Amaravati: అమరావతి వేదికగా న్యాయ వ్యవస్థలో మరో కీలక అడుగు.. రూ.165 కోట్లతో జుడీషియల్ అకాడమీ.. ప్రత్యేకతలు ఇవే
పిచ్చుకల పాలెం దగ్గర ఏపీ జుడీషియల్ అకాడమీకి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్య కాంత్ శంకుస్థాపన చేశారు.
Representative Image (Image Credit To Original Source)
Amaravati: అమరావతి వేదికగా న్యాయ వ్యవస్థలో మరో కీలక అడుగు పడింది. రూ.165 కోట్ల భారీ వ్యయంతో అంతర్జాతీయ ప్రమాణాలతో అకాడమీ నిర్మాణం జరగనుంది. పిచ్చుకల పాలెం దగ్గర ఏపీ జుడీషియల్ అకాడమీకి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్య కాంత్ శంకుస్థాపన చేశారు. సీఎం చంద్రబాబు, పలువురు సుప్రీంకోర్టు హైకోర్టు న్యాయమూర్తులు ఇందులో పాల్గొన్నారు.
అకాడమీ ప్రత్యేకతలు
విస్తీర్ణం: మొత్తం 2.05 లక్షల చదరపు అడుగులు
సామర్థ్యం: ఒకేసారి 120 మంది ట్రైనీ జడ్జిలకు శిక్షణ ఇచ్చేలా రూపకల్పన
అకాడమిక్ బ్లాక్ (Block-A):
500 సీట్ల సామర్థ్యంతో అత్యాధునిక ఆడిటోరియం
మూట్ కోర్టు హాల్, ఫోరెన్సిక్ ల్యాబ్, కంప్యూటర్ ల్యాబ్ సౌకర్యం
డిజిటల్ లైబ్రరీ, రీడింగ్ రూమ్, హెల్త్ యూనిట్.
వసతి, క్రీడలు (Block-B):
G+8 అంతస్తులతో భారీ హాస్టల్ బ్లాక్.. 98 హాస్టల్ యూనిట్లు, 5 సూట్ రూమ్స్
బ్యాడ్మింటన్, స్క్వాష్ కోర్టులు, జిమ్, యోగా హాల్‌తో కూడిన స్పోర్ట్స్ ఏరియా
హైకోర్టు నుంచి కేవలం 5.7 కిలోమీటర్ల దూరంలో అకాడమీ నిర్మాణం.
