Vishwanath And Sons : సూర్య 46 మూవీ టైటిల్ ఇదే.. అదిరిపోయిన ఫస్ట్ లుక్.. జూలైలో ప్రేక్షకుల ముందుకు..
వెంకీ అట్లూరి దర్శకత్వంలో సూర్య నటిస్తున్న చిత్రానికి విశ్వనాథ్ అండ్ సన్స్ (Vishwanath And Sons) అనే టైటిల్ను ఫిక్స్ చేశారు.
Suriya 46 title is Vishwanath And Sons and release in july
- వెంకీ అట్లూరి దర్శకత్వంలో నటిస్తున్న కోలీవుడ్ నటుడు సూర్య
- ఈ చిత్రానికి విశ్వనాథ్ అండ్ సన్స్ టైటిల్ ఫిక్స్
- జూలైలో ప్రేక్షకుల ముందుకు
Vishwanath And Sons : కోలీవుడ్ స్టార్ హీరో సూర్య కథానాయకుడిగా.. లక్కీ భాస్కర్ ఫేమ్ వెంకీ అట్లూరి దర్శకత్వంలో ఓ మూవీలో నటిస్తున్నారు. సూర్య కెరీర్లో 46వ చిత్రంగా ఈ సినిమా రూపుదిద్దుకుంటోంది. ఈచిత్రానికి సంబంధించిన టైటిల్, ఫస్ట్ లుక్ను తాజాగా విడుదల చేశారు.
ఈ చిత్రానికి విశ్వనాథ్ అండ్ సన్స్ అనే టైటిల్ను ఫిక్స్ చేశారు. ఇక ఫస్ట్ లుక్ పోస్టర్లో సూర్య కళ్లద్దాలు పెట్టుకుని ఓ చిన్నారిని ఎత్తుకుని కనిపించాడు. ఈ లుక్ అదిరిపోయింది. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Shruti Haasan : బ్లాక్ డ్రెస్లో శృతి హాసన్ స్టన్నింగ్ లుక్.. బక్కచిక్కిపోయినట్లుందిగా!

ఈ చిత్రంలో ప్రేమలు ఫేం మమితా బైజు హీరోయిన్గా నటిస్తోంది. రాధికా శరత్ కుమార్, రవీనా టాండన్, భవాని స్రే, బిజోర్న్ సర్రావు కీలక పాత్రలను పోషిస్తున్నారు. జీవీ ప్రకాశ్ సంగీతాన్ని అందిస్తున్నారు. సితార ఎంటర్టైన్మెంట్స్ , ఫార్చూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్లపై నాగవంశి, సాయి సౌజన్య లు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రం జూలైలో ప్రేక్షకుల ముందుకు రానుంది.
Power in his presence. 🔥
Warmth in his embrace.🤍Bringing back the vintage magic of @Suriya_offl in a heart-touching family spectacle. 🤩#VishwanathAndSons ~ The biggest family drama of the year arrives this July. 🫶🏻#VenkyAtluri @_mamithabaiju @realradikaa @TandonRaveena… pic.twitter.com/frvwNwuU8f
— Sithara Entertainments (@SitharaEnts) March 2, 2026
