లవర్‌తో కలిసి భర్తను చంపి.. ఏమీ తెలియనట్లు ఏ రేంజ్‌లో ఏడ్చిందో వీడియో చూడండి.. ఆస్కార్ లెవెల్.. సాంప్రదాయినీ సుద్దపూసనీ..
భర్తను హత్య చేసిన తర్వాత మృతదేహం వద్ద కూర్చుంది భార్య. ఎవరికీ అనుమానం రాకుండా పెద్దగా ఏడుస్తూ నాటకమాడింది.

UP Sultanpur Pooja
UP Viral Videos: ఉత్తరప్రదేశ్ సుల్తాన్‌పూర్‌లో దారుణం చోటుచేసుకుంది. వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని కట్టుకున్న భర్తనే కడతేర్చిందో భార్య. ప్రియుడితో కలిసి పక్కా ప్లాన్‌తో ఈ ఘాతుకానికి పాల్పడింది. హత్య తర్వాత కన్నీళ్లు పెట్టుకుని నాటకమాడింది.
ప్రాణానికి ప్రాణంగా కలిసి జీవించామని, భర్తలేని ఈ జీవితం తనకు ఎందుకని, ఆ భగవంతుడు తనను కూడా తీసుకువెళ్తే బాగుండేదని ఏడ్చింది. ఆమె నిజంగానే గుండెనిండిన బాధతో, తట్టుకోలేకపోతూ ఏడుస్తోందనుకుని బంధువులు అందరూ ఆమెను ఓదార్చే ప్రయత్నం చేశారు. చివరకు కేవలం 24 గంటల్లోనే ఆమె పోలీసులకు చిక్కి కటకటాల పాలైంది. ఈ షాకింగ్ ఘటన వివరాలు ఇప్పుడు చూద్దాం..
అసలేం జరిగిందంటే?
సుల్తాన్‌పూర్ జిల్లా, చందా పోలీస్ స్టేషన్ పరిధిలోని కిందిపూర్ గ్రామంలో మహేశ్, పూజా దంపతులు నివసిస్తున్నారు. పూజాకు అదే గ్రామానికి చెందిన జైశంకర్‌తో వివాహేతర సంబంధం ఉంది. ఈ విషయం భర్తకు తెలియడంతో తరచూ గొడవలు జరిగేవి. దీంతో తమ బంధానికి అడ్డుగా ఉన్న భర్తను అడ్డు తొలగించుకోవాలని పూజా, ఆమె ప్రియుడు జైశంకర్ నిర్ణయించుకున్నారు.
మద్యం తాగించి, కిరాతకంగా హత్య
పథకం ప్రకారం.. బుధవారం రాత్రి జైశంకర్.. మహేశ్‌ను కలిసి అతడికి బలవంతంగా బాగా మద్యం తాగించాడు. మహేశ్ పూర్తిగా మత్తులోకి జారుకున్నాక, పూజాను అక్కడికి పిలిచాడు. ఆ తర్వాత ఇద్దరూ కలిసి దాడికి పాల్పడ్డారు. (UP Viral Videos)
జైశంకర్ పదునైన ఆయుధంతో మహేశ్ గొంతును కోశాడు. పూజా ఇటుకతో తన భర్త ఛాతీపై బలంగా కొట్టింది. ఈ కిరాతక దాడిలో మహేశ్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు.
నాటకమాడినా.. 24 గంటల్లోనే దొరికిపోయారు
హత్య తర్వాత ఎవరికీ అనుమానం రాకుండా, పూజా తన భర్త మృతదేహం వద్ద పెద్దగా ఏడుస్తూ నాటకమాడింది. కానీ, పోలీసులు రంగంలోకి దిగి దర్యాప్తు చేపట్టగా అసలు నిజం బయటపడింది. మొబైల్ కాల్ రికార్డులు, సమీపంలోని సీసీ ఫుటేజీని పరిశీలించగా పూజా, జైశంకర్ పాత్ర ఉన్నట్లు తేలింది. దీంతో పోలీసులు కేవలం 24 గంటల్లోనే నిందితులిద్దరినీ అరెస్టు చేసి జైలుకు పంపించారు.
ఈ హత్య వివరాలను అదనపు ఎస్పీ అఖండ్ ప్రతాప్ సింగ్ మీడియా సమావేశంలో అధికారికంగా వెల్లడించారు.
UP: सुलतानपुर में पत्नी और प्रेमी ने मिलकर पति की हत्या की
◆ पति महेश का शव गांव के पास बाग में मिला, दोनों आरोपियों को गिरफ्तार किया गया
◆ पुलिस ने कॉल डिटेल और सर्विलांस से साजिश का पर्दाफाश किया#Sultanpur | UP Murder | #UPCrime pic.twitter.com/NjGCVzLEP8
— News24 (@news24tvchannel) September 5, 2025