పెట్రోల్ బంకులో ఘరానా మోసం.. ట్యాంక్ నింపుకున్నాడు, ఎస్కేప్ అయ్యాడు.. వీడియో వైరల్

మోసపోయామని తెలుసుకున్న పెట్రోల్ బంక్ సిబ్బంది పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనికి సంబంధించిన సీసీటీవీ ఫుటేజీ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

పెట్రోల్ బంకులో ఘరానా మోసం.. ట్యాంక్ నింపుకున్నాడు, ఎస్కేప్ అయ్యాడు.. వీడియో వైరల్

Cheating In Petrol Bunk : తెలియని వాళ్లు అయినా, తెలిసిన వాళ్లైనా.. గుడ్డిగా నమ్మారో అంతే సంగతులు. రెప్పపాటులో సర్వం దోచేస్తారు కేటుగాళ్లు. రొటీన్ గా జరిగిపోయే పనుల్లో కూడా ఎలాంటి మోసగాళ్లు తయారవుతున్నారో చెప్పేందుకు ఈ ఘటనే నిదర్శనం. చెల్లుబాటులో లేని బ్యాంకు కార్డుతో పెట్రోల్ బంక్ సిబ్బందిని బోల్తా కొట్టించాడో ఘరానా మోసగాడు. ఈ ఘటన పశ్చిమ గోదావరి జిల్లా నల్లజెర్లలో జరిగింది.

రాత్రి వేళ కారులో భారత పెట్రోలియం బంకుకి వచ్చిన ఓ వ్యక్తి ట్యాంక్ నిండా పెట్రోల్ పోయించుకున్నాడు. ఆపై కారులో తెచ్చుకున్న క్యాన్ లలో కూడా ఫుల్ గా పెట్రోల్ నింపమన్నాడు. ఈ రకంగా మొత్తంగా 25వేల రూపాయల బిల్లు చేశాడు. ఏటీఎం కార్డును పెట్రోల్ బంకు సిబ్బందికి ఇచ్చాడు.

బంకు స్టాఫ్ కార్డుని స్వైప్ చేయడానికి వెనక్కి రాగా.. అంతలోనే ఉడాయించాడు. తీరా కార్డు కూడా పని చేయడం లేదని గ్రహించిన సిబ్బంది.. అతడిని పట్టుకునేందుకు ప్రయత్నించారు. అప్పటికే ఫుల్ స్పీడ్ తో కారులో పారిపోయాడు దుండగుడు. మోసపోయామని తెలుసుకున్న పెట్రోల్ బంక్ సిబ్బంది పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనికి సంబంధించిన సీసీటీవీ ఫుటేజీ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Also Read : శభాష్ సైబర్ క్రైమ్ పోలీసులు.. ఫిర్యాదు చేసిన 11 నిమిషాల్లో 18 లక్షలు ఫ్రీజ్