Anupama Parameswaran : మళ్ళీ బెల్లంకొండ హీరోతో అనుపమ సినిమా చేయబోతుందా? టైటిల్ ఇదేనా?

తాజాగా అనుపమ తెలుగులో మరో సినిమా ఓకే చేసినట్టు తెలుస్తుంది.

Anupama Parameswaran pair up with Bellamkonda Sai Sreenivas again after Rakshasudu Movie

Anupama Parameswaran : అనుపమ పరమేశ్వరన్ ప్రస్తుతం ఫుల్ ఫామ్ లో ఉంది. ఈగల్, టిల్లు స్క్వేర్ సినిమాలతో బ్యాక్ టు బ్యాక్ హిట్స్ కొట్టిన అనుపమ ఇటీవల ఒకేసారి మూడు సినిమాలను ప్రకటించింది. తెలుగు, మలయాళంలో సినిమాబండి ఫేమ్ దర్శకుడు ప్రవీణ్ దర్శకత్వంలో ‘పరదా’ అనే సినిమా ప్రకటించింది. వీటితో పాటు తమిళ్ లో విక్రమ్ తనయుడు ధృవ్ విక్రమ్ మారి సెల్వరాజ్ దర్శకత్వంలో ‘బైసన్’ సినిమా చేస్తుంది. అలాగే అనుపమ ఫిమేల్ లీడ్ లో తమిళ్ లో ‘లాక్ డౌన్’ అనే సినిమాని ప్రకటించారు.

తాజాగా అనుపమ తెలుగులో మరో సినిమా ఓకే చేసినట్టు తెలుస్తుంది. గతంలో అనుపమ బెల్లంకొండ శ్రీనివాస్(Bellamkonda Sai Sreenivas) తో రాక్షసుడు సినిమాలో కలిసి నటించింది. ఈ సినిమా మంచి విజయం సాధించింది. ఇప్పుడు అనుపమ మరోసారి బెల్లంకొండ శ్రీనివాస్ తో కలిసి నటించబోతుందని తెలుస్తుంది. షైన్ స్క్రీన్స్ నిర్మాణంలో వినరో భాగ్యము విష్ణుకథ ఫేమ్ డైరెక్టర్ మురళి కిషోర్ దర్శకత్వంలో ఓ సినిమా ప్రకటించారు. ఈ సినిమాలో అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటిస్తుందని సమాచారం. ఈ సినిమాకు కిష్కింధపురం అనే టైటిల్ పరిశీలనలో ఉన్నట్టు తెలుస్తుంది.

Also Read : Devara Song : ‘దేవర’ రెండో పాట కూడా రెడీ.. అప్డేట్ ఇచ్చిన రామజోగయ్య శాస్త్రి..

ఇక బెల్లంకొండ శ్రీనివాస్ ఇటీవల బాలీవుడ్ కి వెళ్లి ఛత్రపతి రీమేక్ చేసాడు. త్వరలో సాగర్ కే చంద్ర దర్శకత్వంలో ‘టైసన్ నాయుడు’ సినిమాతో రాబోతున్నాడు. ఆ తర్వాత షైన్ స్క్రీన్స్ బ్యానర్ లో, మూన్లైన్ పిక్చర్స్ బ్యానర్స్ లో సినిమాలు చేయబోతున్నాడు.