OnePlus 12 Key Specifications : కెమెరా ఫీచర్లతో వన్‌ప్లస్ 12 ఫోన్ వచ్చేస్తోంది.. లాంచ్‌కు ముందే డిజైన్, కీలక స్పెషిఫికేషన్లు లీక్..!

OnePlus 12 Key Specifications : వన్‌ప్లస్ 12 క్వాల్‌కామ్ Snapdragon 8 Gen 3 SoC నుంచి పవర్ అందిస్తుంది. కొత్త చిప్‌సెట్ మెరుగైన గేమింగ్ Adreno 750 GPUని కూడా అందిస్తుంది.

OnePlus 12 key Specifications, design leaked much before expected launch

OnePlus 12 Key Specifications : ప్రముఖ స్మార్ట్‌ఫోన్ మేకర్ వన్‌ప్లస్ (OnePlus) నుంచి సరికొత్త ఫోన్ వస్తోంది. లాంచ్‌కు ముందే వన్‌ప్లస్ 12 కీలక ఫీచర్లు లీకయ్యాయి. ఈ ఏడాది ప్రారంభంలో లాంచ్ అయిన (OnePlus 11 5G) ప్రో వెర్షన్‌ కాకుండా వన్‌ప్లస్ 12 మోడల్ తీసుకొస్తోంది. రాబోయే నెలల్లో నేరుగా OnePlus 12 ఫోన్ లాంచ్ చేసే అవకాశం ఉంది. లీక్‌స్టర్ ఆన్‌లీక్స్‌తో (SmartPrix) ప్రకారం.. కొత్త (OnePlus 12) రౌండ్ బ్యాక్ కెమెరా మాడ్యూల్‌తో ఇప్పటికే ఉన్న వన్‌ప్లస్ మాదిరిగానే కనిపిస్తుంది. కానీ, ఇందులో ఒక ముఖ్యమైన మార్పు పెరిస్కోప్ కెమెరాలను అందించనుంది. Huawei, Samsung ఫోన్‌లలో ఈ కెమెరా ఫీచర్లు బాగా పాపులర్ అయ్యాయి. సాధారణంగా స్మార్ట్‌ఫోన్‌లలోని పెరిస్కోప్ కెమెరాలు ట్రెడేషనల్ ఆప్టికల్ జూమ్ కెమెరాల కన్నా అనేక బెనిఫిట్స్ అందిస్తాయి.

Read Also : OnePlus vs iQoo : వన్‌ప్లస్ నార్డ్ 3 vs ఐక్యూ నియో 7 ప్రో.. ఫీచర్లు చూస్తే ఫిదానే.. ఇందులో ఏ ఫోన్ కొంటే బెటర్ అంటే?

ముందుగా, ట్రెడేషనల్ ఆప్టికల్ జూమ్ కెమెరాలతో పోలిస్తే.. మెరుగైన జూమింగ్ సామర్థ్యాలను పొందవచ్చు. పెరిస్కోప్-శైలి కెమెరా ప్రామాణిక 2X టెలిఫోటో కెమెరాతో స్మార్ట్‌ఫోన్ కన్నా మెరుగైన ఆప్టికల్ జూమ్ పరిధిని కూడా అందిస్తుంది. వన్‌ప్లస్ 12 ఫోన్ Qualcomm మోడల్ ఇంకా ప్రకటించలేదు. Snapdragon 8 Gen 3 నుంచి పవర్ అందిస్తుందని నివేదిక తెలిపింది. ఈ కొత్త చిప్‌సెట్ మెరుగైన గేమింగ్, గ్రాఫిక్స్ Adreno 750 GPUని అందించనుంది. మరో పెద్ద అప్‌డేట్ బ్యాటరీలో ఉంటుంది. ఈ ఫోన్ 150W ఫాస్ట్ ఛార్జింగ్‌తో 5,000mAh బ్యాటరీని కలిగి ఉంటుంది. ప్రస్తుత OnePlus 10R అదే విధమైన ఛార్జింగ్ స్పీడ్ అందిస్తుంది. అయినప్పటికీ, ఈ ఫోన్ 50W వైర్‌లెస్ ఛార్జింగ్‌కు కూడా సపోర్టు అందిస్తుంది. ప్రో వన్‌ప్లస్ కానీ ఫోన్‌లలో ఇదే అరుదైన ఫీట్ అని చెప్పవచ్చు.

OnePlus 12 key Specifications, design leaked much before expected launch

వన్‌ప్లస్ 12 ఫోన్ కొత్త 50MP IMX9xx ప్రైమరీ కెమెరా సెన్సార్‌ను కలిగి ఉండవచ్చని నివేదిక తెలిపింది. 1-అంగుళాల కెమెరా సెన్సార్ కావచ్చు. సోనీ త్వరలో లాంచ్ చేయనుంది. Xiaomi 13 ప్రోలో Sony IMX989కి సక్సెసర్ కానుంది. ప్రైమరీ కెమెరాను 50MP అల్ట్రా-వైడ్ కెమెరా, 64MP పెరిస్కోప్ కెమెరాతో రానుంది. ఇతర అంచనా ఫీచర్లలో Android 14, LPDDR5x RAM, UFS 4.0 స్టోరేజీ, 120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.7-అంగుళాల QHD+ OLED డిస్‌ప్లే, ఆడియో మోడ్‌ల మధ్య మారడానికి అలర్ట్ స్లయిడ్ ఉండవచ్చు. ఈ ఫోన్ ధర రూ. 50వేల కన్నా ఎక్కువ ఉంటుందని భావించవచ్చు. ధర గురించి ఎలాంటి వివరాలను రివీల్ చేయలేదు.

వన్‌ప్లస్ 11 ప్రారంభ ధర రూ. 56,999తో వస్తుంది. ఈ ఫోన్ ప్రో మోడల్‌లు సాధారణంగా రూ. 60వేల కన్నా ఎక్కువగా ఉంటాయి. ఆగస్ట్-సెప్టెంబర్ నాటికి OnePlus మొట్టమొదటి OnePlus V ఫోల్డ్ (లేదా OnePlus ఓపెన్) ఫోల్డింగ్ స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్ చేసేందుకు రెడీగా ఉంది. 2023 చివరిలో ఈ ఫోన్ లాంచ్ అయ్యే అవకాశం ఉంది. లాంచ్ తేదీ కూడా అస్పష్టంగానే ఉంది. డిసెంబర్ లేదా జనవరి నాటికి OnePlus 12 లాంచ్ కావచ్చు.

Read Also : Maruti Suzuki Fronx CNG : అద్భుతమైన ఫీచర్లతో మారుతి సుజుకి ఫ్రాంక్స్ CNG వెర్షన్.. కొత్త కారు ధర ఎంతంటే?

ట్రెండింగ్ వార్తలు