Nothing Phone (1) : మూడు వేరియంట్లలో అదిరే ఫీచర్లతో నథింగ్ ఫోన్ (1).. జూన్ 12 నుంచే సేల్.. డోంట్ మిస్!

ప్రముఖ స్మార్ట్ ఫోన్ తయారీదారు లండన్ ఆధారిత కంపెనీ నుంచి సరికొత్త నథింగ్ ఫోన్ (1) వస్తోంది. జూలై 12న మార్కెట్లో లాంచ్ అయ్యేందుకు రెడీగా ఉంది.

Nothing Phone (1) : ప్రముఖ స్మార్ట్ ఫోన్ తయారీదారు లండన్ ఆధారిత కంపెనీ నుంచి సరికొత్త నథింగ్ ఫోన్ (1) వస్తోంది. జూలై 12న మార్కెట్లోకి అందుబాటులోకి రానుంది. అయితే సరికొత్త టెక్నాలజీతో రానున్న ఈ నథింగ్ ఫోన్ (1)కు సంబంధించి పూర్తి వివరాలు ఇంకా రివీల్ కాలేదు. నథింగ్ ఫోన్ (1) అనేది సరికొత్త టెక్నాలజీతో వస్తోంది. చక్కటి డిజైన్‌తో, నథింగ్ ఫోన్ (1) చాలా కొత్తదనాన్ని అందించనుంది. ఈ ఫోన్ వెనుక ప్యానెల్‌లో లైటింగ్ స్ట్రిప్స్‌ను కలిగి ఉంది. ఇప్పటివరకు ఏ స్మార్ట్‌ఫోన్ కంపెనీ ఇలా ప్రయత్నించలేదు. స్మార్ట్‌ఫోన్ కీలక స్పెసిఫికేషన్‌ల గురించి ఎలాంటి వివరాలు తెలియదు. కానీ, నథింగ్ ఫోన్ (1) 33W ఛార్జర్‌కు సపోర్టు ఇస్తుందని లీక్‌లు సూచిస్తున్నాయి. నథింగ్ ఫోన్ (1) రిటైల్ బాక్స్‌తో కొత్త వీడియో ఇప్పుడు ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారింది. ఆ వీడియోలో బాక్స్ స్లిమ్‌గా కనిపిస్తోంది.

nothing Phone

అయితే, ఈ ఏడాదిలో ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న స్మార్ట్‌ఫోన్ నథింగ్ ఫోన్ (1) లాంచింగ్ రోజునే సేల్ ప్రారంభం కానుంది. అయితే డిజైన్, కొన్ని ఫీచర్లకు సంబంధించి వివరాలను కంపెనీ వ్యవస్థాపకుడు కార్ల్ పేయి రివీల్ చేయలేదు. వాస్తవానికి.. నథింగ్ ఫస్ట్ ప్రొడక్ట్ ఇయర్ (1).. దీని వైర్‌లెస్ ఇయర్‌బడ్‌లు, 400,000 యూనిట్లకు పైగా అమ్ముడయ్యాయి. ఇయర్ (1) ధర, డిజైన్, క్వాలిటీ ఆకట్టుకునేలా ఉన్నాయి. ప్రారంభంలో ఈ ఇయర్ బడ్స్ సంస్థకు మంచి ప్రారంభాన్ని అందించాయి. ఇయర్ (1) విజయంతో నథింగ్ కంపెనీ నథింగ్ ఫోన్ (1) స్మార్ట్ ఫోన్ తీసుకొస్తోంది. ఈ ఫోన్ స్నాప్‌డ్రాగన్ 778g+ ప్రాసెసర్‌తో రానుందని అంచనా. అలాగే ఆండ్రాయిడ్ ఆధారిత “నథింగ్ OS”లో రన్ అవుతుందని కంపెనీ వెల్లడించింది.

స్పెషల్ LED సెటప్.. ‘గ్లిఫ్ ఇంటర్‌ఫేస్’ డ్యుయల్ కెమెరా :

ఈ కొత్త డివైజ్ వెనుకవైపు ‘గ్లిఫ్ ఇంటర్‌ఫేస్’ అని పిలిచే ప్రత్యేకమైన LED సెటప్‌తో డ్యూయల్ కెమెరా సెటప్‌తో రానుంది. ఈ ఫోన్ (1) 120 hz రిఫ్రెష్ రేట్‌తో 6.55″ అమోల్డ్ డిస్‌ప్లే, ఇన్-డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్, 50 MP ప్రైమరీ కెమెరా, 16MP అల్ట్రావైడ్, ఫ్రంట్ కెమెరా సెన్సార్‌లతో రానుందని నివేదికలు సూచిస్తున్నాయి. ఈ ఫోన్ (1) 4,500 mAh బ్యాటరీతో ఫాస్ట్ వైర్‌లెస్ రివర్స్ ఛార్జింగ్‌ను కలిగి ఉంటుందని లీక్‌లు సూచిస్తున్నాయి. ఈ నథింగ్ (1) డివైజ్ మూడు వేరియంట్‌లలో లాంచ్ అవుతుందని నివేదికలు సూచిస్తున్నాయి.

