Armaan Malik : ఈ యూట్యూబర్‌కి రెండు పెళ్లిళ్లు కాదు.. మూడు పెళ్లిళ్లు.. సంచలన విషయాలు చెప్పిన భార్య..

తాజాగా ఆర్మాన్ భార్యల్లో ఒకరు పాయల్ మాలిక్ బిగ్ బాస్ నుంచి ఎలిమినేట్ అయింది.

Armaan Malik : ఈ యూట్యూబర్‌కి రెండు పెళ్లిళ్లు కాదు.. మూడు పెళ్లిళ్లు.. సంచలన విషయాలు చెప్పిన భార్య..

Bollywood Youtuber Armaan Malik Wife Payal Malik Sensational Comments on his husband Marriages after she came out from biggboss

Armaan Malik : ఇటీవలే హిందీలో బిగ్‌బాస్‌ ఓటీటీ సీజన్‌ -3 ప్రారంభమైంది. ఈసారి అనిల్ కపూర్ ఈ షోని హోస్ట్ చేస్తున్నారు. పలువురు హిందీ సోషల్ మీడియా, యూట్యూబ్ పాపులారిటీ ఉన్నవాళ్ళని ఈ షోకి తీసుకొచ్చారు. అయితే ఈ బిగ్ బాస్ లోకి బాలీవుడ్ యూట్యూబర్‌ ఆర్మాన్ మాలిక్‌, అతని ఇద్దరు భార్యలు కూడా వచ్చారు. ఆర్మాన్ మాలిక్.. పాయల్, కృతిక అనే ఇద్దర్ని పెళ్లి చేసుకొని ఆ ఇద్దరితో కలిసి యూట్యూబ్ వీడియోలు చేస్తూ వైరల్ అయ్యాడు.

ఆర్మాన్ ఇద్దరితో కలిసి ఉంటాడు. ఇద్దరు భార్యలు కూడా ఎలాంటి గొడవలు లేకుండా హ్యాపీగా అందరూ కలిసే ఉంటారు. వీరికి నలుగురు పిల్లలు కూడా ఉన్నారు. అయితే బిగ్ బాస్ లోకి ఆర్మాన్ అతని ఇద్దరు భార్యలు వెళ్లడం వివాదానికి కూడా దారి తీసింది. ఇద్దరు భార్యలు ఉన్న వాళ్ళని షోలోకి పంపి జనాలకి ఎలాంటి మెసేజ్ ఇద్దామని అని విమర్శలు కూడా వచ్చాయి.

Also Read : Samantha : ఆ విషయంలో నేను తప్పు చేసాను.. కానీ ఇప్పుడు.. నెటిజన్ కామెంట్‌కి రిప్లై ఇచ్చిన సమంత..

తాజాగా ఆర్మాన్ భార్యల్లో ఒకరు పాయల్ మాలిక్ బిగ్ బాస్ నుంచి ఎలిమినేట్ అయింది. పాయల్ బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చాక పలు ఇంటర్వ్యూలు ఇస్తూ తన భర్త గురించి ఆసక్తికర విషయాన్ని తెలిపింది. ఆర్మాన్ మాలిక్ కి రెండు కాదు మూడు పెళ్లిళ్లు అయ్యాయని వార్తలు వచ్చాయి దానిపై పాయల్ మాలిక్ ని ప్రశ్నించగా ఆమె స్పందిస్తూ.. అవును నా భర్తకు మూడు పెళ్లిళ్లు అయ్యాయి. కానీ ఒకటి చైల్డ్ మ్యారేజ్. హర్యానా సైడ్ కొన్ని చోట్ల చైల్డ్ మ్యారేజీలు జరుగుతాయి. కానీ నన్ను చేసుకునేటప్పటికే ఆర్మాన్ ఆమెకు విడాకులు ఇచ్చాడు. ఆమెకు ఫైనాన్సియల్ గా కూడా సపోర్ట్ ఇచ్చాడు. ఆమె ఇప్పుడు వేరే పెళ్లి కూడా చేసుకొని హ్యాపీగా ఉంది అని తెలిపింది. దీంతో ఆర్మాన్ కి మూడు పెళ్లిళ్లు అవగా మొదటిది డైవర్స్ అయిందని ఆ తర్వాత ఇద్దర్ని చేసుకొని ప్రస్తుతం తన ఇద్దరి భార్యలు పాయల్, కృతిక లతో హ్యాపీగా ఉంటున్నాడు.