Pawan Kalyan: పవన్ కళ్యాణ్ సినిమాకి అవేమి ఉండవట.. డైరెక్ట్ దిగుతున్నాడు.. ఆయన గురించి తెల్సిందేగా!
పవన్ కళ్యాణ్(Pawan Kalyan), సురేందర్ రెడ్డి సినిమా రెగ్యులర్ షూటింగ్ మే నుండి ప్రారంభం కానుంది.
Pawan Kalyan, Surender Reddy movie regular shooting will start from may
- పవన్ కళ్యాణ్- సురేందర్ రెడ్డి మూవీ అప్డేట్
- ఫైనల్ స్క్రిప్ట్ లాక్
- మే నుంచి డేట్స్ అలాట్ చేసిన పవన్ కళ్యాణ్
Pawan Kalyan: ఓజీ సినిమాతో కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ అందుకున్నాడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. గ్యాంగ్ స్టార్ కథతో వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర సెన్సేషన్ క్రియేట్ చేసింది అనడంలో ఎలాంటి సందేహం లేదు. గత కొన్నేళ్లుగా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఆయన్ని ఎలా చూడాలని అనుకుంటున్నారో అలాగే చూపించి సూపర్ సక్సెస్ అందుకున్నాడు దర్శకుడు సుజిత్. ఇక ఈ సినిమాకు సీక్వెల్, ప్రీక్వెల్ కూడా ఉంటుందని ప్రకటించి హైప్ క్రియేట్ చేశాడు సుజిత్.
ఇక ఓజీ తరువాత పవన్ కళ్యాణ్(Pawan Kalyan) చేస్తున్న సినిమా ఉస్తాద్ భగత్ సింగ్. హరీష్ శంకర్ తెరకెక్కిస్తున్న ఈ సినిమా మార్చ్ 26న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఆ తరువాత పవన్ కళ్యాణ్ దర్శకుడు సురేందర్ రెడ్డితో ఓ సినిమా చేస్తున్నాడు. ఈ ప్రాజెక్టుకి సంబంధించి అధికారిక ప్రకటన చాలా కాలం క్రితమే వచ్చినా రెగ్యులర్ షూటింగ్ మాత్రం మొదలవలేదు. దాదాపు రెండేళ్ల తరువాత ఈ ప్రాజెక్టులో కదలిక వచ్చింది. రీసెంట్ గా ఈ భారీ ప్రాజెక్టు నుంచి అప్డేట్ వచ్చింది.
Aaya sher: టార్గెట్ నాని.. ‘ఆయా షేర్’ సాంగ్ పై నెగిటీవ్ కామెంట్స్.. నానిపై కోపంతోనేనా ఇదంతా
దీంతో, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేశారు. పవన్ కళ్యాణ్ స్నేహితుడు రామ్ తాళ్లూరి నిర్మిస్తున్న ఈ సినిమాకు వక్కంతం వంశీ కథను అందిస్తున్నాడు. ఇప్పటికే కథను కూడా ఫినిష్ చేశాడట వక్కంతం వంశీ. ఈ నేపధ్యంలోనే రీసెంట్ గా మంగళగిరిలో పవన్ కళ్యాణ్ ని కలిశారట దర్శకుడు సురేందర్ రెడ్డి అండ్ వక్కంతం వంశీ. ఈ సినిమా గురించి ఫైనల్ న్యారేషన్ కూడా ఇచ్చారట. దానికి పవన్ కళ్యాణ్ చాలా ఇంప్రెస్ అయ్యాడని టాక్.
డేట్స్ కూడా అలాట్ చేశాడట. అయితే, ఈ ప్రాజెక్టు పూజ కార్యక్రమాలు లాంటివి లేకుండానే డైరెక్ట్ మొదలవనుందట. ఏప్రిల్ నుంచి రెగ్యులర్ షూటింగ్ మొదలవనుందని సమాచారం. కానీ, పవన్ కళ్యాణ్ మాత్రం మే నుంచి ఈ సినిమా షూటింగ్ లో ప్దాల్గొననున్నాడు. అది కూడా కేవలం రెండు నెలల సమయాన్ని మాత్రమే ఇచ్చాడట పవన్ కళ్యాణ్. అందుకోసమే డెడ్ లైన్ పెట్టుకొని మరీ పని చేయనున్నారట టీం. ఈ సినిమా వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది.
