పెన్షన్ డబ్బు రూ. 2 లక్షలతో ఇద్దరు సెక్రటరీలు అదృశ్యం, తన సొంత డబ్బు ఇచ్చిన మంత్రి

లబ్దిదారులకు ఇబ్బంది కలగకుండా పెన్షన్ వెంటనే అందించాలని అధికారులతో చెప్పారు మంత్రి. తన సొంత డబ్బు ఇచ్చి పెన్షన్ల పంపిణీ పూర్తి చేశారు.

Sachivalayam Secretaries Missing : పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు మండలం లంకలకోడేరు గ్రామం పెద్దపేటలో కలకలం రేగింది. పెన్షన్ డబ్బుతో ఇద్దరు సెక్రటరీలు అదృశ్యం అయ్యారు. లబ్దిదారులకు పంపిణీ చేయాల్సిన డబ్బుతో వారు కనిపించకుండా పోయారు.

సచివాలయం గ్రేడ్ 1 సెక్రటరీ రాజేశ్ కుమార్, గ్రేడ్ 5 సెక్రటరీ బి.రాములపై పోలీసు కేసు నమోదైంది. వారికి ఫోన్ చేయగా స్విచ్చాఫ్ రావడంతో పోలీసులు చర్యలు చేపట్టారు. ఎన్టీఆర్ వృద్ధాప్య పెన్షన్ సొమ్ము 2లక్షల 50వేల 500 రూపాయలతో ఇరువురు సెక్రటరీలు అదృశ్యమయ్యారు. ఎండీవో అనుపమ ఫిర్యాదు మేరకు సెక్రటరీలపై పాలకొల్లు రూరల్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. లబ్దిదారులకు పంచాల్సిన డబ్బుతో సెక్రటరీలు అదృశ్యమయ్యారని అధికారుల ద్వారా విషయం తెలుసుకున్న జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు వెంటనే స్పందించారు. లబ్దిదారులకు ఇబ్బంది కలగకుండా పెన్షన్ వెంటనే అందించాలని అధికారులతో చెప్పారు. తన సొంత డబ్బు ఇచ్చి పెన్షన్ల పంపిణీ పూర్తి చేశారు మంత్రి నిమ్మల రామానాయుడు.

జూలై 1 రాష్ట్రవ్యాప్తంగా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈసారి వాలంటీర్లతో కాకుండా గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగులతో చంద్రబాబు ప్రభుత్వం పెన్షన్లు పంపిణీ చేయించింది. ఉదయం 6 గంటల నుంచే సచివాలయ ఉద్యోగులు ఇంటింటికి వెళ్లి ఫించన్లు అందించారు. పెరిగిన ఫించను, బకాయిలు కలిపి అందించారు. మొత్తం 65.31 లక్షల మందికి లబ్ది చేకూరింది. పెనుమాకలో సీఎం చంద్రబాబు, గొల్లపల్లిలో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ స్వయంగా లబ్దిదారులకు పెన్షన్లు అందించారు.

Also Read : తండ్రికి పూర్తి భిన్నంగా సాహస రాజకీయం.. ప్రత్యర్థుల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తున్న మహారాణి..!

ఇంత పెద్ద మొత్తంలో పెన్షన్ల పంపిణీ ప్రక్రియ ఓ రికార్డు అని ప్రభుత్వం తెలిపింది. గతంలో 2.65 లక్షల మంది వాలంటీర్లతో ఒక్కరోజులో 85శాతం మాత్రమే పంచేవారని మంత్రులు తెలిపారు.

ట్రెండింగ్ వార్తలు