BSNL New Customers : జియో, ఎయిర్‌టెల్ వద్దు.. బీఎస్ఎన్ఎల్‌ ముద్దు.. భారీగా పెరుగుతున్న కొత్త కస్టమర్లు..!

BSNL New Customers : టారిఫ్‌ ధరల పెంపు తర్వాత బీఎస్ఎన్ఎల్ కస్టమర్ల సంఖ్య పెరుగుతోంది. జూలై 3 నుంచి జూలై 4 తేదీలలో జియో, ఎయిర్‌టెల్, వొడాఫోన్ ఐడియా తమ మొబైల్ టారిఫ్‌లను 11శాతం నుంచి 25 శాతం మేర పెంచాయి.

BSNL witnesses massive surge in new customers after Reliance Jio, Airtel price hike

BSNL New Customers : ప్రముఖ దేశీయ టెలికం దిగ్గజాలైన రిలయన్స్ జియో, భారతీ ఎయిర్‌టెల్, వోడాఫోన్ ఐడియా కంపెనీలు మొబైల్ రీఛార్జ్ ధరలను అమాంతం పెంచేశాయి. దాంతో ప్రైవేట్ టెలికం కంపెనీల యూజర్లు అంత మొత్తంలో రీఛార్జ్ ప్లాన్లను కొనుగోలు చేయలేక భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (బీఎస్ఎన్ఎల్) వైపు ఆసక్తి చూపిస్తున్నారు.

Read Also : Jio New Annual Plan : జియో యూజర్ల కోసం కొత్త వార్షిక ప్లాన్లు.. నెలకు రూ.276.. ఏడాదంతా ఎంజాయ్ చేయొచ్చు!

జియో, ఎయిర్‌టెల్ టారిఫ్‌ ధరల పెంపు తర్వాత బీఎస్ఎన్ఎల్ కస్టమర్ల సంఖ్య పెరుగుతోంది. జూలై 3 నుంచి జూలై 4 తేదీలలో ప్రైవేట్ టెలికాం కంపెనీలు-రిలయన్స్ జియో, ఎయిర్‌టెల్, వొడాఫోన్ ఐడియా తమ మొబైల్ టారిఫ్‌లను 11శాతం నుంచి 25 శాతం మేర పెంచాయి. ఈ క్రమంలో సోషల్ మీడియా వేదికగా ‘బీఎస్ఎన్ఎల్‌కి ఘర్ వాప్సీ’ ‘BoycottJio’ వంటి హ్యాష్‌ట్యాగ్‌లతో ట్రెండ్ అవుతున్నాయి.

బీఎస్ఎన్ఎల్ వార్షిక డేటా ప్లాన్ ధర ఎంతంటే? :
ది ఎకనామిక్ టైమ్స్ నివేదిక ప్రకారం.. ఈ టారిఫ్ పెంపుల నుంచి మొబైల్ నంబర్ పోర్టబిలిటీ (MNP)ని ఉపయోగించి 2 లక్షల 50వేల మంది బీఎస్ఎన్ఎల్ నెట్‌వర్క్‌కు మారారు. బీఎస్ఎన్ఎల్ కూడా దాదాపు 2.5 మిలియన్ కొత్త కనెక్షన్‌లను అందుకుంది.

ఎందుకంటే.. ఈ ప్రభుత్వం టెలికం దిగ్గజం మొబైల్ టారిఫ్‌లు ఇప్పటికీ తక్కువ ధరకు వినియోగదారులకు అందుబాటులో ఉన్నాయి. బీఎస్ఎన్ఎల్ అందించే వార్షిక ప్లాన్లలో రూ. 600 వార్షిక డేటా ప్లాన్‌ గరిష్ట ధర పెంపుగా చెప్పవచ్చు. కానీ, ఎయిర్‌టెల్, రిలయన్స్ వార్షిక ప్యాక్ 365 రోజుల వ్యాలిడిటీతో రూ. 3,599కు అందిస్తున్నాయి. అదే మొత్తంలో డేటా (2జీబీ/రోజు)తో 395 రోజుల వ్యాలిడిటీతో బీఎస్ఎన్ఎల్ ప్లాన్ ధర రూ. 2,395కు అందిస్తోంది.

బీఎస్ఎన్ఎల్ నెలవారీ ప్లాన్లు ఇవే :
భారతీ ఎయిర్‌టెల్, వోడాఫోన్ ఐడియా నుంచి కొత్త కనీస 28 రోజుల ప్లాన్ ధర రూ. 199, రిలయన్స్ జియో నుంచి రూ. 189కు అందిస్తోంది. అదే సమయంలో, బీఎస్ఎన్ఎల్ రూ. 108 నుంచి ఇలాంటి ప్లాన్‌లను అందిస్తోంది. బీఎస్ఎన్ఎల్ రూ. 107, రూ. 199 మధ్య అనేక నెలవారీ ప్లాన్‌లను కలిగి ఉంది. అన్‌లిమిటెడ్ డేటా, వాయిస్ కాల్స్, కొన్ని ఓటీటీ యాప్‌లతో రూ. 229 ప్లాన్‌ను కలిగి ఉంది.

బీఎస్ఎన్ఎల్ దేశంలో నాల్గవ అతిపెద్ద టెలికాం కంపెనీ అయినప్పటికీ.. ప్రైవేట్ టెలికం కంపెనీలతో పోటీపడేందుకు ఇప్పటికీ కష్టపడుతోంది. కంపెనీ ఇంకా 4జీ నెట్‌వర్క్ పూర్తి చేయలేదు. మెరుగైన ధర ఉన్నప్పటికీ, బీఎస్ఎన్ఎల్ 5జీ మౌలిక సదుపాయాలను కోల్పోతోంది. అయితే, వచ్చే ఏడాది నుంచి 5జీని అందుబాటులోకి తీసుకురావాలని కంపెనీ యోచిస్తోంది.

రిలయన్స్ జియో, ఎయిర్‌టెల్ కూడా తమ కొన్ని ప్లాన్‌లతో అన్‌లిమిటెడ్ 5జీ డేటాను అందించాలని నిర్ణయించుకున్నాయి. రోజుకు 2జీబీ లేదా అంతకంటే ఎక్కువ డేటాను అందించే ఏదైనా ప్లాన్ అన్‌లిమిటెడ్ 5జీ డేటాను అందిస్తుంది. రిలయన్స్ జియో ప్రస్తుత వ్యాలిడిటీ అయ్యే ప్లాన్‌కు అన్‌లిమిటెడ్ 5జీ అందించే రూ.51 నుండి సరసమైన ప్లాన్‌లను కూడా ప్రారంభించింది.

Read Also : Honor 200 5G Series : కొత్త ఫోన్ కావాలా? టెలిఫొటో కెమెరాలతో హానర్ 200 5జీ సిరీస్ ఇదిగో.. ధర ఎంతో తెలుసా?

ట్రెండింగ్ వార్తలు