Tomato Free : ఇది బంపరాఫరే..! మొబైల్ కొంటే రెండు కేజీలు టమాటాలు ఫ్రీ.. ఎక్కడో తెలుసా?

దేశవ్యాప్తంగా టమాటా ధరలు ఠారెత్తిస్తున్నాయి. కేజీ రూ.2కు వచ్చే టమాటాకాస్త రూ. 150దాటేసింది. దీంతో ఓ మొబైల్ షాపు యాజమాని ఒక స్టార్మ్ ఫోన్ కొనుగోలు చేస్తే రెండు కిలోల టమాటాలు ఫ్రీ అని ఆఫర్ పెట్టేశాడు.

Tomato Free : దేశవ్యాప్తంగా టమాటా (Tomato) ధరలు ఠారెత్తిస్తున్నాయి. కేజీ రూ.2కు వచ్చే టమాటాకాస్త రూ. 150దాటేసింది. కొడెక్కి కూర్చున్న టమాటాకోసం కొనుగోలుదారులు క్యూ లైన్లలో గంటల తరబడి నిలబడాల్సిన పరిస్థితి. అలా గంటల తరబడి క్యూలైన్లలో నిలబడినా పావు కిలో టమాటా అయిన దొరికే పరిస్థితి లేదు. దీంతో టామాటా కాస్త బంగారంలా మారిపోయింది. పలువురు ఈ విచిత్రమైన పరిస్థితిని సద్వినియోగం చేసుకొనేందుకు ఆఫర్లు ప్రకటిస్తున్నారు. పనిలోపనిగా ఫేమస్ అవుతున్నారు. ఓ మొబైల్ షాపు దుకాణందారుడు మొబైల్ కొంటే రెండు కిలోల టమాటా ఫ్రీ (Tomato Free) అంటూ ఆఫర్ ప్రకటించారు. ఇదేదో బంపర్ ఆఫర్ అన్నట్లు కొనుగోలుదారులసైతం మొబైల్ దుకాణం (Mobile shop) వద్ద బారులు తీరుతున్నారు.

Tomato Price Hike: అమ్మో టమాటా.. పెట్రోల్, చికెన్‌తోనే పోటీనా?!

మధ్యప్రదేశ్‌  (Madhyapradesh) రాష్ట్రంలోని అశోక్ నగర్‌కు చెందిన ఓ మొబైల్ షాపు ఓనర్ ట్రెండింగ్ టమాటాను తన బిజినెస్‌కు అనుకూలంగా మార్చుకున్నాడు. అశోక్ అగర్వాల్ (Ashok Aggarwal) అనే మొబైల్ షాపు నిర్వాహకుడు తన దుకాణంలో స్మార్ట్ ఫోన్ కొనుగోలు చేస్తే రెండు కిలోల టమాటాలు ఉచితంగా ఇస్తామని ఇఫర్ ప్రకటించారు. ప్లెక్సీలు కట్టి ఈ ఆఫర్‌ను విస్తృతంగా పబ్లిసిటీకూడా చేశాడు. ఈ ప్రకటన కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో రాష్ట్ర వ్యాప్తంగానే కాక దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది..

Biryani Free : 2 కేజీల బిర్యానీ కొంటే అర కిలో టమాటాలు ఫ్రీ! లేదా..కిలో టమాటాలు ఇస్తే కిలో బిర్యానీ ఫ్రీ!

అశోక్ అగర్వాల్ ప్రకటించిన ఆఫర్ కు విశేషమైన స్పందన వచ్చింది. పలువురు మొబైల్ కొనుగోలు చేసి రెండు కిలోల టమాటాలను ఉచితంగా తీసుకెళ్లారు. ఈ విషయంపై షాపు యాజమాని మాట్లాడుతూ.. నేను పెట్టిన ఈ ఆఫర్‌తో మొబైల్ సేల్స్ పెరిగాయని చెప్పుకొచ్చాడు. మొబైల్స్ సేల్స్ ఏ స్థాయిలో పెరిగాయోఏమోకానీ.. అశోక్ అగర్వాల్‌కు మాత్రం దేశవ్యాప్తంగా గుర్తింపు వచ్చింది. సోషల్ మీడియాలో అశోక్ ఆఫర్‌ వైరల్ కావటంతో నెటిజన్లు ఫన్నీ కామెంట్లు చేస్తున్నారు.

ట్రెండింగ్ వార్తలు