Narendra Modi: విజయ్-రష్మిక జంటకు అరుదైన గౌరవం.. శుభాకాంక్షలు తెలుపుతూ ప్రధాని మోదీ సందేశం
విజయ్- రష్మికలకు శుభాకాంక్షలు తెలుపుతూ ప్రత్యేక సందేశం పంపిన భారత ప్రధాని నరేంద్ర మోదీ.
Narendra Modi sends best wishes to Vijay Deverakonda and Rashmika Mandanna
- విజయ్- రష్మిక జంటకు అరుదైన గౌరవం
- కొత్త జంటకు దేశ ప్రధాని శుభాకాంక్షలు
- స్పెషల్ నోట్ పంపిన మోదీ
Narendra Modi; టాలీవుడ్ స్టార్ హీరో విజయ్ దేవరకొండ, నేషనల్ క్రష్ రష్మిక మందన్న పెళ్లి చేసుకోబోతున్న విషయం తెలిసిందే. ఫిబ్రవరి 26న వీరి వివాహం గ్రాండ్ గా జరుగనుంది. రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్ వేదికగా జరగనున్న ఈ పెళ్ళికి సంబంధించి ఇప్పటికే ఏర్పాట్లు అన్ని ముగిశాయి. మరికొన్ని గంటల్లో ఈ పెళ్లి తంతు కానుంది. విజయ్, రష్మిక ఒకటికానున్నారు. ఈ నేపథ్యంలోనే విజయ్-రష్మిక జంటకు అరుదైన గౌరవం దక్కింది. భారతదేశ ప్రధాని నరేంద్ర మోదీ(Narendra Modi) స్వయంగా ఈ జంటకు ఆశీస్సులు మరియు శుభాకాంక్షలు అందజేశారు. ఈ మేరకు ఒక నోట్ విడుదల చేశారు.
Pawan Kalyan: పవన్ కళ్యాణ్ సినిమాకి అవేమి ఉండవట.. డైరెక్ట్ దిగుతున్నాడు.. ఆయన గురించి తెల్సిందేగా!
‘విజయ్ దేవరకొండ- రష్మిక మందన్నాల జీవితంలో ఇది కొత్త అధ్యాయానికి నాంది. ‘సప్తపది’ అనే పవిత్ర సంప్రదాయంతో ఏడడుగులు వేసి జీవితకాలం స్నేహితులుగా, తోడుగా ఉండాలని ఆకాంక్షిస్తున్నాను’ అంటూ సందేశాన్ని పంపారు మోదీ. అలాగే విజయ్ మరియు రష్మిక కుటుంబాలకు ఆయన అభినందనలు తెలియజేశారు. ప్రస్తుతం ఈ నోట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

