Gold Rate Today : మహిళలకు శుభవార్త.. దిగొస్తున్న బంగారం, వెండి ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో నేటి ధరలు ఇవే.. పుత్తడి ధర ఎంతంటే..?
Gold Rate Today : మహిళలకు గుడ్ న్యూస్. బంగారం, వెండి ధరలు తగ్గాయి. గత కొద్దిరోజుల క్రితం వరకు భారీగా పెరిగిన గోల్డ్ రేటు.. ప్రస్తుతం క్రమంగా దిగొస్తోంది.

భారత దేశంలో శుభకార్యాల సీజన్ షురూకానుంది.. ఈనెల 19నుంచి శుభముహూర్తాలు ఉండటంతో పెళ్లి బాజాలు మోగనున్నాయి. వచ్చే రెండు నెలలు శుభముహూర్తాలు ఉండటం, పెద్ద సంఖ్యలో పెండ్లిళ్లు జరగనుండటంతో బంగారంకు భారీగా డిమాండ్ పెరగనుంది.

బంగారం, వెండి ధరలు తగ్గుముఖం పట్టాయి. అంతర్జాతీయంగా చోటు చేసుకుంటున్న పరిణామాల నేపథ్యంలో వీటి ధరలు అమాంతం తగ్గిపోతున్నాయి. సోమవారం 24 క్యారెట్ల 10గ్రాములు గోల్డ్ రేటు రూ.1300 తగ్గింది. కిలో వెండి ధర రూ.15వేలు తగ్గింది.

మంగళవారం సైతం బంగారం, వెండి ధరలు తగ్గాయి. ఉదయం (ఫిబ్రవరి 17) నమోదైన వివరాల ప్రకారం.. వీటి ధరలు భారీగా తగ్గాయి. అంతర్జాతీయ మార్కెట్లోనూ గోల్డ్ రేటు తగ్గింది. ఔన్సు గోల్డ్ పై ఏకంగా 90 డాలర్లు తగ్గింది. దీంతో ప్రస్తుతం ఔన్సు గోల్డ్ 4,950 డాలర్లకు పడిపోయింది.

ఇటీవల భారీగా పెరిగి రికార్డు గరిష్టాలకు చేరుకున్న బంగారం, వెండి ధరలు క్రమంగా కిందకు దిగి వస్తున్నాయి. అయితే, వీటి ధరలు రాబోయే రోజుల్లో మరింత తగ్గే అవకాశం ఉన్నట్లు నిపుణులు అంచనా వేస్తున్నారు. పెండ్లిళ్ల సీజన్ వేళ గోల్డ్ రేటు తగ్గుతుండటంతో మహిళలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంలో ఇవాళ్టి బంగారం ధరలను పరిశీలిస్తే.. 24క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ.1,56,430కి చేరింది. ఇక 22 క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ.1,43,390 వద్ద కొనసాగుతోంది.

దేశంలోని పలు ప్రధాన నగరాల్లో బంగారం ధరలు ఇలా ఉన్నాయి.. దేశ రాజధాని ఢిల్లీలో 22క్యారట్ల 10గ్రాముల బంగారం ధర రూ.1,43,540కాగా.. 24క్యారట్ల ధర రూ. 1,56,580కు చేరింది. ముంబై, బెంగళూరు, చెన్నై నగరాల్లో 10గ్రాముల 22క్యారట్ల పసిడి ధర రూ.1,43,390కు చేరగా.. 24క్యారట్ల ధర రూ.1,56,430కు వద్దకు చేరింది.

ఇవాళ్టి వెండి ధర ఇలా.. హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంలో ఇవాళ వెండి ధరలో స్వల్ప మార్పులు చోటు చేసుకున్నాయి. దీంతో ఆయా నగరాల్లో కిలో వెండి ధర రూ.2,64,900కు చేరింది. ఢిల్లీ, ముంబయి, బెంగళూరు నగరాల్లో కిలో వెండి రేటు రూ.2,67,900 వద్దకు చేరింది. చెన్నైలో కిలో వెండి ధర రూ. 2,64,900 వద్ద కొనసాగుతుంది.

గమనిక : పైన పేర్కొన్న ధరలు ఉదయం మార్కెట్ ప్రారంభంలో ఉన్నవి మాత్రమే. ఈ గోల్డ్, సిల్వర్ రేట్లు మారుతూ ఉంటాయి. గమనించగలరు.
