Mothers Love: తల్లికి మాటల్లో చెప్పలేని సంతోషాన్ని అందించిన కొడుకు

ఎన్ని కష్టాలు ఎదురైనా తట్టుకుని తనలో తానే అనుభవిస్తుంటుంది తల్లి. ఇల్లు, పిల్లలే లోకంగా బ్రతికే తల్లికి ఓ కొడుకు ఇచ్చిన చిరు కానుక ఆమెకు ఎనలేని సంతోషాన్ని తెచ్చిపెట్టింది

Mothers Love: పిల్లల సంతోషం కోసం తల్లి ఎంతో ఆరాటపడుతుంది. ఎప్పుడు వంటింటికే పరిమతయ్యే తల్లి..పిల్లల ఆనందమే తన ఆనందంగా భావిస్తుంది. ఎన్ని కష్టాలు ఎదురైనా తట్టుకుని తనలో తానే అనుభవిస్తుంటుంది. ఇల్లు, పిల్లలే లోకంగా బ్రతికే తల్లికి ఓ కొడుకు ఇచ్చిన చిరు కానుక ఆమెకు ఎనలేని సంతోషాన్ని తెచ్చిపెట్టింది. తల్లి ముఖంలో చెప్పలేని సంతోషాన్ని చూసిన కొడుకు ఆ క్షణాన్ని పదిలంగా దాచుకోవాలని భావించి వీడియో రికార్డు చేశాడు.

Also read: Millionaire Pigeons: పావురాల పేరుమీద కోట్ల రూపాయల ఆస్తులు, మన ఇండియాలోనే

తమిళనాడుకు చెందిన ఓ యువకుడు తన తల్లి పుట్టినరోజు సందర్భంగా ఆమెకు మంచి బహుమతి ఇవ్వాలని భావించాడు. కుటుంబానికి దూరంగా ఉంటున్న తనతో మాట్లాడేందుకు తల్లికి ఒక ఫోన్ కొని.. దాన్ని ఒక సంచిలో దాచి తన తల్లికి అందించాడు. సంచిని అందుకున్న ఆ తల్లి అందులో ఉన్న ఒక్కొక్క వస్తువును తీసి బయటపెట్టింది. చివరగా వచ్చిన మరొక చిన్న సంచిని చూసిన ఆ తల్లి అందులో సెల్ ఫోన్ ఉందని గ్రహించి.. అమితానందంతో పొంగిపోయింది. కొడుకుని హత్తుకుని తన సంతోషాన్ని గుండెల్లో నింపుకుంది. అనంతరం కుర్చీలో కూర్చుని తన కుమారుడు ఇచ్చిన బహుమతిని తనివితీరా చూసుకుంది.

Also read: Weird Food: బాతు తలను యధాతధంగా వండి వడ్డించిన రెస్టారెంట్

ఇక ఈ వీడియోను ప్రముఖ నటుడు ఆర్.మాధవన్ తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేయగా అది సూపర్ వైరల్ అయింది. అమ్మ సంతోషానికి వెల లేదు అంటూ మాధవన్ ఈ వీడియోను షేర్ చేశాడు. ఈ వీడియోను విగ్నేష్ అనే వ్యక్తి సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా.. అది చూసిన నెటిజన్లు అమ్మకు అంత సంతోషం కలగడం అపురూపం అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

Also read: Smart Zoom Lens: మొట్టమొదటిసారిగా స్మార్ట్ ఫోన్స్ కోసం “లెన్స్” తెచ్చిన “TECNO”

ట్రెండింగ్ వార్తలు