Vivo Y28s 5G Launch : భారత్‌కు వివో Y28s 5జీ ఫోన్ వచ్చేస్తోంది.. లాంచ్‌కు ముందే ధర ఎంతో తెలిసిందోచ్!

Vivo Y28s 5G Launch : వివో Y28s 5జీ ఫోన్ బేస్ 4జీబీ ర్యామ్, 128జీబీ స్టోరేజ్ మోడల్ భారత మార్కెట్లో ధర రూ. 13,999, 6జీబీ+ 128జీబీ, 8జీబీ+ 128జీబీ వేరియంట్‌ల ధర వరుసగా రూ. 15,499, రూ. 16,999 ఉండనున్నాయి.

Vivo Y28s 5G Launch : కొత్త ఫోన్ కోసం చూస్తున్నారా? భారత మార్కెట్లోకి చైనా స్మార్ట్‌ఫోన్ దిగ్గజం వివో నుంచి సరికొత్త ఫోన్ వస్తోంది. అదే.. వివో Y28s 5జీ ఫోన్.. మీడియాటెక్ డైమెన్సిటీ 6300 SoCతో గత నెలలో కొన్ని మార్కెట్లలో విడుదలైంది. ప్రస్తుతం కంపెనీ గ్లోబల్ వెబ్‌సైట్‌లో ఫుల్ స్పెసిఫికేషన్లతో లిస్టు చేసింది.

Read Also : Vivo T3 Lite 5G Launch : కొత్త ఫోన్ కొంటున్నారా? వివో టీ3 లైట్ 5జీ వచ్చేసిందోచ్.. భారత్‌లో ధర ఎంతో తెలుసా?

వివో ఇండియాలో ఈ ఫోన్ ఎప్పుడు వస్తుంది అనేది క్లారిటీ ఇవ్వలేదు. ఈ వివో వై సిరీస్ హ్యాండ్‌సెట్ ధర వివరాలను సూచించారు. లీక్ అయిన ధర వివరాల ఆధారంగా వివో వై28ఎస్ 5జీ ఫోన్ దేశంలో బడ్జెట్ ఆఫర్‌గా అందించే అవకాశం ఉంది. ఇటీవల ఆవిష్కరించిన వై సిరీస్ ఫోన్‌ల మాదిరిగానే 50ఎంపీ డ్యూయల్ బ్యాక్ కెమెరాలు, 5,000mAh బ్యాటరీని కలిగి ఉంది.

భారత్‌లో వివో Y28ఎస్ 5జీ ధర (అంచనా) :
వివో Y28s 5జీ ఫోన్ బేస్ 4జీబీ ర్యామ్, 128జీబీ స్టోరేజ్ మోడల్ భారత మార్కెట్లో ధర రూ. 13,999, 6జీబీ+ 128జీబీ, 8జీబీ+ 128జీబీ వేరియంట్‌ల ధర వరుసగా రూ. 15,499, రూ. 16,999 ఉండనున్నాయి. మలేషియాలో, వివో వై28ఎస్ 5జీ ధర 12జీబీ + 128జీబీ స్టోరేజ్ మోడల్‌కు ఆర్ఎమ్ 799 (దాదాపు రూ. 14వేలు), 16జీబీ+ 256జీబీ స్టోరేజ్ మోడల్‌కి ఆర్ఎమ్ 999 (18,000) ఉంటుంది. ఈ హ్యాండ్‌సెట్ ధర భారత మార్కెట్లో సుమారు రూ. 15వేలు ఉండవచ్చు. ఈ ఫోన్ మోచా బ్రౌన్, ట్వింక్లింగ్ పర్పుల్ కలర్ ఆప్షన్లలో వస్తుంది.

వివో Y28s 5జీ స్పెసిఫికేషన్స్ :
వివో Y28ఎస్ 5జీ ఆండ్రాయిడ్ 14 ఆధారంగా ఫన్‌టచ్ ఓఎస్14పై రన్ అవుతుంది. 90Hz రిఫ్రెష్ రేట్, 840నిట్స్ ప్రకాశంతో 6.56-అంగుళాల హెచ్‌డీ+ (720×1,612 పిక్సెల్‌లు) ఎల్‌సీడీ స్క్రీన్‌ను కలిగి ఉంది. 8జీబీ ఎల్ పీడీడీఆర్4ఎక్స్ ర్యామ్ 256జీబీ eMMC 5.1 ఆన్‌బోర్డ్ స్టోరేజ్‌తో మీడియాటెక్ డైమెన్సిటీ 6300 చిప్‌సెట్‌పై రన్ అవుతుంది. అదనపు స్టోరేజీ ఉపయోగించి ర్యామ్‌ను వర్చువల్‌గా 16జీబీ వరకు విస్తరించవచ్చు.

ఆప్టిక్స్ విషయానికి వస్తే.. వివో Y28ఎస్ 5జీ 2ఎంపీ సెకండరీ సెన్సార్‌తో పాటు 50ఎంపీ ప్రైమరీ సెన్సార్‌ను కలిగిన డ్యూయల్ రియర్ కెమెరా యూనిట్‌ను కలిగి ఉంది. సెల్ఫీల విషయానికి వస్తే.. ఫ్రంట్ సైడ్ 8ఎంపీ సెన్సార్‌ను కలిగి ఉంది. ఈ హ్యాండ్‌సెట్ ఐపీ64-రేటెడ్ బిల్డ్‌ను కలిగి ఉంది. వివో వై28ఎస్ 5జీలోని కనెక్టివిటీ ఆప్షన్లలో డ్యూయల్-బ్యాండ్ వై-ఫై, బ్లూటూత్, 5జీ, 3.5ఎమ్ఎమ్ ఆడియో జాక్, జీపీఎస్, బిడోయి, GLONASS, గెలీలియో, QZSS, యూఎస్‌బీ టైప్-సి కనెక్టివిటీ ఉన్నాయి.

ఎంచుకున్న ప్రాంతాలలో ఎన్ఎఫ్‌సీ సపోర్టు కూడా అందిస్తుంది. అథెంటికేషన్ కోసం సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను కలిగి ఉంది. ఆన్‌బోర్డ్ సెన్సార్‌లు యాక్సిలరోమీటర్, యాంబియంట్ లైట్ సెన్సార్, ఇ-కంపాస్, ప్రాక్సిమిటీ సెన్సార్, కలర్ టెంపరేచర్ సెన్సార్ ఉన్నాయి. వివో వై28ఎస్ 5జీ 15డబ్ల్యూ ఛార్జింగ్ సపోర్ట్‌తో 5,000mAh బ్యాటరీని కలిగి ఉంది. కంపెనీ ప్రకారం.. ఈ ఫోన్ బరువు 185 గ్రాములు ఉంటుంది.

Read Also : Vivo Pad 3 Launch : కొత్త ట్యాబ్ కొంటున్నారా? భారీ డిస్‌ప్లేతో వివో ఎల్‌సీడీ స్ర్కీన్ ట్యాబ్ 3 ఇదిగో.. ఫీచర్లు అదుర్స్, ధర ఎంతంటే?

ట్రెండింగ్ వార్తలు