Kalki 2898 AD : పెళ్లి గురించి కాదు.. ప్ర‌భాస్ ‘క‌ల్కి 2898AD’ నుంచి అదిరిపోయే అప్‌డేట్‌..

తాజాగా ఈ చిత్రం నుంచి అదిరిపోయే అప్‌డేట్‌ను చిత్ర బృందం విడుద‌ల చేసింది.

Kalki 2898 AD : పెళ్లి గురించి కాదు.. ప్ర‌భాస్ ‘క‌ల్కి 2898AD’ నుంచి అదిరిపోయే అప్‌డేట్‌..

Intresting update from Prabhas Kalki 2898 AD comming tomorrow

Prabhas Kalki 2898 ad : పాన్ ఇండియా స్టార్ ప్ర‌భాస్ న‌టిస్తున్న మూవీ ‘క‌ల్కి 2898AD’. నాగ్ అశ్విన్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న ఈ చిత్రంలో బాలీవుడ్ భామ దీపికా ప‌దుకొనే హీరోయిన్‌. బిగ్‌బీ అమితాబ్ బ‌చ్చ‌న్ అశ్వ‌త్థామ‌గా న‌టిస్తుండ‌గా, లోక‌నాయ‌కుడు క‌మ‌ల్ హాస‌న్ ప్ర‌తినాయ‌కుడి పాత్ర‌ను పోషిస్తున్నారు. దిశా ప‌టానీ కీల‌క పాత్ర‌లో న‌టిస్తున్న ఈమూవీని వైజ‌యంతి మూవీస్ బ్యాన‌ర్ పై నిర్మిస్తున్నారు. కాగా.. తాజాగా ఈ చిత్రం నుంచి అదిరిపోయే అప్‌డేట్‌ను చిత్ర బృందం విడుద‌ల చేసింది.

ఈ సినిమాలో ప్ర‌భాస్‌తో పాటు ఓ మెషిన్ ఉంటుంద‌ట‌. దాని పేరు బ‌జ్జి అంట‌. స‌ద‌రు బుజ్జిని రేపు (మే18 శ‌నివారం) సాయంత్రం 5 గంట‌ల‌కు ప‌రిచ‌యం చేయ‌నున్న‌ట్లు తెలియ‌జేశారు. మ‌రీ ఆ బుజ్జి ఎలా ఉంటుంది. అది రోబోనా, లేక మ‌రేదైనా అన్న విష‌యం తెలియాలంటే రేపు సాయంత్రం వ‌ర‌కు వెయిట్ చేయ‌క త‌ప్ప‌దు.

Prasanna Vadanam : సుహాస్ ‘ప్రసన్న వదనం’ ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్‌.. విడుద‌లై నెల‌రోజులు కాక‌ముందే..

కాగా.. ఈ ఉద‌యం ప్ర‌భాస్ త‌న ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో.. డార్లింగ్స్‌, ఫైన‌ల్‌గా ఒక ముఖ్య‌మైన వ్య‌క్తి మ‌న లైఫ్‌లోకి రాబోతున్నారు. వెయిట్ చేయండి అంటే పోస్ట్ చేసిన సంగ‌తి తెలిసిందే. దీంతో అంతా ప్ర‌భాస్ పెళ్లి గురించి ఏమోన‌ని అనుకున్నారు. ఈ బుజ్జి గురించే అనే విష‌యం తాజాగా అర్థ‌మ‌వుతోంది.

ఇప్ప‌టికే షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా ప్ర‌స్తుతం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు జ‌రుపుకుంటోంది. ఇక ఈ సినిమా 2024 జూన్ 27న ప్ర‌పంచ వ్యాప్తంగా ఉన్న ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.

Devara Song Promo : ‘దేవర’ ఫస్ట్ సాంగ్ ప్రోమో వచ్చేసింది.. BGM అదిరిపోయిందిగా..