Bhogi: ఇంటెన్స్ లుక్ లో శర్వానంద్.. భోగి ఫస్ట్ లుక్ అదిరిపోయింది.. మూవీ రిలీజ్ ఎప్పుడంటే?
శర్వానంద్ భోగి(Bhogi) సినిమా ఫస్ట్ లుక్ వచ్చేసింది.
Sharwanand Bhogi movie first look and release date update
- శర్వానంద్- సంపత్ నంది కాంబోలో భోగి మూవీ
- మాస్ లుక్ లో అదరగొట్టిన శర్వానంద్
- ఆగస్టు లో విడుదల కానున్న సినిమా
Bhogi: టాలీవుడ్ టాలెంటెడ్ హీరో శర్వానంద్ రీసెంట్ గా నారీ నారీ నడుమ మురారి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. సంక్రాంతి కానుకగా వచ్చిన ఈ సినిమా ఆడియన్స్ ను ఫుల్లుగా నవ్వించి సూపర్ హిట్ గా నిలిచింది. ఈ సినిమా తరువాత ప్రస్తుతం శర్వానంద్ చేస్తున్న కొత్త సినిమా భోగి(Bhogi). మాస్ చిత్రాల దర్శకుడు సంపత్ నంది ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు.
Narendra Modi: విజయ్-రష్మిక జంటకు అరుదైన గౌరవం.. శుభాకాంక్షలు తెలుపుతూ ప్రధాని మోదీ సందేశం
చాలా కాలంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా ఇప్పుడు విడుదలకు సిద్ధం అయ్యింది. ఈ నేపధ్యంలోనే నేడు(ఫిబ్రవరి 25) భోగి సినిమా నుంచి శర్వానంద్ ఫస్ట్ లుక్ ను విడుదల చేశారు మేకర్స్. గుబురు గడ్డంతో, కోర మీసాలతో, చేతిలో కట్టి పట్టుకొని ఉన్న శర్వానంద్ లుక్ నెక్స్ట్ లెవల్లో ఉంది. ఇంతకాలం లవర్ బాయ్ లా కనిపించిన శర్వానంద్ ఇప్పుడు పూర్తిగా మేకోవర్ అయ్యి మాస్ లుక్ లో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు.
దీంతో, ఈ ఫస్ట్ లుక్ ఇప్పుడు భోగి సినిమాపై అంచనాలను పెంచేసింది అనే చెప్పాలి. ఇక పోస్టర్ తో సహా భోగి సినిమా రిలీజ్ డేట్ ను కూడాప్రకటించారు మేకర్స్ ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాను ఆగస్టు 28న విడుదల చేయనున్నట్టు ప్రకటించారు. మరి కెరీర్ లో మొదటి సారి మాస్ అవతారం లో వస్తున్న శర్వానంద్ ఎలాంటి విజయాన్ని అందుకుంటాడు అనేది చూడాలి.
