిగిపోవటంతో వ్యాపారులు టమాటాలను ఆశపెట్టి కష్టమర్లను ఆకట్టుకునే పనిలో పడ్డారు.

travel agency offers free book flight tickets tomatoes: ఆ..రండి బాబూ రండీ..టమాటాలండీ ఫ్రీ బాబూ ఫ్రీ.. ఫ్రీ అనే మాట వినిపిస్తే చాలు ఠక్కుని వచ్చేస్తున్నారు జనాలు. అలా ఉంది ప్రస్తుతం టమాటాల ధరలు. ఇదే అదనుగా కొంతమంది వ్యాపారులు కష్టమర్లను ఆకట్టుకోవటానికి టమాటాలు ఫ్రీ అంటూ ప్రకటించేస్తున్నారు. స్మార్ట్ ఫోన్ కొంటే టమాలు ఫ్రీ అంటూ ఎగబడి మరీ కొనేసుకున్న జనాలను చూశాం. తాజాగా ఓ ట్రావెల్ బిజినెస్ చేస్తున్న వ్యక్తి ఏకంగా విమానం టికెట్లు కొంటే టమాటాలు ఫ్రీ అని ప్రకటించాడంతే..ఏంటీ ఏదో ఫోన్ కొంటే టమాటాలు ఫ్రీ అంటే జనాలు వస్తారు గానీ ఏకంగా విమానం టికెట్లు కొంటే టమాటాలు ఫ్రీ అంటే జనాలు వస్తారా ఏంటీ..విమానం చార్జీలేమన్నా తక్కువుంటాయా..టమాటాలకు ఫ్రీగా వస్తాయంటే కొనేయటానికి అనుకుంటున్నారా..? ఫ్రీ అంటే చాలు జనాలు ఏదైనా కొనేస్తారు అనటానికి ఇదే ఉదాహరణ అని అనుకోవచ్చు.

ఏ ట్రిక్ చేసైనా వ్యాపారాన్ని డెవలప్ చేసుకోవటంలో ఇటీవల వ్యక్తులు బాగా స్మార్ట్ అయిపోయారు. పోటీ తట్టుకుని వ్యాపారంలో నిలబడాలంటే వినూత్నంగా ఏదోకటి చేయాలి. కష్టమర్లను ఆకట్టుకోవాలి. అది షాపు పేరైనా సరే..ఉచితం అనే ప్రకటన అయినా సరే..ప్రస్తుతం టమాటాల ధరలు భారీగా పెరిగిపోవటంతో వ్యాపారులు టమాటాలను ఆశపెట్టి కష్టమర్లను ఆకట్టుకునే పనిలో పడ్డారు. దీంట్లో భాగంగానే ఓ ట్రావెల్ బిజినెస్ చేసే వ్యాపారి విమానం టికెట్లు కొంటే కిలో టమాటాలు ఫ్రీ అని ప్రకటించారు.

Tomato Free : ఇది బంపరాఫరే..! మొబైల్ కొంటే రెండు కేజీలు టమాటాలు ఫ్రీ.. ఎక్కడో తెలుసా?

తమిళనాడులోని మధురైలో ఉన్న ట్రావెల్ ఏజెన్సీ..తమ వదద్ద విమాన టికెట్లు కొంటే టికెట్లతోపాటు ఉచితంగా టమాటాలు ఫ్రీగా ఇస్తామని ప్రకటించారు. దీంట్లో రెండు రకాల కేటగిరీలున్నాయి. దేశంలో అంటే లోకట్ టికెట్లకు ఓ రకంగా..విదేశాలకు ప్రయాణించే వారికి మరో రకంగా టమాటాలను ఇస్తోంది. ఆ ట్రావెల్ ఏజెన్సీలో డొమెస్టిక్ విమాన టికెట్ బుక్ చేసుకున్నవారికి ఒక్కొక్క టికెట్ మీద కిలో టమాటాలను ఉచితంగా ఇస్తోంది. అదే విదేశాలకు వెళ్లేవారు బుక్ చేసుకునే ఇంటర్‌నేషనల్ విమాన టికెట్లు బుక్ చేసుకునే వారికి ఒక్కొక్క టికెట్ మీద కిలోన్నర టమాటాలను ఫ్రీగా అందిస్తోంది.

విమాన టికెట్ల బుకింగ్‌కు ఎలాంటి అదనపు ఛార్జీలు వసూలు చేయడం లేదని సదరు ట్రావెల్ ఏజెన్సీ యజమాని వెల్లడించారు.కస్టమర్లను తన వైపు తిప్పుకునేందుకు ఈ రకమైన ఉచిత టమాటాల పథకం చేపట్టామని దీంట్లో ఎటువంటి ఉద్ధేశ్యం లేదన్నారు. టమాటాలు ఉచితంగా ఇస్తుండటంతో గతంతో పోలిస్తే ఎక్కువ మంది కస్టమర్లు వస్తున్నారని.. బిజినెస్ బాగా జరుగుతోంది అంటూ సంతోషం వ్యక్తం చేశారు. దేశం మొత్తం టమాటాల కోసం ఎగబడుతుంటే ఇతను మాత్రం డిఫరెంట్ గా బిజినెస్‌ను పెంచుకోవటానికి ఇలా టమాటాలకు విమానం టికెట్లకు లింక్ పెట్టి మరీ అమ్మేస్తున్నాడు. ట్రిక్కు ఏదైనా వ్యాపారం పెరటమే ముఖ్యం కదా..అలా ట్రెండ్ కు తగినట్లుగా వ్యాపారులు స్మార్ట్ గా ఆలోచించి ఇస్మార్ట్ ఆఫర్లతో ఆకట్టేసుకుంటున్నారు.

Cobra Guards Tomatoes : టమాటాలకు కాపలాగా నాగుపాము

 

ట్రెండింగ్ వార్తలు