అమెరికా వెళ్లిన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు.. ఎందుకంటే?

సుమారు రెండు నెలలకుపైగా ఎన్నికల ప్రచారంకోసం వరుస పర్యటనలతో తలమునకలైన ఏపీ మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అమెరికాకు వెళ్లారు.

Chandrababu Naidu and Bhuvaneswari (credit - google)

Chandrababu America tour : సుమారు రెండు నెలలకుపైగా ఎన్నికల ప్రచారంకోసం వరుస పర్యటనలతో తలమునకలైన ఏపీ మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అమెరికాకు వెళ్లారు. ఆయన సతీమణి భువనేశ్వరితో కలిసి శనివారం అర్థరాత్రి హైదరాబాద్ నుంచి అమెరికాకు వెళ్లారు. వైద్య పరీక్షల నిమిత్తం ఆయన అమెరికా వెళ్లినట్లు పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. గతంలోకూడా ఒకసారి చంద్రబాబు అమెరికాలో వైద్య పరీక్షలు చేయించుకున్నారు. వారంపాటు చంద్రబాబు, ఆయన సతీమణి అమెరికాలో ఉండనున్నట్లు తెలిసింది. కొద్దిరోజుల్లో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ కూడా అమెరికా వెళ్లనున్నట్లు తెలుస్తోంది.

Also Read : Narendra Modi : నరేంద్ర మోదీ బయోపిక్.. మోదీ పాత్రలో నటించేది ఎవరో తెలుసా?

ఏపీలో ఈనెల 13న 175 అసెంబ్లీ, 25 పార్లమెంట్ నియోజకవర్గాలకు ఎన్నికల పోలింగ్ జరిగింది. అభ్యర్థుల భవితవ్యం ఈవీఎంలలో నిక్షిప్తమైంది. జూన్ 4న ఫలితాలు వెల్లడికానున్నాయి. అయితే, రెండు నెలలుగా ఏపీలో హోరాహోరీగా ప్రచారం సాగింది. చంద్రబాబు, పవన్ కల్యాణ్ తో పాటు సీఎం జగన్ మోహన్, వైఎస్ షర్మిల విస్తృత ప్రచారం నిర్వహించారు. రెండు నెలలుగా ఎలాంటి విరామం లేకుండా ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న నేతలు.. రిలాక్స్ అవుతున్నారు. ఇప్పటికే సీఎం జగన్ మోహన్ రెడ్డి లండన్ పర్యటనకు వెళ్లిన సంగతి తెలిసిందే. చంద్రబాబు సైతం ఆయన సతీమణి భువనేశ్వరితో కలిసి అమెరికాకు వెళ్లారు. అయితే, చంద్రబాబు వైద్య పరీక్షల నిమిత్తం అమెరికా వెళ్లారు. చంద్రబాబు వారం రోజుల్లో స్వదేశానికి తిరిగిరానుండగా.. సీఎం జగన్ జూన్ 2 లేదా 3 తేదీల్లో స్వదేశానికి చేరుకోనున్నారు.