Gas Cylinder Rate: గుడ్ న్యూస్.. మరోసారి తగ్గిన గ్యాస్ సిలిండర్ ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో ఎంతంటే?

గత నాలుగు నెలలుగా వాణిజ్య గ్యాస్ సిలిండర్ ధర మాత్రమే తగ్గుతూ వస్తుంది. డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ ధరలో ఎలాంటి మార్పులు చోటుచేసుకోవటం లేదు.

LPG Price Decreased : వాణిజ్య గ్యాస్ వినియోగదారులకు శుభవార్త. వరుసగా నాలుగో నెలలోకూడా వాణిజ్య గ్యాస్ సిలీండర్ ధర తగ్గింది. జులై నెల ప్రారంభం కావడంతో సోమవారం దేశంలోని చమురు కంపెనీలు వాణిజ్య గ్యాస్ వినియోగదారులకు గుడ్ న్యూస్ చెప్పాయి. 19 కిలోల వాణిజ్య గ్యాస్ సిలీండర్ ధరపై రూ. 30 తగ్గింది. దీంతో ఢిల్లీలో 19 కిలోల కమర్షియల్ ఎల్పీజీ సిలిండర్ రిటైల్ ధర రూ. 1,646కి చేరింది. తగ్గిన ధరలు వెంటనే అమల్లోకి వచ్చాయి. మరోవైపు గృహోపకరణ గ్యాస్ (డొమెస్టిక్) సిలీండర్ ధరలో ఎలాంటి మార్పు చోటు చేసుకోలేదు.

Also Read : CM Chandrababu : మంగళగిరిలో లోకేశ్ గెలుపుపై చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు

గత నాలుగు నెలలుగా వాణిజ్య గ్యాస్ సిలిండర్ ధర మాత్రమే తగ్గుతూ వస్తుంది. డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ ధరలో ఎలాంటి మార్పులు చోటుచేసుకోవటం లేదు. గత రెండేళ్లలో కేవలం నాలుగు సార్లు మాత్రమే డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ ధరల్లో మార్పు చోటుచేసుకుంది. ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వం ఈ ఏడాది మార్చి 8న మహిళా దినోత్సవం సందర్భంగా దేశీయ ఎల్పీజీ సిలిండర్ ధరలను రూ. 100 తగ్గించింది. డొమెస్టిక్ ఎల్పీజీ సిలిండర్ రేటు తగ్గడం ఇదే చివరిసారి. అప్పటి నుంచి డొమెస్టిక్ సిలిండర్ ధరల్లో ఎలాంటి మార్పులు చోటుచేసుకోలేదు. తాజాగా.. వాణిజ్య గ్యాస్ ధర మాత్రమే తగ్గడంతో.. రోడ్ సైడ్ టిఫిన్ బండ్లు, రెస్టారెంట్లు, హోటళ్లు, దాబాలు వంటివి నిర్వహించే వారు ప్రయోజనం పొందుతారు.

Also Read : పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో చంద్రబాబు, లోకేశ్ మధ్య ఆసక్తికర సంభాషణ.. సభలో నవ్వులేనవ్వులు

దేశంలో వాణిజ్య గ్యాస్ సిలీండర్ ధరలను పరిశీలిస్తే..
ఢిల్లీలో 19 కిలోల సిలిండర్ ధర రూ. 30 తగ్గి రూ. 1,646కి చేరుకుంది.
చెన్నైలో 19కిలోల సిలిండర్ ధర రూ. 31 తగ్గింది. దీంతో అక్కడ ప్రస్తుతం ధర రూ. 1,809.50కి చేరింది.
కోల్ కతాలో 19 కిలోల సిలిండర్ ధర రూ. 31 తగ్గింది. దీంతో అక్కడ ధర రూ. 1756కు చేరింది.
ముంబైలో సిలిండర్ ధర రూ. 31 తగ్గింది. దీంతో అక్కడ ప్రస్తుతం ధర రూ. 1598 వద్ద కొనసాగుతుంది.
బీహార్ రాష్ట్రంలో 19 కిలోల కమర్షియల్ సిలిండర్ ధర రూ. 1884.50 కు చేరింది.

హైదరాబాద్ లో కమర్షియల్ గ్యాస్ సిలిండర్ పై రూ. 31 తగ్గింది. దీంతో గత నెలలో 19కిలోల సిలిండర్ ధర రూ. 1,903.50 కాగా.. ప్రస్తుతం రూ.1,872.50కి చేరింది.
విజయవాడలో కమర్షియల్ గ్యాస్ సిలిండర్ పై రూ. 32 తగ్గింది. దీంతో గత నెలలో 19కిలోల సిలిండర్ ధర రూ. 1,864.50కాగా.. ప్రస్తుతం 1,832.50కి చేరింది.

 

 

ట్రెండింగ్ వార్తలు