ఇప్పటికే విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ.. ఇప్పుడు రవీంద్ర జడేజా

Ravindra Jadeja: ‘మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెబుతూ నేను టీ20 అంతర్జాతీయ మ్యాచ్‌లకు వీడ్కోలు పలుకుతున్నాను’ అని చెప్పాడు.

అంతర్జాతీయ టీ20 ఫార్మాట్‌కు ఇప్పటికే విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ రిటైర్మెంట్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఇప్పుడు రవీంద్ర జడేజా కూడా అదే నిర్ణయం తీసుకున్నాడు. టీ20ల నుంచి రిటైర్మెంట్ తీసుకుంటున్నట్లు తెలిపాడు. ఈ విషయంపై ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశాడు.

‘మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెబుతూ నేను టీ20 అంతర్జాతీయ మ్యాచ్‌లకు వీడ్కోలు పలుకుతున్నాను. గర్వంగా దూసుకెళ్తున్న బలమైన గుర్రంలా నేను నా దేశం కోసం వీలైనంత అత్యుత్తమంగా ఆడాను. ఇతర ఫార్మాట్‌లలో మాత్రం నా ప్రయాణాన్ని కొనసాగిస్తాను. టీ20 ప్రపంచకప్‌ను గెలవడంతో ఓ కల నిజమైంది. ఇది నా టీ10 అంతర్జాతీయ కెరీర్‌లో అతి గొప్ప విషయం. మద్దతు ఇచ్చినందుకు కృతజ్ఞతలు’ అని రవీంద్ర జడేజా అన్నారు.

వన్డేలు, టెస్టుల్లో కొనసాగుతానని రవీంద్ర జడేజా చెప్పాడు. జడేజా 2009లో శ్రీలంకపై టీ20ల్లో అరంగేట్రం చేశాడు. 74 టీ20 మ్యాచ్‌లు ఆడి 515 పరుగులు చేశాడు. 54 వికెట్లు పడగొట్టాడు. 15 ఏళ్లుగా భారత క్రికెట్‌లో సేవలు అందించాడు. ఇటీవల ఫామ్‌లో లేమితో ఆకట్టుకోలేకపోయాడు.

 

Rahul Dravid : ప్ర‌పంచ‌క‌ప్ గెలిచిన త‌రువాత ద్ర‌విడ్ కీల‌క వ్యాఖ్య‌లు.. ప్లేయ‌ర్‌గా గెల‌వ‌లేక‌పోయా.. కానీ..

ట్రెండింగ్ వార్తలు