పూణెలో జికా వైరస్ కలకలం.. ఇద్దరు గర్భిణులు సహా ఆరుగురికి పాజిటివ్

జికా వైరస్ సోకిన ఎడెస్ దోమ కాటు కారణంగా వ్యాప్తి చెందుతుంది. ఈ వైరస్ సోకినప్పుడు బాధితునిలో డెంగ్యూ లక్షణాలు కనిపిస్తాయి.

పూణెలో జికా వైరస్ కలకలం.. ఇద్దరు గర్భిణులు సహా ఆరుగురికి పాజిటివ్

Zika virus

Zika Virus : మహారాష్ట్రలోని పూణెలో జికా వైరస్ కలకలం సృష్టిస్తుంది. వైరస్ విజృంభిస్తుండటంతో ఆ రాష్ట్రంలో ఆరుగురికి జికా వైరస్ సోకినట్లు నిర్ధారణ అయింది. వీరిలో ఇద్దరు గర్భవతులు కూడా ఉన్నారు. తాజా పరిణామాలతో రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ అప్రమత్తమైంది. జింకా వైరస్ వ్యాప్తికి కారణమైన దోమలను తరిమికొట్టేందుకు నగరంలో విస్తృతంగా ఫాగింగ్ చేస్తున్నారు.

Also Read : Armaan Malik : ఈ యూట్యూబర్‌కి రెండు పెళ్లిళ్లు కాదు.. మూడు పెళ్లిళ్లు.. సంచలన విషయాలు చెప్పిన భార్య..

జికా వైరస్ సోకిన ఎడెస్ దోమ కాటు కారణంగా వ్యాప్తి చెందుతుంది. ఈ వైరస్ సోకినప్పుడు బాధితునిలో డెంగ్యూ లక్షణాలు కనిపిస్తాయి. ఈ వైరస్ ను తొలిసారిగా ఉగాండాలో 1947లో కనుగొన్నారు. ఈ వైరస్ సోకిన వారిలో జ్వరం, చర్మంపై దద్దుర్లు, కండరాలు, కీళ్ల నొప్పులు, తలనొప్పి, జీర్ణ కోశ సంబంధ సమస్యలు, గొంతు నొప్పి, దగ్గు వంటి లక్షణాలు కనిపిస్తాయని వైద్యులు చెబుతున్నారు. ప్రస్తుతం ఈ జికా వైరస్ కేసులో పూణెలో నమోదు కావటం ఆందోళనకు గురిచేస్తోంది.

Also Read : Suryakumar Yadav : ఫైనల్ మ్యాచ్‌లో విన్నింగ్ క్యాచ్‌పై స్పందించిన సూర్యకుమార్ యాదవ్.. ఏమన్నారంటే?

రాష్ట్ర ఆరోగ్య శాఖ తెలిపిన వివరాల ప్రకారం.. అరంద్వానేలోని 46ఏళ్ల డాక్టర్ జికా వైరస్ బారిన పడ్డారు. అతని కుమార్తె కు కూడా ఈ వైరస్ సోకింది. వీరిద్దిరితో పాటు ముండ్యాకు చెందిన ఇద్దరికి జికా వైరస్ సోకినట్లు నిర్ధారణ అయింది. వీరితోపాటు అరంద్వానేకు చెందిన ఇద్దరు గర్భిణులకు ఈ వైరస్ సోకినట్లు వైద్యులు గుర్తించారు. మహారాష్ట్రలో జికా వైరస్ సోకిన ఆరుగురు ప్రస్తుతం ఆరోగ్యంగానే ఉన్నారని వైద్యులు తెలిపారు.