Samosa: సమోసా ఎంత పని చేసిందిరా అయ్యా..! సమోసా తీసుకురాలేదని.. భర్తను పొట్టు పొట్టు కొట్టిన భార్య..

Samosa: భార్య, భర్త అన్నాక గొడవలు కామన్. కొన్ని విషయాల్లో తేడాలు వస్తుంటాయి. కాసేపు ఒకరినొకరు అరుచుకుంటారు, తిట్టుకుంటారు, తర్వాత సైలెంట్ అయిపోతారు. ఎప్పటిలానే కలిసిపోతారు. అయితే, కొందరు దంపతులు మాత్రం చాలా వైల్డ్ గా రియాక్ట్ అవుతున్నారు. చిన్న చిన్న విషయాలకే భార్యలు శివాలెత్తిపోతున్నారు. తాళి కట్టిన భర్త అని కూడా చూడటం లేదు. బండ బూతులు తిడుతూ దారుణంగా కొడుతున్నారు. భర్త సమోసా తీసుకురావడం మర్చిపోయాడని ఓ భార్య చేసిన పని ఇప్పుడు షాక్ కి గురి చేస్తోంది. భర్త అని కూడా చూడకుండా అతడిని ఉతికి ఆరేసింది.
ఇంటికి వచ్చేటప్పుడు సమోసా తేవాలన్న భార్య..
ఉత్తరప్రదేశ్ లో జరిగిన ఓ ఘటన అందరినీ విస్మయానికి గురి చేస్తోంది. జస్ట్ ఓ సమోసా కోసం ఓ భార్య భర్తనే పొట్టు పొట్టు కొట్టింది. పిలిబిత్ లోని పూరాన్ పూర్ లో ఈ ఘోరం జరిగింది. శివమ్, సంగీత దంపతులు. తనకు సమోసా తినాలని ఉందని, ఇంటికి వచ్చేటప్పుడు తీసుకురావాలని సంగీత తన భర్తతో చెప్పింది.
భర్తను ఉతికారేసిన భార్య..
అయితే భర్త శివమ్ సమోసా తీసుకురాలేదు. మర్చిపోయాడో మరో కారణమో తెలీదు కానీ.. సమోసా తేలేదు. దీంతో భార్య అతడిని నిలదీసింది. సమోసా ఎందుకు తీసుకురాలేదని ప్రశ్నించింది. అలా ఇద్దరి మధ్య మాట మాట పెరిగింది. అది కాస్తా గొడవగా మారింది. కోపంతో ఊగిపోయిన భార్య సంగీత తన తల్లిదండ్రులను పిలిపించింది. ఇంటికి వచ్చిన వారు.. కూతురికి సర్ది చెప్పాల్సింది పోయి మరింత రెచ్చిపోయారు. అల్లుడు శివమ్, అతడి మామను బూతులు తిట్టారు. అంతేకాదు వారిద్దరిని బాగా కొట్టారు.
ఈ గొడవ చాలా పెద్దదిగా మారింది. శివమ్ మామ విజయ్ కుమార్ దీనిపై పంచాయత్ పెద్దలకు ఫిర్యాదు చేశాడు. దీంతో పంచాయత్ పెద్దలు సంగీతను, ఆమె తల్లిదండ్రులను పిలిపించారు. ఏం జరిగిందో తెలుసుకుని సమస్యను పరిష్కరించేందుకు ప్రయత్నం చేశారు. ఇంతలోనే గొడవ స్టార్ట్ అయ్యింది. మరోసారి సంగీత, ఆమె తల్లిదండ్రులు శివమ్ పై దాడి చేశారు. అతడిని పొట్టు పొట్టు కొట్టారు. అడ్డుకోబోయిన శివమ్ మామ విజయ్ ని కూడా చితకబాదారు.
ఓ సమోసా కోసం ఇంత పెద్ద గొడవ జరగడం అందరినీ విస్మయానికి గురి చేస్తోంది. ఇదెక్కడి చోద్యం రా నాయనా అని తల పట్టుకుంటున్నారు. నవ్వాలో, ఏడ్వాలో కూడా అర్థం కావడం లేదంటున్నారు.
Also Read: దెబ్బకు పాకెట్ ఖాళీ.. వీటిపై 40 శాతం కాదు.. ఏకంగా 88శాతం వరకు జీఎస్టీ.. లిస్ట్ ఇదే