8GB RAM + 128 GB స్టోరేజీ, 8GB RAM + 256 GB స్టోరేజీ, 12 GB RAM + 256 GB స్టోరేజీతో రానుంది. ఈ ఫోన్ పోటీ ధర రూ.29,000 కి విక్రయించే అవకాశం ఉంది. బేస్ వేరియంట్ ఫ్లిప్‌కార్ట్‌లో స్పెషల్ సేల్‌తో అందుబాటులో ఉంటుంది. మొబైల్ ఫోన్‌ను ముందస్తుగా కొనుగోలు చేయడానికి ఈకామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ ప్రీ-ఆర్డర్ పాస్‌లను విక్రయించగా.. హాట్‌కేక్‌ల్లా అమ్ముడయ్యాయి. ప్రీ-ఆర్డర్ పాస్‌లను కొనుగోలు చేసిన వినియోగదారులంతా జూలై 18లోపు ఈ నథింగ్ (1) ఫోన్‌ను కొనుగోలు చేయవచ్చు. అధికారిక లాంచ్ ముందు ఇలాంటి లీకులు సాధారణమే.. ప్రస్తుతానికి, డివైజ్ ధర అంచనా, ఎలాంటి స్పెసిఫికేషన్‌లతో రానుందో ఓసారి చూద్దాం.

Know About “nothing” Phone

నథింగ్ ఫోన్ (1) ధర (అంచనా) :
నివేదిక ప్రకారం.. నథింగ్ ఫోన్ అంతర్జాతీయ మార్కెట్‌లలో $400 (దాదాపు రూ. 31,600) కన్నాతక్కువ ధరకు రాదు. 8GB RAM, 128GB ఇంటర్నల్ స్టోరేజీతో నథింగ్ ఫోన్ (1) బేస్ వేరియంట్ ధర $397 (దాదాపు రూ. 31,400). 8GB + 256GB, 12GB + 256GB స్టోరేజీ ఆప్షన్ ధర $419 (దాదాపు రూ. 33,100), $456 (దాదాపు రూ. 36,000). భారత్ దేశంలో ధర రూ. 30వేల లోపు ఉంటుంది.

నథింగ్ ఫోన్ (1): స్పెసిఫికేషన్లు :
నథింగ్ ఫోన్ (1) సెల్ఫీ కెమెరాతో వస్తోంది. ఫ్రంట్ సైడ్ పంచ్-హోల్ కటౌట్‌తో 6.55-అంగుళాల FHD+ AMOLED డిస్‌ప్లేతో రానుంది. స్మార్ట్‌ఫోన్ స్నాప్‌డ్రాగన్ 778+ 5G చిప్‌సెట్ ద్వారా 12GB వరకు LPDDR5 RAM, 256GB UFS 3.1 స్టోరేజ్‌తో రానుంది. ఈ ఫోన్ నథింగ్ OS కస్టమ్ స్కిన్‌తో బాక్స్ Android 12 రన్ అయ్యే అవకాశం ఉంది. ఆప్టిక్స్ పరంగా చూస్తే.. నథింగ్ ఫోన్ (1) వెనుక భాగంలో డ్యూయల్-కెమెరా సెటప్‌తో రానుంది. 50MP ప్రైమరీ సెన్సార్, 16MP సెకండరీ అల్ట్రా-వైడ్-యాంగిల్ లెన్స్ ఉన్నాయి.

Everything You Need To Know About “nothing” Phone (1)

ఫ్రంట్ సైడ్ స్మార్ట్‌ఫోన్ సెల్ఫీల కోసం 16-MP కెమెరాతో రానుందని భావిస్తున్నారు. నథింగ్ ఫోన్ (1) 33W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్టుతో 4,500mAh బ్యాటరీతో రానుందని భావిస్తున్నారు. ఫోన్ ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్‌తో వస్తుందని భావిస్తున్నారు. డాల్బీ అట్మోస్, స్టీరియో స్పీకర్లకు సపోర్టు ఇస్తుందని అంచనా. కనెక్టివిటీ ఆప్షన్లలో 5G, 4G LTE, Wi-Fi 6, బ్లూటూత్ 5.1, GPS, NFC సపోర్టు కూడా ఉండే అవకాశం ఉంది.

Read Also : Nothing Phone (1) : ఛార్జర్ లేకుండానే నథింగ్ ఫోన్ (1).. ఇదిగో లీక్ వీడియో..!

ట్రెండింగ్ వార్తలు