Karnataka Polls: కర్ణాటక ఎన్నికల్లో కాషాయ పార్టీని కలవర పెడుతున్న అమూల్ పాల వివాదం

అమూల్ వ్యవహరాన్ని విపక్షాలు కావాలనే వివాదంగా మారుస్తున్నాయని రాష్ట్ర ముఖ్యమంత్రి బసవరాజు బొమ్మై విమర్శించారు. నందినిపై ఈగ వాలనీయబోమని ఆయన ప్రకటించారు. దక్షిణాదికి చెందిన పలు రాష్ట్రాల పాల ఉత్పత్తుల విక్రయం ఇక్కడ జరుగుతున్నా ఎవరూ నోరు మెదపలేదని అముల్‌ విషయంలో మాత్రమే పేచీ ఎందుకని బీజేపీ విమర్శించింది

Karnataka Polls: కర్ణాటక రాష్ట్రంలో అధికారాన్ని నిలబెట్టుకోవడానికి సర్వశక్తులు ఒడ్డుతున్న భారతీయ జనతా పార్టీకి తాజాగా అమూల్ పాల వివాదం రాజకీయంగా కలవరపెడుతోంది. శాసనసభ ఎన్నికల వేళ నందిని పాల ఉత్పత్తులకు పోటీగా గుజరాత్‌కు చెందిన అమూల్‌ పాల సంస్థకు మార్కెటింగ్‌ చేసుకునేందుకు అవకాశం కల్పించడం రాజకీయంగా దుమారం రేపింది. గుజరాత్ రాజకీయ నేతల కుట్రల కారణంగా నందిని ఉనికిని ప్రమాదంలోకి నెట్టేస్తున్నారని జేడీఎస్‏తోపాటు కన్నడ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.

G Kishan Reddy : కిరణ్ కుమార్ రెడ్డి చేరిక బీజేపీపై ప్రభావం చూపదు-కిషన్ రెడ్డి

కర్ణాటక పాల సమాఖ్య (కేఎంఎఫ్‌) ఆధ్వర్యంలోని నందిని బ్రాండ్‌ను అమూల్‌తో విలీనం చేసేందుకు మొదటి ప్రయత్నం జరగిందని, అయితే దాన్ని తాము అడ్డుకున్నామని జేడీఎస్ మండిపడింది. ఆ తర్వాత పాల ప్యాకెట్లపై ‘దహి’ అనే హిందీ పదాన్ని కన్నడిగులపై బలవంతంగా రుద్దే ప్రయత్నం జరిగిందని కూడా జేడీఎస్‌ ఆగ్రహం వ్యక్తం చేసింది. తాజాగా ఇప్పుడు అమూల్‌ ఉత్పత్తులకు రాష్ట్రంలో తలుపులు తెరిచేశారని, పాడిపరిశ్రమపై ఆధారపడిన 28 లక్షల మంది రైతుల భవిష్యత్తును అంధకారంలోకి నెట్టేందుకు జరుగుతున్న కుట్రని మాజీ ముఖ్యమంత్రి హెచ్‌డీ కుమారస్వామి ఆందోళన వ్యక్తం చేశారు.

married couple protest : పోలీస్ స్టేషన్ వద్ద పెళ్లి జంట ఆందోళన.. కారణం తెలిస్తే షాకవుతారు

ఈ విషయమై కుమారస్వామి ట్విట్టర్ ద్వారా తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. వరుస ట్వీట్లు చేస్తూ రైతులు అప్రమత్తం కావాలని సూచించారు. పక్కా పథకం ప్రకారం కేఎంఎఫ్‏ను నిర్వీర్యం చేస్తున్నారని, సహకార స్ఫూర్తిని దెబ్బతీస్తున్నారంటూ విరుచుకుపడ్డారు. శాసనసభ ఎన్నికల్లో ఇది కూడా ఒక ప్రధాన ప్రచార అస్త్రంగా ఉంటుందని ప్రకటించారు. జేడీఎస్‏కు రైతుల పార్టీగా గుర్తింపు ఉన్న సంగతి తెలిసిందే. అందుకే ఈ వివాదాన్ని జేడీఎస్ తీవ్రంగా తీసుకుంది.

Hijab Row Iran: మహిళలు బుర్ఖా వేసుకున్నారా లేదా అని తనిఖీ చేసేందుకు ఇరాన్ ఎంత పని చేసింది?

అయితే అమూల్ వ్యవహరాన్ని విపక్షాలు కావాలనే వివాదంగా మారుస్తున్నాయని రాష్ట్ర ముఖ్యమంత్రి బసవరాజు బొమ్మై విమర్శించారు. నందినిపై ఈగ వాలనీయబోమని ఆయన ప్రకటించారు. దక్షిణాదికి చెందిన పలు రాష్ట్రాల పాల ఉత్పత్తుల విక్రయం ఇక్కడ జరుగుతున్నా ఎవరూ నోరు మెదపలేదని అముల్‌ విషయంలో మాత్రమే పేచీ ఎందుకని బీజేపీ విమర్శించింది. నందిని కన్నడిగులకు గర్వకారణమైన బ్రాండ్ అని, నందినికి సరిసమానంగా ఎవరూ పోటీలో నిలబడజాలరని బీజేపీ స్పష్టం చేసింది. అయినప్పటికీ నందిని వర్సెస్‌ అమూల్‌ వ్యవహారం ఎక్కడ చిక్కులు తెచ్చి పెడుతుందోనని కమలనాథులు లోలోపల ఆందోళన చెందుతున్నట్లు సమాచారం.

ట్రెండింగ్ వార్తలు