Wood Stoves: గ్యాస్ కొరత వేళ కేంద్రం కీలక నిర్ణయం.. కట్టెల పొయ్యిలకి అనుమతి
గ్యాస్ దొరకదేమో అనే భయంతో సామాన్యులు సిలిండర్లు భారీగా బుక్ చేస్తుండటంతో డొమెస్టిక్ సిలిండర్లకు ఒక్కసారిగా డిమాండ్ పెరిగిపోయింది.
Wood Stoves Representative Image (Image Credit To Original Source)
- ఢిల్లీలో కట్టెల పొయ్యిలకు గ్రీన్ సిగ్నల్
- కట్టెల పొయ్యిల వాడకంపై నిషేధం తాత్కాలికంగా ఎత్తివేత
- పశ్చిమాసియాలో యుద్ధం కారణంగా భారత్‌లో గ్యాస్ కొరత
Wood Stoves: కమర్షియల్ గ్యాస్ కొరత వేళ కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ఢిల్లీలో కట్టెల పొయ్యిలకి అనుమతి ఇచ్చింది. కాలుష్యాన్ని నివారించేందుకు గతంలో కట్టెల పొయ్యిలపై నిషేధం విధించింది ప్రభుత్వం. అయితే, మిడిల్ ఈస్ట్ యుద్ధంతో గల్ఫ్ దేశాల నుంచి గ్యాస్ సరఫరాలో ఇబ్బంది ఏర్పడింది. దీని ప్రభావం మన భారత్ పై పడింది. దేశవ్యాప్తంగా కమర్షియల్ గ్యాస్ సప్లయ్ లో అంతరాయం కలుగుతోంది. మెట్రో సిటీస్ లో ఏకంగా హోటల్స్ మూతపడ్డాయి.
హాస్టల్స్ లో ఫుడ్ మెనూ లిస్ట్ కూడా మారిపోయింది. మరోవైపు గ్యాస్ దొరకదేమో అనే భయంతో సామాన్యులు సిలిండర్లు భారీగా బుక్ చేస్తుండటంతో డొమెస్టిక్ సిలిండర్లకు ఒక్కసారిగా డిమాండ్ పెరిగిపోయింది. ఇలాంటి తరుణంలో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ఢిల్లీలో ఇప్పటివరకు కట్టెల పొయ్యిలపై ఉన్న నిషేధాన్ని ఎత్తివేసింది.
ఢిల్లీలో కాలుష్యం తీవ్ర స్థాయిలో ఉందన్న సంగతి తెలిసిందే. కాలుష్య నివారణకు అక్కడి ప్రభుత్వం అనేక రకాల చర్యలు తీసుకుంటోంది. వాయు కాలుష్యాన్ని కట్టడి చేసేందుకు ప్రభుత్వం ఎన్నో కఠిన నిబంధనలు తెచ్చింది. ఇందులో భాగంగా కట్టెల పొయ్యిల వాడకంపైనా నిషేధం విధించింది. అయితే, ఇప్పుడు భారత్‌లో గ్యాస్ కొరత కారణంగా కట్టెల పొయ్యి వాడక తప్పడం లేదు. దీంతో దానిపై ఉన్న నిషేధాన్ని తాత్కాలికంగా ఎత్తివేయాల్సి వచ్చింది.
Also Read: గ్యాస్ అయిపోయిందా? ఒక్క క్లిక్‌తో మీ ఇంటికే సిలిండర్.. సింపుల్ బుకింగ్ ఆప్షన్లు.. ఫాస్ట్ డెలివరీ!
