కళ్ల ముందే ఘోరం జరిగిపోయింది.. వరద నీటిలో కొట్టుకుపోయిన కుటుంబం, ఒళ్లు గగుర్పొడిచే వీడియో

నీటిలో కొట్టుకుపోయిన వారిలో నలుగురు చిన్నారులు, మహిళ ఉన్నారు. ఇప్పటికే రెండు మృతదేహాలను గుర్తించారు.

Family Drown : విహార యాత్ర ఆ కుటుంబంలో తీరని విషాదం నింపింది. ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు జల సమాధి అయ్యారు. రెప్పపాటులో ఘోరం జరిగిపోయింది. అంతా చూస్తుండగానే వారు వరద నీటిలో కొట్టుకుపోయారు.

మహారాష్ట్ర పుణెలోని లోనావాలలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. వరద బీభత్స సృష్టించింది. విహారయాత్ర కోసం భూషి డ్యామ్ బ్యాక్ వాటర్ వద్దకు వెళ్లిన ఓ కుటుంబంలోని ఐదుగురు జలపాతంలో గల్లంతయ్యారు. నీటి ప్రవాహం ఎక్కువగా ఉండటంతో వారు బయటకు రాలేకపోయారు. చూస్తుండగానే నీటిలో కొట్టుకుపోయారు.

నీటిలో కొట్టుకుపోయిన వారిలో నలుగురు చిన్నారులు, మహిళ ఉన్నారు. ఇప్పటికే ముగ్గురి మృతదేహాలను గుర్తించారు. మిగతా మృతదేహాల కోసం సహాయక బృందాలు గాలిస్తున్నాయి. మృతులను సశిష్ట అన్సారీ(36), అనిమా అన్సారీ (13), ఉమెర అన్సారీ (8), అద్నాన్ అన్సారీ (4), మరియా సయ్యద్(9) గుర్తించారు. మధ్యాహ్నం 12.30గంటల సమయంలో ఈ ఘోరం జరిగిపోయింది.

పుణె సయ్యద్ నగర్ లో నివాసం ఉండే కుటుంబం విహారయాత్రకు వచ్చింది. సరదాగా గడిపేందుకు డ్యామ్ బ్యాక్ వాటర్ వద్దకు వెళ్లింది. ఇంతలో ఘోరం జరిగిపోయింది. ఒక్కసారిగా వరదనీరు పోటెత్తడంతో ఆ కుటుంబం నీటిలో కొట్టుకుపోయింది. అక్కడి నుంచి బయటపడేందుకు ఆ కుటుంబం ఎంతో ప్రయత్నించింది. స్థానికులు సైతం వారిని కాపాడేందుకు విశ్వప్రయత్నాలు చేశారు. కానీ, వరద ప్రవాహం ఎక్కువగా ఉండటంతో వారిని కాపాడలేకపోయారు. కాపాడండి అంటూ పిల్లలు గట్టిగా కేకలు పెట్టారు.

పిల్లలు చేజారిపోకుండా ఆ వ్యక్తి చాలా ప్రయత్నం చేశాడు. వారందరినీ గట్టిగా పట్టుకున్నాడు. కానీ, వరద ప్రవాహం ఎక్కువ కావడంతో అంతా నీటిలో కొట్టుకుపోయారు. కళ్ల ముందే ఓ కుటుంబం నీటిలో కొట్టుకుపోయిన ఘటన అందరినీ షాక్ కి గురి చేసింది. కాగా, ఇలాంటి ప్లేసులకు వెళ్లినప్పుడు కచ్చితంగా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. చిన్న పాటి నిర్లక్ష్యం కూడా ప్రాణాలకే ప్రమాదం తేవొచ్చు.

Also Read : పెట్రోల్ బంకులో ఘరానా మోసం.. ట్యాంక్ నింపుకున్నాడు, ఎస్కేప్ అయ్యాడు.. వీడియో వైరల్

ట్రెండింగ్ వార్తలు