Best Realme Phones : రియల్‌మి ఫ్యాన్స్ కోసం రూ. 35వేల లోపు 6 ఖతర్నాక్ ఫోన్లు.. రెండో ఫోన్ రేంజే వేరబ్బా..!
Best Realme Phones : రియల్‌మి ఫోన్ కొనేందుకు చూస్తున్నారా? రూ. 35వేల లోపు ధరలో 6 బెస్ట్ రియల్‌మి ఫోన్లు లభ్యమవుతున్నాయి. ఏ ఫోన్ కొంటారో కొనేసుకోండి.

Best Realme Phones : రియల్‌మి ఫోన్ లవర్స్ కోసం అద్భుతమైన ఫోన్లు. ఈ మిడ్ రేంజ్ స్మార్ట్ఫోన్లు భారీ బ్యాటరీ లైఫ్, పవర్ఫుల్ పర్ఫార్మెన్స్, బెస్ట్ కెమెరా ఆప్షన్లతో అందుబాటులో ఉన్నాయి.

ఫిబ్రవరి 2026లో రూ. 35వేల లోపు ధరలో రియల్‌మి 6 బెస్ట్ ఫోన్లు లభ్యమవుతున్నాయి. ఇందులో మీకు నచ్చిన ఫోన్ ఎంచుకుని కొనేసుకోండి.

రియల్‌మి 15 ప్రో (రూ. 33,999): రియల్‌మి 15 ప్రో డ్యూయల్ 50MP రియర్ కెమెరా, 50MP సెల్ఫీ కెమెరాతో వస్తుంది. 1బీ కలర్ ఆప్షన్లతో 6.8-అంగుళాల OLED డిస్ప్లే 144Hz రిఫ్రెష్ రేట్ అందిస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్ స్నాప్‌డ్రాగన్ 7 జెన్ 4 ప్రాసెసర్‌తో రన్ అవుతుంది. రియల్‌మి యూఐ 6.0పై రన్ అవుతుంది. 7000 mAh బ్యాటరీతో వస్తుంది.

రియల్‌మి P4 పవర్ (రూ. 27,999): 10001mAh బ్యాటరీతో రియల్‌మి P4 పవర్ డైమెన్సిటీ 7400 అల్ట్రాతో రన్ అవుతుంది. 1బీ కలర్ ఆప్షన్లలో 6.8-అంగుళాల అమోల్డ్ డిస్ప్లే 144Hz రిఫ్రెష్ రేట్ అందిస్తుంది. 16MP సెల్ఫీ కెమెరాతో 50MP + 8MP రియర్ కెమెరాతో వస్తుంది.

రియల్‌మి P3 అల్ట్రా (రూ. 23,999): రియల్‌మి P3 అల్ట్రా మీడియాటెక్ డైమెన్సిటీ 8350 అల్ట్రా ప్రాసెసర్‌తో రన్ అవుతుంది. రియల్‌మి యూఐ 6.0పై రన్ అవుతుంది. 1B కలర్లతో 6.83-అంగుళాల అమోల్డ్ డిస్ప్లే 120Hz రిఫ్రెష్ రేట్ అందిస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్ 6000mAh బ్యాటరీ 80W ఛార్జర్‌తో వస్తుంది.

రియల్‌మి జీటీ 7టీ (రూ. 39,990) : 7000mAh బ్యాటరీతో రియల్‌మి జీటీ 7Tలో మీడియాటెక్ డైమన్షిటీ 8400 మ్యాక్స్ ప్రాసెసర్ ఉంది. రియల్‌మి యూఐ 6.0పై ఈ స్మార్ట్‌ఫోన్ 1బీ కలర్ ఆప్షన్లలో 6.8-అంగుళాల అమోల్డ్ డిస్ప్లే 120Hz రిఫ్రెష్ రేట్ అందిస్తుంది.

రియల్‌మి 16 ప్రో 5జీ (రూ. 34,999) : రియల్‌మి 16 ప్రో 5జీలో డ్యూయల్ 200MP + 8MP రియర్ కెమెరా, 50MP సెల్ఫీ కెమెరా ఉన్నాయి. మీడియాటెక్ డైమెన్సిటీ 7300 మ్యాక్స్ ప్రాసెసర్‌తో పాటు రియల్‌మి యూఐ 7.0పై రన్ అవుతుంది. 6.78-అంగుళాల అమోల్డ్, 1B కలర్ ఆప్షన్లు, 144Hz రిఫ్రెష్ రేట్ 6500-నిట్ పీక్ బ్రైట్నెస్ అందిస్తుంది.

రియల్‌మి 15టీ (రూ. 22,499) : రియల్‌మి 15Tలో 50MP + 2MP రియర్ కెమెరా, 50MP సెల్ఫీ కెమెరా ఉన్నాయి. మీడియాటెక్ డైమన్షిటీ 6400 మ్యాక్స్ ప్రాసెసర్ ద్వారా ఈ యూనిట్ 1బీ కలర్స్‌తో 6.57-అంగుళాల అమోల్డ్ డిస్ప్లే 120Hz రిఫ్రెష్ రేట్ అందిస్తుంది. 7000mAh బ్యాటరీ, 60W ఛార్జర్‌తో వస్తుంది.
