Allu Cinemas: అల్లు సినిమాస్ లో దర్శకుల ఫోటోలు.. మరో వివాదంలో అల్లు అర్జున్.. సోషల్ మీడియాలో ఆడేసుకుంటున్నారుగా!
అల్లు సినిమాస్(Allu Cinemas) లో దర్శకుల ఫోటోలు ఏర్పాటు చేయడంపై సరికొత్త వివాదం.
Allu Arjun in director photos controversy.
- వివాదంలో అల్లు అర్జున్
- అల్లు సినిమాస్ లో శంకర్ ఫోటో లేకపోవడంపై ఫ్యాన్స్ ఆగ్రహం
- సోషల్ మీడియాలో రచ్చ చేస్తున్న ఫ్యాన్స్
Allu Cinemas: అల్లు అర్జున్ మరో వివాదంలో చిక్కుకున్నారు. తాజాగా ఆయన అల్లు సినిమా గ్రాండ్ ఓపెనింగ్ లో పాల్గొన్న విషయం తెలిసిందే. దాదాపు 7 ఎకరాల్లో అల్లు సినిమాస్ పేరుతో ఒక భారీ మల్టీ ప్లెక్స్ ను నిర్మించారు అల్లు ఫ్యామిలీ. అయితే, ప్రపంచంలోనే మూడవ అతిపెద్ద డాల్బీ స్క్రీన్ అవడం విశేషం. దీంతో, అల్లు అర్జున్ నిర్మించిన ఈ మల్టీ ప్లెక్స్ కి ఎక్కడలేని ప్రత్యేకత సంతరించుకుంది.
ఇక, ఈ మల్టీ ప్లెక్స్ ఓపెనింగ్ కి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి హాజరైన విషయం తెలిసిందే. ఆయన చేతుల మీదుగానే ఈ మల్టీ ప్లెక్స్(Allu Cinemas) ఓపెనింగ్ కూడా జరిగింది. ఇదిలా ఉంటే, అల్లు సినిమాస్ గ్రాండ్ ఓపెనింగ్ వేల అల్లు అర్జున్ మరో వివాదంలో చిక్కున్నారు. ఈ థియేటర్ లో ఇండియా వైడ్ గా చాలా మంది గొప్ప గొప్ప దర్శకుల ఫోటోలను అక్కడ ఏర్పాటు చేశారు.
Arjun Das: అర్జున్ దాస్ బ్రేకప్ పోస్ట్.. ఎమోషనల్ కామెంట్స్ చేసిన స్టార్ యాక్టర్
వారిలో.. రాజమౌళి, సుకుమార్, త్రివిక్రమ్, మనిరత్నం, వెట్రి మారన్, రిషబ్ శెట్టి, అట్లీ ఇంకా చాలా ఫోటోలు అక్కడ ఏర్పాటు చేశారు. అయితే, వారిలో స్టార్ డైరెక్టర్ శంకర్ ఫోటో లేకపోవడం ఇప్పుడు వివాదానికి దారి తీసింది. శంకర్ ఫ్యాన్స్ చాలా మంది, శంకర్ ఫోటో లేకుండా అట్లీ ఫోటో పెట్టడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇండియన్ సినీ ఇండస్ట్రీలో శంకర్ ఒక గొప్ప దర్శకుడు. ఆయన సినిమాల గురించి, ఆయన సాధించిన విజయాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.
ఏ మధ్య కాలంలో కొన్ని ప్లాప్స్ ఇచ్చినంత మాత్రాన ఆయన స్థాయి ఎప్పటికీ తగ్గదు. అలాంటి దర్శకుడి ఫోటో లేకపోవడం బాధాకరం. అట్లీ నిన్నకాక మొన్న వచ్చిన దర్శకుడు ఆయన ఫోటో పెట్టి శంకర్ ఫోటో పెట్టకపోవడం ఏంటో అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం, ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. కొంతమంది, అది వాళ్ళ థియేటర్ వాళ్ళకి నచ్చిన వాళ్ళని పెట్టుకుంటారు మనకేంటి అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మొత్తానికి మరోసారి వివాదంలో చిక్కుకున్నాడు అల్లు అర్జున్.
