Prasanna Vadanam : సుహాస్ ‘ప్రసన్న వదనం’ ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్‌.. విడుద‌లై నెల‌రోజులు కాక‌ముందే..

విడుద‌లై నెల‌రోజులు కాక‌ముందే ఓటీటీలో ఈ సినిమా స్ట్రీమింగ్ కానుంది.

Prasanna Vadanam : సుహాస్ ‘ప్రసన్న వదనం’ ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్‌.. విడుద‌లై నెల‌రోజులు కాక‌ముందే..

Suhas Prasanna Vadanam streaming on ahavideoin from may 24th

Updated On : May 17, 2024 / 7:29 PM IST

Prasanna Vadanam OTT Partner : విభిన్న‌మైన క‌థ‌ల‌ను ఎంచుకుంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్న న‌టుడు సుహాస్‌. . అర్జున్ వైకే ద‌ర్శ‌క‌త్వంలో ఆయ‌న హీరోగా న‌టించిన మూవీ ప్ర‌స‌న్న వ‌ద‌నం. పాయల్ రాధాకృష్ణ హీరోయిన్‌గా న‌టించిన ఈ చిత్రంలో రాశీసింగ్, నందు, వైవా హర్ష, సాయి శ్వేత, నితిన్ ప్రసన్న కీల‌క పాత్ర‌ల‌ను పోషించారు. ఈ మూవీ మే 3న‌ ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. ఫేస్ బ్లైండ్ నెస్ అనే కాన్సెప్ట్ తో రూపుదిద్దుకున్న ఈ చిత్రానికి పాజిటివ్ టాక్ వ‌చ్చింది.

బేబీ ఫేమ్ విజయ్ బుల్గానిన్ సంగీతాన్ని అందించ‌గా జెఎస్ మణికంఠ, టిఆర్ ప్రసాద్ రెడ్డి లు నిర్మించారు. కాగా.. సినిమా విడుద‌లై నెల‌రోజులు కాక‌ముందే ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. ఈ చిత్ర ఓటీటీ హ‌క్కుల‌ను ప్ర‌ముఖ తెలుగు ఓటీటీ ప్లాట్‌ఫాం ఆహా ద‌క్కించుకుంది. ఈ సినిమాను మే 24 నుంచి స్ట్రీమింగ్ చేయ‌నున్న‌ట్లు ఆహా త‌మ సోష‌ల్ మీడియా ద్వారా వెల్ల‌డించింది. అంటే ఈ చిత్రం విడుద‌లైన 21 రోజుల్లోనే స్ట్రీమింగ్‌కు కానుండం విశేషం. ఇక ఆహా గోల్డ్ సబ్​స్క్రిప్షన్ క‌లిగిన వినియోగ‌దారులు ఒక రోజు ముందుగానే అంటే మే 23 నుంచి ఈ చిత్రాన్ని వీక్షించ‌వ‌చ్చు.

Dirty Fellow Trailer : ‘విశ్వంభర’ డైరెక్టర్ వశిష్ఠ లాంచ్ చేసిన.. ‘డర్టీ ఫెలో’ ట్రైలర్ చూశారా?

ప్రసన్న వదనం కథ విషయానికొస్తే..

సూర్య(సుహాస్)కి ఒక యాక్సిడెంట్ లో వాళ్ళ అమ్మ నాన్నలు చనిపోతారు. ఈ యాక్సిడెంట్ వల్ల సూర్యకి ఫేస్ బ్లైండ్ నెస్ (ప్రోసోపాగ్నోసియా) అనే వ్యాధి వస్తుంది. దీని వల్ల ఎవరి మొహాలను గుర్తుపట్టలేడు. అంతే కాకుండా వాయిస్ లు కూడా గుర్తుపట్టలేడు. సుహాస్ ఆర్జేగా పనిచేస్తూ ఉంటాడు. తన సమస్య ఎవరికీ తెలియకుండా మెయింటైన్ చేస్తూ వస్తాడు.

కేవలం తనతో ఉండే ఫ్రెండ్ విగ్నేష్(వైవా హర్ష)కి మాత్రమే తెలుసు. ఈ క్రమంలో తన జీవితంలోకి అనుకోకుండా ఆద్య(పాయల్) వస్తుంది. ఏదో ఒకరకంగా తను రెగ్యులర్ గా కలుస్తున్నా గుర్తుపట్టడు. కొన్ని సంఘటనల అనంతరం మంచి ఫ్రెండ్స్ అయి ఆ తర్వాత ప్రేమలో పడతారు.

Mirai : సూప‌ర్ హీరో సినిమాలో మంచు మ‌నోజ్.. గ్లింప్స్ వ‌చ్చేది అప్పుడే..

సూర్య లైఫ్ హ్యాపీగా సాగిపోతున్న టైంలో తెల్లవారుజామున ఓ అబ్బాయి ఓ అమ్మాయి(సాయి శ్వేత)ని లారీ కిందకి తోసి మర్డర్ చేయడం చూస్తాడు. కానీ అది ఎవరు చేశారో తన ఫేస్ బ్లైండ్ నెస్ ప్రాబ్లమ్ వల్ల తెలుసుకోలేడు. కానీ ఏదో ఒకటి చేయాలని పోలీసులకు బయట కాయిన్ బాక్స్ నుంచి ఫోన్ చేసి అది యాక్సిడెంట్ కాదు మర్డర్ అని చెప్తాడు. అనంతరం ఓ వ్యక్తి సూర్యపై అటాక్ చేస్తాడు.

దీంతో సూర్య పోలీస్ స్టేషన్ కి వెళ్లి ACP వైదేహి(రాశీసింగ్)కి జరిగిన విషయం, అతని సమస్య చెప్తాడు. కానీ అనుకోకుండా సూర్య అదే మర్డర్ కేసులో ఇరుక్కుంటాడు. అసలు మర్డర్ అయిన అమ్మాయి ఎవరు? ఆ అమ్మాయిని ఎవరు, ఎందుకు చంపారు? పోలీసులు ఏం చేసారు? ఈ మర్డర్ వల్ల సుహాస్ కి ఎదురైనా ఇబ్బందులు ఏంటి? అసలు సుహాస్ ని ఎవరు ఈ మర్డర్ కేసులో ఇరికించారు? సుహాస్ కి తనకున్న ఫేస్ బ్లైండ్ నెస్ ప్రాబ్లమ్ వల్ల వచ్చిన సమస్యలేంటి? తన ప్రేమ సంగతేంటి? తెలియాలంటే తెరపై చూడాల్సిందే.