ఈ నెల 6న చంద్రబాబు, రేవంత్ భేటీ కానున్న వేళ.. తెలంగాణ సీఎంకి తుమ్మల లేఖ

రామచంద్రుడు కొలువైన రామాలయంతో టెంపుల్ టౌన్‌గా భద్రాచలం ఉందని..

భద్రాచలం విలీన గ్రామ పంచాయతీలపై చొరవ తీసుకోవాలంటూ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు లేఖ రాశారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఈ నెల 6న సమావేశం కానున్న నేపథ్యంలో ఈ లేఖ రాశారు.

ఆంధ్రప్రదేశ్‌లో విలీనమైన ఎటపాక గుండాల పురుషోత్తమపట్నంతో పాటు కన్నాయిగూడెం పిచుకుల పాడు గ్రామ పంచాయతీలను భద్రాచలంలో కలపాలని అన్నారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో ఏపీలో ఏడు మండలాలు విలీనమైన విషయం తెలిసిందే. భద్రాచలం పట్టణం మినహా మిగతా గ్రామాలు ఏపీలో విలీనమయ్యాయని తుమ్మల చెప్పారు.

రామచంద్రుడు కొలువైన రామాలయంతో టెంపుల్ టౌన్‌గా భద్రాచలం ఉందని, ఆ పట్టణ శివారు నుంచి ఏపీలో విలీనమవ్వడంతో డంపింగ్ యార్డుకు స్థలం లేదని తెలిపారు. భద్రాచలం నుంచి చర్ల ప్రధాన రహదారిలో ఎటపాక ఆంధ్రాలో కలవడంతో అంతరాష్ట్ర సరిహద్దు సమస్యలు ఉన్నాయని చెప్పారు. భద్రాచలం నుంచి చర్ల వెళ్లే వారు ప్రధాన రహదారిపై ప్రయాణంలో విలీన గ్రామాల వల్ల ఏపీ మీదుగా రాకపోకల్లో సాంకేతిక పాలనాపరమైన సమస్యలు ఎదుర్కొంటున్నాయని తెలిపారు.

Also Read: విద్యుత్ కమిషన్.. కేసీఆర్ ఏం చేయనున్నారు? విచారణకు హాజరవుతారా?

ట్రెండింగ్ వార్తలు