Samsung Galaxy A35 5G : కిర్రాక్ ఆఫర్ మావా.. అమెజాన్‌లో ఈ శాంసంగ్ కెమెరా ఫోన్ జస్ట్ రూ. 19,999కే.. ఎలాగంటే?
Samsung Galaxy A35 5G Sale : శాంసంగ్ ఫోన్ అత్యంత సరసమైన ధరకే లభిస్తోంది. ఈ బెస్ట్ కెమెరా ఫోన్ ధర అమెజాన్‌లో కేవలం రూ. 19,999కే లభిస్తోంది. అద్భుతమైన డీల్ ఎలా పొందాలంటే?

Samsung Galaxy A35 5G Sale : శాంసంగ్ అభిమానులకు అద్భుతమైన ఆఫర్. ఫ్లాగ్షిప్ ఫీచర్లతో మిడ్-రేంజ్ ఫోన్ కోసం చూస్తున్నారా? శాంసంగ్ గెలాక్సీ A35 5జీ అదిరిపోయే డిస్కౌంట్ అందిస్తోంది. ఈ శాంసంగ్ ఫోన్ 50MP OIS కెమెరాతో ఫొటోలు, వీడియోలు హై క్వాలిటీతో రికార్డు చేయొచ్చు.

ఈ ఫోన్లో గూగుల్ 'సర్కిల్ టు సెర్చ్' ఫీచర్ కూడా ఉంది. ముఖ్యంగా, శాంసంగ్ గెలాక్సీ A35 5జీ ఇప్పుడు అమెజాన్‌లో రూ. 10వేల కన్నా ఎక్కువ ఫ్లాట్ డిస్కౌంట్ అందిస్తోంది. ఎక్స్ఛేంజ్, క్యాష్‌బ్యాక్ ఆఫర్లతో ధరను మరింత తగ్గించవచ్చు. ఈ శాంసంగ్ గెలాక్సీ A35 5జీ ఫోన్ కొనుగోలుపై ఆఫర్లు, మరిన్ని ఫీచర్లపై ఓసారి లుక్కేయండి.

శాంసంగ్ గెలాక్సీ A35 5జీపై అద్భుతమైన డీల్స్ : ప్రస్తుతం శాంసంగ్ గెలాక్సీ A16 5జీపై అమెజాన్ భారీ డిస్కౌంట్ అందిస్తోంది. 128GB స్టోరేజ్ వెర్షన్ అసలు ధర రూ. 30,999 నుంచి రూ. 20,879కి తగ్గింది. రూ. 10,120 నేరుగా డిస్కౌంట్ పొందవచ్చు.

అమెజాన్ ద్వారా కొనుగోలు చేస్తే రూ. 626 క్యాష్‌బ్యాక్ పొందవచ్చు. మీ పాత ఫోన్ ఎక్స్ఛేంజ్ ఆఫర్ రూ. 9వేల వరకు అదనపు డిస్కౌంట్ పొందవచ్చు. తక్కువ బడ్జెట్లో 5G ఫోన్ కొనేవారికి ఈ ఆఫర్ అద్భుతంగా ఉంటుంది.

శాంసంగ్ గెలాక్సీ A35 5G ఫీచర్లు : మిడ్ రేంజ్ ఫోన్లలో ఈ శాంసంగ్ 5జీ పవర్ఫుల్ ఫోన్. గెలాక్సీ A35 5జీ మోడల్ 6.6-అంగుళాల FHD+ సూపర్ అమోల్డ్ డిస్ప్లేతో అద్భుతమైన ఫొటోలను క్యాప్చర్ చేయొచ్చు. ఎక్సినోస్ 1380 ప్రాసెసర్ ఫోన్‌కు పవర్ అందిస్తుంది.

కెమెరా విషయానికొస్తే.. మొత్తం 3 రియర్ కెమెరాలు ఉన్నాయి. OIS, 50MP ప్రైమరీ కెమెరా సపోర్టు ఇస్తుంది. అదనంగా, 5MP మాక్రో కెమెరా, 8MP అల్ట్రా-వైడ్ కెమెరాలు ఉన్నాయి. సెల్ఫీల కోసం వీడియో కాల్స్ చేసేందుకు 13MP ఫ్రంట్ కెమెరా కూడా ఉంది.

ఈ శాంసంగ్ ఫోన్లో 5000mAh బ్యాటరీ ఉంది. ఒకసారి ఛార్జ్ చేస్తే రోజంతా వస్తుంది. 25W ఫాస్ట్ ఛార్జింగ్ కూడా సపోర్టు చేస్తుంది. సేఫ్టీ కోసం స్క్రీన్‌పై ఫింగర్‌ప్రింట్ సెన్సార్ ఉంది. IP67 రేటింగ్ ఉంది. ఈ ఫోన్ ఫ్రంట్, బ్యాక్ రెండింటిలోనూ గొరిల్లా గ్లాస్ విక్టస్ ప్లస్ ప్రొటెక్షన్ అందిస్తుంది.
