Deepika Padukone : ‘కల్కి’ సినిమాలో దీపికా పదుకోన్‌కి డబ్బింగ్ చెప్పింది ఈ స్టార్ హీరోయిన్ అని తెలుసా?

ఈ సినిమాలోని క్యారెక్టర్స్ కి స్పెషల్ ఆర్టిస్టులతో డబ్బింగ్ చెప్పించారు.

Deepika Padukone : ‘కల్కి’ సినిమాలో దీపికా పదుకోన్‌కి డబ్బింగ్ చెప్పింది ఈ స్టార్ హీరోయిన్ అని తెలుసా?

Kalki 2898AD Movie Deepika Padukone Dubbing by Actress Sobhita Dhulipala

Updated On : July 2, 2024 / 8:32 AM IST

Deepika Padukone : ప్రభాస్ కల్కి సినిమా థియేటర్స్ లో దూసుకుపోతుంది. ఇప్పటికే 600 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేసి అదరగొడుతుంది కల్కి సినిమా. ఈ సినిమాలోని ప్రతి సీన్, విజువల్స్ ప్రేక్షకులని ఆశ్చర్యపరుస్తున్నాయి. ఇక సెలబ్రిటీలు సైతం నాగ్ అశ్విన్ ని, కల్కి సినిమాని పొగుడుతూ సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్నారు. ఈ సినిమాలో ప్రభాస్, అమితాబ్, కమల్ హాసన్, దీపికా పదుకోన్, దిశా పటాని, దుల్కర్, విజయ్ దేవరకొండ.. ఇలా చాలా మంది ఆర్టిస్టులు ఉన్న సంగతి తెలిసిందే.

అయితే ఈ సినిమాలోని క్యారెక్టర్స్ కి స్పెషల్ ఆర్టిస్టులతో డబ్బింగ్ చెప్పించారు. కల్కి సినిమాలో కృష్ణుడి పాత్రకు తమిళ నటుడు అర్జున్ దాస్ డబ్బింగ్ చెప్పగా దీపికా పదుకోన్ పాత్రకు నటి శోభిత ధూళిపాళ డబ్బింగ్ చెప్పింది. దీపికా ఈ సినిమాలో SUM80, సుమతి అనే పాత్రలో కల్కికి జన్మనివ్వబోయే తల్లిగా కనిపించింది. ఒక మంచి ఎమోషన్ ఉన్న పాత్రలో మెప్పించింది.

Also Read : Nandamuri Mokshagna : మోక్షజ్ఞ ఎంట్రీపై సోషల్ మీడియాలో పోస్ట్.. అసలు ఇది మోక్షజ్ఞనేనా?

దీపికా పదుకోన్ పాత్రకి తెలుగు, తమిళ్ లో హీరోయిన్ శోభిత ధూళిపాళ డబ్బింగ్ చెప్పింది. ఇందుకు స్క్రీన్ మీద శోభితకు స్పెషల్ థ్యాంక్స్ కూడా వేశారు. స్క్రీన్ మీద తన పేరుని ఫోటో తీసి శోభిత సోషల్ మీడియాలో షేర్ చేసి మూవీ టీమ్ కి స్పెషల్ థ్యాంక్స్ చెప్పింది. శోభిత మన తెలుగమ్మాయి అని తెలిసిందే. తెలుగుతో పాటు బాలీవుడ్ లో కూడా పలు చేస్తూ బిజీగా ఉంది. హాలీవుడ్ లో కూడా ఇటీవల ఓ సినిమాతో ఎంట్రీ ఇచ్చింది శోభిత.

Kalki 2898AD Movie Deepika Padukone Dubbing by Actress Sobhita Dhulipala