CM Chandrababu : మంగళగిరిలో లోకేశ్ గెలుపుపై చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు లోకేశ్ గెలుపుపై తొలిసారి స్పందించారు. గత ఎన్నికల్లో లోకేశ్ ఓడినా మళ్లీ మంగళగిరి నుంచే పోటీ చేశారు. ప్రజలoదరి అభిమానం చూరగొని ..

CM Chandrababu : మంగళగిరిలో లోకేశ్ గెలుపుపై చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు

CM Chandrababu Naidu

Updated On : July 1, 2024 / 9:17 AM IST

CM Chandrababu : ఏపీలో ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా సోమవారం ఉదయం నుంచి ప్రారంభమైంది. మంగళగిరి నియోజకవర్గం పెనుమాక గ్రామంలో పింఛన్ల పంపిణీ కార్యక్రమాన్ని సీఎం చంద్రబాబు నాయుడు పాల్గొని ప్రారంభించారు. గ్రామంలోని ఎస్సీ కాలనీలో ఇంటింటికి తిరుగుతూ లబ్ధిదారులకు పింఛన్లు స్వయంగా సీఎం చంద్రబాబు అందజేశారు. అనంతరం గ్రామంలో నిర్వహించిన సభలో సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేశ్ సహా పలువురు పాల్గొన్నారు. ఈ సభలో చంద్రబాబు మాట్లాడుతూ.. మంగళగిరి నియోజకవర్గంలో లోకేశ్ గెలుపుపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

Also Read : పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో చంద్రబాబు, లోకేశ్ మధ్య ఆసక్తికర సంభాషణ.. సభలో నవ్వులేనవ్వులు

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు లోకేశ్ గెలుపుపై తొలిసారి స్పందించారు. గత ఎన్నికల్లో లోకేశ్ ఓడినా మళ్లీ మంగళగిరి నుంచే పోటీ చేశారు. ప్రజలoదరి అభిమానం చూరగొని లోకేశ్ ఇక్కడి నుంచి పోటీచేసి అఖండ మెజార్టీతో గెలిచాడు. గాజువాక, భీమిలతో పాటు మంగళగిరిలోనూ 90వేలకుపైగా మెజారిటీ వచ్చింది. కుప్పంలో 60వేలు మెజారిటీవస్తే గొప్ప మెజారిటీ అనుకునేవాడిని. 39ఏళ్ల తర్వాత మంగళగిరిలో తెలుగుదేశాన్ని గెలిపించటమే కాకుండా లోకేశ్ కు 92వేల మెజారిటీని నియోజకవర్గ ప్రజలు కట్టబెట్టారు. మునుపెన్నడూ మంగళగిరిలో ఏ ఎమ్మెల్యేకిరాని మెజారిటీ లోకేశ్ కే వచ్చిందని చంద్రబాబు అన్నారు.

Also Read : అరకు కాఫీపై ప్రధాని మోదీ ప్రశంసలు.. సీఎం చంద్రబాబు ఏమన్నారంటే..

లోకేశ్ మా కుటుంబ సభ్యుడు అనికాకుండా.. అతిపెద్ద మెజార్టీతో గెలిపించిన నియోజకవర్గంలో మూడో నియోజకవర్గం మంగళగిరి.. రాజధానిలో భాగం మంగళగిరి. ఈ ప్రాంతంలో తక్కువ మెజార్టీతో గెలిపించి ఉంటే నేనుకూడా పెద్దగా పట్టించుకునే వాడినికాదు.. మెరిట్ విషయం వచ్చేటప్పటికి అతను (లోకేశ్) నా కుటుంబ సభ్యుడైనా మిగిలిన మంత్రులు, ఎమ్మెల్యేలతో సమానమే. ఈ నియోజకవర్గం లో ఎప్పుడూలేనంతగా భారీ మెజార్టీని ఇచ్చారు కాబట్టి.. ఈ నియోజకవర్గం రుణం తీర్చుకోవాల్సిన బాధ్యత ఎన్డీయే ప్రభుత్వానిది, తెలుగుదేశానిది అని చంద్రబాబు అన్నారు. లోకేశ్ తో ఇంకా బాగా పనిచేయించుకోండి అంటూ ప్రజలతో చంద్రబాబు ఛలోక్తులు విసిరారు. ప్రజాస్వామ్యంలో అంతిమ న్యాయ నిర్ణేతలు ప్రజలే. రాత్రికిరాత్రే అద్భుతాలు జరగాలని అందరూ ఆలోచిస్తున్నారు. వైసీపీ హయాంలో ఐదేళ్లపాటు ప్రజలను అణగదొక్కారు. నిజమైన స్వాతంత్ర్యం వచ్చిందనే ఆనందంలో ప్రజలు ఉన్నారని చంద్రబాబు అన్నారు.