Acharya: ఆచార్య పాఠాలు అక్కడ లేనట్టేనా?

మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘ఆచార్య’ చిత్రం షూటింగ్ పనులు ఎప్పుడో పూర్తి చేసుకున్నా, ఇంకా రిలీజ్‌కు మాత్రం నోచులేకోదు. దీంతో ఈ సినిమా ఎప్పుడెప్పుడు.....

Acharya: మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘ఆచార్య’ చిత్రం షూటింగ్ పనులు ఎప్పుడో పూర్తి చేసుకున్నా, ఇంకా రిలీజ్‌కు మాత్రం నోచులేకోదు. దీంతో ఈ సినిమా ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని మెగా ఫ్యాన్స్‌తో పాటు ప్రేక్షకులు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాను స్టార్ డైరెక్టర్ కొరటాల శివ తనదైన మార్క్‌తో తెరకెక్కిస్తుండగా, ఈ సినిమాలో చిరంజీవి సరికొత్త లుక్‌లో మనకు కనిపిస్తున్నాడు. ఇక ఇప్పటికే ఈ సినిమా పోస్టర్స్, టీజర్స్, సాంగ్స్ ఈ సినిమాపై అంచనాలను రెట్టింపు చేశాయి.

Acharya: ఎట్టకేలకు ఆచార్య వస్తున్నాడోచ్!

అయితే ఈ సినిమాను కొరటాల శివ పాన్ ఇండియా మూవీగా రిలీజ్ చేయాలని చూస్తున్నాడు. అయితే దక్షిణాదిన చిరంజీవికి మంచి క్రేజ్ ఉండటంతో ఇక్కడ ఆచార్య సినిమాను రిలీజ్ చేసినా మంచి రిజల్ట్ రావడం ఖాయమని చిత్ర వర్గాలు అంటున్నాయి. కానీ సమస్యంతా బాలీవుడ్‌తోనే వస్తుందని ఆచార్య టీమ్ భావిస్తోంది. బాలీవుడ్‌లో ఇటీవల పాన్ ఇండియా సినిమాలకు మంచి రెస్పాన్స్ దక్కుతుండటంతో ఇక్కడి సినిమాలను అక్కడ భారీ ఎత్తున రిలీజ్ చేయాలని చూస్తున్నారు. ఆర్ఆర్ఆర్ చిత్రంలో రామ్ చరణ్ పర్ఫార్మెన్స్‌కు బాలీవుడ్ పట్టం కట్టింది. కాగా ఆచార్య చిత్రంలోనూ చరణ్ ఓ కీలక పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే.

దీంతో ఆచార్య చిత్రాన్ని కూడా బాలీవుడ్‌లో రిలీజ్ చేయాలని చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తుంది. కానీ ఇప్పటివరకు బాలీవుడ్‌కు సంబంధించి ఎలాంటి ప్రమోషన్స్ కూడా చిత్ర యూనిట్ స్టార్ట్ చేయకపోవడంతో ఈ సినిమాను అక్కడ రిలీజ్ చేస్తారా లేదా అనేది ఇప్పుడు సందేహంగా మారింది. అయితే చరణ్ క్రేజ్‌ను దృష్టిలో పెట్టుకుని ఈ సినిమాను అక్కడ రిలీజ్ చేస్తే, ఈ సినిమాలో ఆయన పాత్ర నిడివికి.. అక్కడి జనాలు ఎలాంటి రిజల్ట్ ఇస్తారా అని చిత్ర యూనిట్ ఆలోచనలో పడింది.

Acharya: హిందీలోకి ఆచార్య.. చెర్రీ పాపులారిటీ క్యాష్ చేసుకునేందుకేనా?

అందుకే ఆచార్య చిత్రాన్ని బాలీవుడ్‌లో రిలీజ్ చేయాలా వద్దా అనే సంధిగ్ధంలో చిత్ర యూనిట్ పడినట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో సిద్ధ అనే పాత్రలో చరణ్ పర్ఫార్మెన్స్ ఆచార్య చిత్రానికి బలంగా మారనుండగా, ఈ సినిమాలో అందాల భామలు కాజల్ అగర్వాల్, పూజా హెగ్డేలు హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇక ఈ సినిమాను నిరంజన్ రెడ్డితో పాటు చరణ్ సంయుక్తంగా ప్రొడ్యూస్ చేస్తుండగా, మణిశర్మ ఈ సినిమాకు బాణీలు అందించాడు. ఏప్రిల్ 29న ఈ సినిమా రిలీజ్ అవుతుండటంతో బాలీవుడ్‌లో ఆచార్య పాఠాలు ఉన్నట్టా లేనట్టా అనే ప్రశ్న అభిమానుల్లో నెలకొంది. మరి ఈ ప్రశ్నకు చిత్ర యూనిట్ ఎలాంటి సమాధానం ఇస్తుందో చూడాలి.

ట్రెండింగ్ వార్తలు