దేశవ్యాప్తంగా విస్తారంగా వర్షాలు.. ఈశాన్య రాష్ట్రాలకు రెడ్ అలర్ట్

దేశవ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. మరో నాలుగు రోజులు పాటు దేశంలోని పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ పేర్కొంది.

National Rain Updates : దేశవ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. మరో నాలుగు రోజులు పాటు దేశంలోని పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ పేర్కొంది. ఈ క్రమంలో ఢిల్లీకి ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఢిల్లీలో రెండురోజుల క్రితం కుండపోత వర్షం కురిసింది. ఈ క్రమంలో గత 88ఏళ్ల నాటి రికార్డును మించి వర్షం కురిసిన విషయం తెలిసిందే. తాజాగా..  ఈశాన్య రాష్ట్రాలకు వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఉత్తరప్రదేశ్, బీహార్, ఈశాన్య జార్ఖండ్, ఉప-హిమాలయన్ పశ్చిమ బెంగాల్, సిక్కిం, సౌరాష్ట్ర, కచ్, దక్షిణ గుజరాత్ ప్రాంతం, జమ్మూ కచ్‌లలో చాలా చోట్ల తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది.

Also Read : పూణెలో జికా వైరస్ కలకలం.. ఇద్దరు గర్భిణులు సహా ఆరుగురికి పాజిటివ్

కాశ్మీర్, మణిపూర్, మిజోరాం, త్రిపుర, అరుణాచల్ ప్రదేశ్ , పశ్చిమ అస్సాంతో పాటు.. ఢిల్లీ, పంజాబ్, వాయువ్య రాజస్థాన్, తూర్పు మధ్యప్రదేశ్, తూర్పు ఉత్తరాఖండ్, హర్యానా, హిమాచల్ ప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, పశ్చిమ ఒడిశాలో కొన్నిచోట్ల తేలికపాటి నుండి మోస్తరు వర్షాలుకురిసే అవకాశం ఉంది. తీర ప్రాంతమైన ఒడిశా, జార్ఖండ్, విదర్భ, ఉత్తర కొంకణ్, మరఠ్వాడా, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కోస్టల్ సౌత్ ఇంటీరియర్ కర్ణాటక, కేరళ, లక్షద్వీప్, తమిళనాడు రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ వెల్లడించింది.

 

 

ట్రెండింగ్ వార్తలు