Devara Song Promo : ‘దేవర’ ఫస్ట్ సాంగ్ ప్రోమో వచ్చేసింది.. BGM అదిరిపోయిందిగా..

తాజాగా దేవర సినిమా ఫస్ట్ సాంగ్ ప్రోమో రిలీజ్ చేసి అందర్నీ ఆశ్చర్యపరిచారు.

Devara Song Promo : ‘దేవర’ ఫస్ట్ సాంగ్ ప్రోమో వచ్చేసింది.. BGM అదిరిపోయిందిగా..

NTR Koratala Siva Devara First Song Promo Released

Updated On : May 19, 2024 / 4:29 PM IST

Devara Song Promo : ఎన్టీఆర్ ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ దేవర, వార్ 2 సినిమాల షూటింగ్స్ తో బిజీగా ఉన్నారు. ముంబైలో వార్ 2 షూటింగ్ జరుగుతుండగా, వైజాగ్ లో దేవర షూట్ జరుగుతుంది. ఇక మే 20 ఎన్టీఆర్ పుట్టిన రోజు ఉండటంతో అభిమానులు దేవర సినిమా అప్డేట్ కోసం ఎదురుచూస్తున్నారు. ఇటీవల దేవర మూవీ యూనిట్ ఎన్టీఆర్ పుట్టిన రోజుకు ఒక రోజు ముందే దేవర సినిమా నుంచి సాంగ్ రిలీజ్ చేస్తారని ప్రకటించారు.

తాజాగా దేవర సినిమా ఫస్ట్ సాంగ్ ప్రోమో రిలీజ్ చేసి అందర్నీ ఆశ్చర్యపరిచారు. అనిరుధ్ ఈ సాంగ్ పాడినట్లు తెలుస్తుంది. ఈ ప్రోమోలో ఎన్టీఆర్ సముద్రంలోంచి పడవలో వస్తున్నట్టు కూడా చూపించారు. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అదిరిపోయింది. దీంతో మే 19న వచ్చే సాంగ్ పై కూడా అంచనాలు నెలకొన్నాయి. మీరు కూడా ఈ సాంగ్ ప్రోమో చూసేయండి.