విద్యుత్ కమిషన్.. కేసీఆర్ ఏం చేయనున్నారు? విచారణకు హాజరవుతారా?

నరసింహారెడ్డి వ్యాఖ్యలపై గులాబీ పార్టీ ఆగ్రహంతో ఉంది. విచారణకు ముందే ఓ అభిప్రాయానికి ఎలా వస్తారని బీఆర్ఎస్ నేతలు ప్రశ్నిస్తున్నారు.

విద్యుత్ కమిషన్.. కేసీఆర్ ఏం చేయనున్నారు? విచారణకు హాజరవుతారా?

KCR : విద్యుత్ కమిషన్ అంశంలో కేసీఆర్ తదుపరి వ్యూహంపై ఉత్కంఠ నెలకొంది. విద్యుత్ కమిషన్ ను రద్దు చేసేందుకు హైకోర్టు నిరాకరించడంతో తదుపరి కార్యాచరణపై కసరత్తు చేస్తోంది బీఆర్ఎస్. కమిషన్ విధానాలను పరిశీలిస్తూ తగిన వ్యూహంతో ముందుకెళ్లాలని బీఆర్ఎస్ నిర్ణయించింది. హైకోర్టు ఆదేశాలు పరిశీలించాక సుప్రీంకోర్టుకు వెళ్లాలా? వద్దా? అనేదానిపై నిర్ణయం తీసుకోనుంది. కేసీఆర్ ప్రత్యక్షంగా విచారణకు హాజరవుతారా? లేదా? అన్నది దానిపై ఉత్కంఠ నెలకొంది. విద్యుత్ వ్యవహారం దర్యాఫ్తునకు జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి విచారణ కమిషన్ ఏర్పాటు చేసింది.

అయితే, కమిషన్ ఏర్పాటుపై బీఆర్ఎస్ తొలి నుంచి అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. నరసింహారెడ్డి వ్యాఖ్యలపై గులాబీ పార్టీ ఆగ్రహంతో ఉంది. విచారణకు ముందే ఓ అభిప్రాయానికి ఎలా వస్తారని బీఆర్ఎస్ నేతలు ప్రశ్నిస్తున్నారు.

కాగా.. రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్ కొనుగోళ్లపై నరసింహారెడ్డి కమిషన్ ను ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. దీనిపై కేసీఆర్ హైకోర్టును ఆశ్రయించారు. కమిషన్ ను రద్దు చేయాలని పిటిషన్ వేశారు. అయితే, కేసీఆర్ దాఖలు చేసిన రిట్ పిటిషన్ ను తెలంగాణ హైకోర్టు కొట్టివేసిన విషయం విదితమే. నిబంధనల మేరకు కమిషన్ వ్యవహరిస్తోందని, కేసీఆర్ పిటిషన్ కు విచారణ అర్హత లేదన్న ప్రభుత్వ వాదానతో ఏకీభవించిన న్యాయస్థానం ఈ మేరకు తీర్పు ఇచ్చింది.

బీఆర్ఎస్ హయాంలో విద్యుత్ కొనుగోళ్లలో అక్రమాలు జరిగాయని ఆరోపిస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం విచారణ కోసం జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్ ను ఏర్పాటు చేసిన

Also Read : బీఆర్ఎస్ నుంచి నెక్ట్స్ వెళ్లేది ఆ ఇద్దరేనా? ఆ భయంతోనే పార్టీ మారనున్నారా?