Samantha : ఆ విషయంలో నేను తప్పు చేసాను.. కానీ ఇప్పుడు.. నెటిజన్ కామెంట్‌కి రిప్లై ఇచ్చిన సమంత..

సమంత రెగ్యులర్ గా తన ఫొటోలు, వీడియోలు పోస్ట్ చేస్తూనే ఉటుంది. ఇటీవల హెల్త్ గురించి పాడ్ కాస్ట్ వీడియోలు చేసి పోస్ట్ చేస్తుంది.

Samantha : ఆ విషయంలో నేను తప్పు చేసాను.. కానీ ఇప్పుడు.. నెటిజన్ కామెంట్‌కి రిప్లై ఇచ్చిన సమంత..

Samantha gives Reply to a Netizen Comment about her health Podcasts

Updated On : July 2, 2024 / 8:51 AM IST

Samantha : సమంత తన ఆరోగ్య సమస్యల వల్ల కొన్నాళ్ళు సినిమాలకు గ్యాప్ ఇచ్చిన సంగతి తెలిసిందే. మయోసైటిస్ నుంచి సమంత ఇప్పుడిప్పుడే కోలుకుంటుందని సమాచారం. ఇటీవలే ఓ సినిమాని ప్రకటించింది. త్వరలోనే సమంత మళ్ళీ వెబ్ సిరీస్, సినిమాలతో ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే సినిమాలకు గ్యాప్ ఇచ్చినా సోషల్ మీడియాలో మాత్రం చాలా యాక్టివ్ గా ఉంటుంది సమంత.

Also Read : Deepika Padukone : ‘కల్కి’ సినిమాలో దీపికా పదుకోన్‌కి డబ్బింగ్ చెప్పింది ఈ స్టార్ హీరోయిన్ అని తెలుసా?

సమంత రెగ్యులర్ గా తన ఫొటోలు, వీడియోలు పోస్ట్ చేస్తూనే ఉటుంది. ఇటీవల హెల్త్ గురించి పాడ్ కాస్ట్ వీడియోలు చేసి పోస్ట్ చేస్తుంది. అయితే తాజాగా కార్బోహైడ్రేట్ మెటబాలిజంకి సంబంధించి ఓ హెల్త్ పాడ్ కాస్ట్ వీడియో షేర్ చేసింది. ఇందులో కూల్ డ్రింక్స్, ఐస్ క్రీమ్స్ లాంటివి హెల్త్ కి మంచివి కాదని చెప్పారు. అయితే ఈ వీడియో కింద కామెంట్స్ లో ఓ నెటిజన్.. మంచి డ్రామా క్వీన్ ఈమె. ఈమె మాత్రం అన్ని కూల్ డ్రింక్స్, ఐస్ క్రీం యాడ్స్ లో నటిస్తుంది అని కామెంట్ పెట్టాడు.

 

ఆ నెటిజన్ కామెంట్ కి సమంత స్పందించి.. ఇంతకు ముందు నాకు ఏమీ తెలియనప్పుడు నేను తప్పులు చేసాను. కానీ తెలుసుకున్న తర్వాత అలాంటి యాడ్స్ అంగీకరించడం మానేశాను. నేను చెప్పేదాన్ని ఆచరించాలని నమ్ముతాను అని రిప్లై ఇచ్చింది. దీంతో సమంతని అభినందిస్తున్నారు. చేసిన తప్పుని తెలుసుకొని మళ్ళీ చేయకూడదు అనుకోవడం మంచి విషయమని అభినందిస్తున్నారు.

Samantha gives Reply to a Netizen Comment about her health Podcasts