అరకు కాఫీపై ప్రధాని మోదీ ప్రశంసలు.. సీఎం చంద్రబాబు ఏమన్నారంటే..

అరకు కాఫీని గిరిజన సోదరీమణులు ప్రేమ, భక్తితో పండిస్తారని ట్వీట్ చేశారు.

అరకు కాఫీపై ప్రధాని మోదీ ప్రశంసలు.. సీఎం చంద్రబాబు ఏమన్నారంటే..

Cm Chandrababu Naidu : ప్రధాని నరేంద్ర మోదీతో కలిసి మరోసారి అరకు కాఫీ ఆస్వాదించేందుకు ఎదురు చూస్తున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. గిరిజనులు పండించే అరకు కాఫీ గొప్పతనం గుర్తు చేసుకుంటూ ప్రధాని మోదీ నరేంద్ర మోదీ సోషల్ మీడియా ఎక్స్ లో పోస్ట్ పెట్టారు. 2016లో ముఖ్యమంత్రి చంద్రబాబుతో కలిసి విశాఖలో అరకు కాఫీ రుచి చూసిన సందర్భాన్ని గుర్తు చేసుకున్నారు. మోదీ ట్వీట్ పై స్పందించిన చంద్రబాబు.. అరకు కాఫీని గిరిజన సోదరీమణులు ప్రేమ, భక్తితో పండిస్తారని ట్వీట్ చేశారు. గిరిజన సాధికారత, ఆవిష్కరణల సమ్మేళనాన్ని సూచిస్తుందని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ప్రజల అపరిమితమైన సామర్థ్యానికి ప్రతిబింబం అని స్పష్టం చేశారు. దీన్ని గుర్తించి మేడిన్ ఆంధ్ర ఉత్పత్తిని ఆమోదించినందుకు ప్రధాని మోదీకి చంద్రబాబు ధన్యవాదాలు తెలిపారు.

ఆహా ఏమి రుచి- అరకు కాఫీపై ప్రధాని ప్రశంసల జల్లు
మన్ కీ బాత్ 111వ ఎపిసోడ్ లో ప్రధాని మోదీ అరకు కాఫీ ప్రస్తావన తీసుకొచ్చారు. ”దేశంలోని అనేక ఉత్పత్తులకు ప్రపంచవ్యాప్తంగా డిమాండ్ ఉంది. అలాంటి వాటిలో అరకు కాఫీ ఒకటి. ఏపీలోని అల్లూరి జిల్లాలో 1.5లక్షల మంది గిరిజనులు పండిస్తారు. దీని రుచి, సువాసన అద్భుతం. గతంలో విశాఖ పర్యటనలో సీఎం చంద్రబాబుతో కలిసి కాఫీ రుచి చూశాను. ఎన్నో గ్లోబల్ అవార్డులు పొందిన ఈ కాఫీ.. ఢిల్లీ జీ20 సమ్మిట్ లోనూ ప్రాచుర్యం పొందింది” అని ప్రధాని మోదీ చెప్పారు.

ప్రధాని మోదీ ఇవాళ మన్ కీ బాత్ లో పాల్గొన్నారు. మూడోసారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఈ కార్యక్రమం నిర్వహించడం ఇదే తొలిసారి. ప్రతి నెల చివరి ఆదివారం నిర్వహించే ఈ కార్యక్రమానికి ఎన్నికల కోడ్ వల్ల కొన్నాళ్లు తాత్కాలికంగా బ్రేక్ పడింది. ఫిబ్రవరి 25న చివరిసారిగా మన్ కీ బాత్ లో మాట్లాడారు ప్రధాని మోదీ. మళ్లీ ఇవాళ (జూన్ 30) ప్రజలతో మమేకం అయ్యారు.

Also Read : వలంటీర్లకు స్వస్తి చెబుతున్న ప్రభుత్వం?