Devara Song : ‘దేవర’ రెండో పాట కూడా రెడీ.. అప్డేట్ ఇచ్చిన రామజోగయ్య శాస్త్రి..

ఎన్టీఆర్ అభిమానులు అంతా ఫస్ట్ సాంగ్ కోసం ఎదురుచూస్తుంటే లిరిక్ రైటర్ రామజోగయ్య శాస్త్రి రెండో పాట గురించి కూడా అప్డేట్ ఇచ్చి ఆశ్చర్యపరిచారు.

Devara Song : ‘దేవర’ రెండో పాట కూడా రెడీ.. అప్డేట్ ఇచ్చిన రామజోగయ్య శాస్త్రి..

NTR Devara Movie Second Song Update by Lyric Writer Ramajogaiah Sastry goes Viral

Devara Second Song Update : RRR సినిమా తర్వాత ఎన్టీఆర్ దేవర సినిమాతో వస్తుండటంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే ఈ సినిమా నుంచి గ్లింప్స్ రిలీజ్ చేసి ఆసక్తి పెంచారు. ఇక ఈ సినిమా రెండు పార్టులుగా రానుందని, దేవర పార్ట్ 1 దసరా కానుకగా అక్టోబర్ లో రానుందని తెలిపారు. ఎన్టీఆర్ పుట్టిన రోజు మే 20న ఉండటంతో దేవర సినిమా నుంచి ఒక రోజు ముందే మే 19న ఒక పాటని విడుదల చేస్తామని మూవీ యూనిట్ ప్రకటించారు.

ఎన్టీఆర్ అభిమానులు దేవర ఫస్ట్ సాంగ్ కోసం ఎదురుచూస్తున్నారు. ఆల్రెడీ చిన్న ప్రోమో కూడా రిలీజ్ చేసి అభిమానుల్ని ఖుషి చేసారు మూవీ యూనిట్. ఈ సినిమాకు అనిరుద్ సంగీతం అందిస్తున్నాడు. ఆల్రెడీ ఫస్ట్ సాంగ్ ప్రోమోలోనే అనిరుద్ ఈ సినిమాకు ఏ రేంజ్ లో మ్యూజిక్ ఇస్తున్నాడో అర్థమైంది. అభిమానులు అంతా ఫస్ట్ సాంగ్ కోసం ఎదురుచూస్తుంటే లిరిక్ రైటర్ రామజోగయ్య శాస్త్రి రెండో పాట గురించి కూడా అప్డేట్ ఇచ్చి ఆశ్చర్యపరిచారు.

Also Read : Kalki 2898 AD : పెళ్లి గురించి కాదు.. ప్ర‌భాస్ ‘క‌ల్కి 2898AD’ నుంచి అదిరిపోయే అప్‌డేట్‌..

రామజోగయ్య శాస్త్రి తన సోషల్ మీడియాలో.. ఒక్క రోజు ఓపిక పట్టండి. మన “అని”…అబ్బా…వర్తు వెయిటింగ్ అనిపిస్తాడు… మనందరినోట. రెండో పాట రికార్డింగ్ కి చెన్నై వచ్చాను. ఇది ఇంకో రకం ప్రకంపనం. అది కోత ఇది లేత అంటూ రెండో పాట కూడా రెడీ అవుతుంది అంటూ అంచనాలు పెంచేశారు. దీంతో ఎన్టీఆర్ అభిమానులు మరింత జోష్ లో ఉన్నారు.